ఈ బ్లాగును సెర్చ్ చేయండి

15, మే 2010, శనివారం

కులనిర్మూలన

కులాంతర మతాంతర వివాహాలకు ఇచ్చేప్రోత్సాహక మొత్తాన్ని 25000 నుండి 50000 రూపాయలకు పెంచారు.డాక్టర్ అంబేద్కర్ మొదలు అభ్యుదయవాదులు, మానవతావాదులు కులనిర్మూలన కోసం పోరాడుతున్నారు కానీ పెద్దగా ప్రయోజనం లేదు.హెచ్చుసంఖ్యలో కులాంతర వివాహాలు జరగటం వల్లమాత్రమే కులనిర్మూలన జరుగుతుంది.”రాజ్యాంగం రాసినవాడే కులాంతర, మతంతర వివాహాలకు మాత్రమే రిజర్వేషన్లను పరిమితం చేసినా ఈనాటికి కులమత ప్రసక్తిలేని, ఏ కులమో చెప్పలేని భారత జాతి గణనీయంగా పెరిగి కుల, మత కలహాలను సమసింపజేసి ఉండేది.దళిత శిక్కులు, దళిత బౌద్ధులు దళితులే నని తీర్మానిస్తూ రాజ్యాంగ సవరణ జరిగింది. దళిత క్రైస్తవులు, దళిత ముస్లిములను షెడ్యూల్డ్ కులాల వారిగానే పరిగణించాలని కేంద్ర కేబినెట్ 1997 లో ఆమోదించింది. పార్లమెంటులో బిల్లు పాస్ కాలేదు. భారత ముస్లింలలో 85% మంది పూర్వీకులు హిందూ దళితులేనని ఆంధ్రపదేశ్‌లోని క్రైస్తవులలో 98 శాతం మంది పూర్వీకులు హిందూమతంలోని దళిత కులాల నుంచి వచ్చినవారేనని మానవ వనరుల అభివృద్ధి శాఖ సలహాదారు కృష్ణన్‌ చెప్పారు. కొల్హాపూర్‌ మహారాజు తొలిసారిగా 1902లో ముస్లింలకు రిజర్వేషన్‌ ప్రవేశపెట్టారు. 1921లో మైసూర్‌ మహారాజు కూడా అదే చర్య చేపట్టారు. బాంబే ప్రెసిడెన్సీ, అనంతరం మద్రాసు ప్రెసిడెన్సీ కూడా ఈ కోటాను ప్రవేశపెట్టాయి.దళిత క్రైస్తవులను కూడా దళితులుగా గుర్తించాలని కేంద్రాన్ని కోరుతూ మన రాష్ట్రం 25.8.2009 న అసెంబ్లీలో తీర్మానం చేసింది. దీన్ని టీడీపీ, ప్రరాపా, తెరాస, ఎంఐఎం, సీపీఐలు కూడా సమర్థించాయి. భాజపా లోక్ సత్తా దీన్ని వ్యతిరేకించాయి. ఇది హిందువులకు వ్యతిరేకమని, దీనివల్ల మతమార్పిడులు ప్రోత్సహించినట్లు అవుతుందని భాజపా ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి విమర్శించారు.మత ప్రాతిపదికన రిజర్వేషన్లు రాజ్యాంగానికి వ్యతిరేకమని లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ అన్నారు. దళిత క్రిస్టియన్లు, ముస్లింలమీద ప్రేమ ఉంటే బీసీల్లోనే ఉంచి కోటా పెంచాలని కోరారు.

కుల నిర్మూన గురించి అంబేద్కర్ మాటలు:
* “కులంవల్ల ఆర్దిక శక్తియుక్తులేమీ సమకూడవు.కులంవల్ల జాతి కూడా ఏమీ వికసించదు,వికసించలేదు.కానీ కులం ఒకపని చేసింది.అది హిందువులు నీతి నికోల్పోయి పూర్తిగా చిన్నాభిన్నామయ్యేలా చేసింది.కులాలు ఒక కూటమిగాకూడా ఏర్పడలేవు.ఒక కులం ఇంకొక కులానికి అనుబంధం గా కూడా ఉండదు.ప్రతి కులం మిగతా కులాలనుండి తానొక ప్రత్యేక కులంగా గుర్తింపుకోసం పోరాడుతుంది.కులవ్యవస్థ అందరూ కలిసి పాల్గొనే ఉమ్మడి కార్యక్రమాన్ని అడ్డగిస్తుంది.ఇది మన అందరి పని అనే స్పృహ లేకుండా, ఐఖ్యం కాకుండా చేస్తుంది.కులంఉండటం, కులస్పృహ ఉండటం వల్ల పాత వివక్ష లన్నీ గుర్తుకొస్తూ సమైఖ్యత ఆగిపోతున్నది.క్లబ్బు సభ్య త్వం లాగా కులం సభ్యత్వం అందరికీ రాదు.కులంలో సభ్యత్వం కావాలంటే ఆకులంలో పుట్టాలి.అది కులధర్మం .కులాలు స్వయంప్రతిపత్తి గలవి. ఎవరైనా కొత్తవ్యక్తి వస్తే ఒక కులంలోకి చేర్చుకొమ్మని చెప్పే అధికారం ఎవరికీ లేదు. హిందూ సంఘం ఒక కులాల కూటమి . ప్రతి కులం మూసుకుపోయి ఉంటుంది కాబట్టి కులం మారే అవకాశం ఎవరికీ ఉండదు. హిందూసమాజం విస్తరించకుండా ఇతర మతస్థులను కలుపుకోకుండా కులమే అడ్డుపడింది. కులాలున్నంతవరకు హిందూ మతం విశ్వజనీన సేవా మతం కాలేదు.శుద్ధి హాస్యాస్పదం,నిష్ఫలకార్యక్రమం.కులం సంస్కర్తలనూ,సంస్కరణలనూ నాశనంచేసే ఆయుధం .తన కులంకాని వాడిలో ఉన్న ప్రతిభ ను ప్రశంసించే శక్తి హిందువులో ఉండదు.మౌర్యుల కాలంలో చతుర్వర్ణ వ్యవస్థ ను సమూలంగా తుడిచిపెట్టారు.”
*బొందిలి,దూదేకుల ఇప్పటికే బిసి.బి గ్రూపులో ఉన్నాయి.మెహతార్ లు బి.సి.ఏ గ్రూపులో ఉన్నారు.ముస్లిముల్లో సాంఘికంగా విద్యాపరంగా వెనుకబడిన ఈ 14 తరగతులకు బి.సి.ఇ గ్రూపులో రిజర్వేషన్ ఇచ్చారు:
* 1. అచ్చుకట్లవాండ్లు, సింగలి, సింగంవాళ్లు, అచ్చుపనివాళ్లు, అచుకట్టువారు,
* 2. అత్తరు సాయిబులు, అత్తరోళ్లు
* 3. దోభీ ముస్లిం , ముస్లిం దోభీ , ధోబి ముసల్మాన్ , తురక చాకలి , తురక చాకల , తురుక సాకలి , తురకల వన్నన్ , చాకల , సాకలా , చాకలా , ముస్లిమ్ రజకులు
* 4. ఫకీరు , ఫకీరు బుడ్‌బుడ్కి , గంటి ఫకీర్, గంటా ఫకీర్లు , తురక బుడ్‌బుడ్కి , దర్వేష్ ఫకీర్
* 5. గారడీ ముస్లిమ్ , గారడీ సాయిబులు , పాముల వాళ్లు , కనికట్టు వాళ్లు , గారడోళ్లు , గారడిగ
* 6. గోసంగి ముస్లిమ్, పకీరుసాయిబులు
* 7. గుడ్డి ఎలుగువాళ్లు, ఎలుగుబంటు వాళ్లు, ముసల్మాన్ కీలుగుర్ర వాళ్లు
* 8. హజమ్, నాయి, నాయి ముస్లిమ్, నవీద్
* 9. లబ్బి , లబ్బాయి , లబ్బన్ , లబ్బ
* 10. పకీరియా, బోరెవాలె, డేరా ఫకీర్లు, బొంతల
* 11. ఖురేషి, కురేషి,ఖసబ్, మరాఠి ఖాసబ్, కటిక ముస్లిం, ముస్లిం కటిక.
* 12. షైక్, షేక్
* 13. సిద్ధి, యాబ, హబ్షి, జసి
* 14. తురక కాశ, కుక్కుకొట్టె జింకసాయిబులు, చక్కిటకానెవాలె, తిరుగుడు గుంటలవారు, తిరుగాటిగంట, రోళ్లకు కక్కు కొట్టేవారు, పట్టర్ పోదులు, చక్కటకారె,
* 15. ఈ 13 ముస్లిం కులాలు రిజర్వేషన్లకు అర్హులుకాదు:1.సయ్యద్, 2.ముషేక్,3. మొఘల్, 4.పఠాన్, 5.ఇరాని,6. ఆరబ్,7. బొహరా, 8.షియా,9. ఇమామి, 10.ఇష్మాయిల్, 11.కుచిమెమన్,12. జమాయత్,13. నవాయత్లు
మహమ్మదీయుడి కంటే ముందు వాడొక మనిషి.సాటి భారతీయుడు.బ్రతుకుతెరువు లేని పేదవాడు.మానవత్వం చూపించాలి.మతంపేరుతో అతనికి ఏహక్కులూ అవకాశాలూ ఇవ్వకూడదా?ఎప్పుడో ఎవడో కిరాతకుడు చేసిన పనికి ఎన్నాళ్ళు నేటి తరం అవమానం పడాలి?రోళ్ళు తయారు చేసేవారు, గంట్లు కొట్టేవాళ్ళు,అన్ని మతాల్లోనూ వున్నామిగతా మతాల్లోని వారికి ఎంతోకొంత వారివారి కులాలరూపంలో రిజర్వేషన్ దొరికింది.ఇస్లాం మతంలో ఉన్న వారికి మాత్రమే ఇవ్వకూడదని అడ్డుకోవడం అన్యాయంకాదా?అసలు ఈ రిజర్వేషన్ అందుకునే అవగాహనేలేక గంటాఫకీర్ లాంటి వాళ్ళు అల్లాడుతుంటే అగ్రవర్ణ ముస్లిములే గంటాఫకీర్ అవతారాలెత్తి ఈ సీట్లలో దూరుతున్నారట.పేదరికం ఆత్మాభిమానాన్ని హరించి ఎంతగా మనిషిని దిగజారుస్తుందో చూడండి.మతం కంటే మానవత్వమే మంచిది. ఎన్నో కమీషన్లు వారి పరిస్థితి దళితులకంటే హీనంగా ఉందని రిపోర్టులు ఇచ్చాయి.రిజర్వేషన్ కు మతం ప్రాతిపధిక వద్దు అనుకుందాము.మరి ఏ రకంగా ఆ వర్గానికి సాయం చెయ్యాలి?మతం మానవత్వాన్ని హరిస్తూ ఉంది కాబట్టే ఇకనైనా కులాంతర, మతంతర వివాహాలకు మాత్రమే రిజర్వేషన్లను పరిమితం చేయటం మంచిదని నా భావన.

*మోదుకూరి జాన్సన్‌ అంబేద్కరిస్ట్.కులం వలన ఆత్మ న్యూనతకు గురికాకుండా కులాన్ని తమ పేరుతో పాటు జత చేసుకో వాలని దళితులకు జాన్సన్‌ సూచించారు. మతం అంటే జీవనమార్గం, కులం అంటే సమాజంలో వృత్తి పరమైన గుర్తింపు. వీటి సహకారంతో మనిషి ఇప్పటివరకూ జీవిస్తూ వచ్చాడు. స్వేచ్ఛగా, ఇతరులకు హాని లేకుండా జీవనం సాగిస్తే ఏ బాదరబందీ వుండదు. ఉన్మాదం లేదా ‘fanaticism’ బయలుదేరకూడదు. మతాంతర వివాహాలు చేసుకున్న పెద్ద పెద్ద వారికి పెద్ద సమస్యలుండవేమో, చిన్నా చితకా మనుషులకు, మధ్యతరగతి కుటుంబీకులకు ఇంకనూ సమస్యల సుడిగుండమే. కులం అనేది సామాజిక గుర్తింపు అయితే, కులం లేకుండా పోవడం అనేది కూడా ఓ గుర్తింపే.ప్రతి మనిషి తన గుర్తింపు తన సమూహపు గుర్తింపు ప్రపంచం గుర్తించాలని కోరుకుంటాడు.కానీ ఇక్కడ కులాలు ‘తక్కువ’ ‘ఎక్కువ’ అనే ధోరణి వుండకూడదు.ప్రతి కులస్తుడూ తాను సరి, అని అనుకుంటాడు. అలాంటి సమయంలో ఇతరులు సరి కారు అనే అర్థం స్ఫురిస్తుంది. ప్రతి మతంలోనూ ప్రతి కులంలోనూ ఉదాత్తులు ఉన్నారు. సర్వజ్ఞానులూ ఉన్నారు.కులాల పరంపర వేల సంవత్సరాలనుండి వస్తోంది. భారత్ లో వర్ణక్రమం అందులోని భాగమే. నేడు భారత్ జనభా 110 కోట్లు, కులాలు వేల సంఖ్యల్లోనే. ఒక్క మాటున కులనిర్మూలన అసాధ్యం. కులనిర్మూలనకే మన ఓటు.ఈకులాలు మనకు కూడు పెట్టవు.
*మనము కులాల బందీఖానాలో ఉన్నాము.కులనిర్మూలన అనవసరం అనేవాళ్ళూ ఉన్నారు.కులాలు ఉండాలి,కులతత్వం పోవాలి అనేవాళ్ళూ ఉన్నారు.పరస్పర ఆకర్షణ,ప్రేమ ఉన్నాసరే వేరు వేరు కులాలు మతాలకు చెందిన జంటలు పెళ్ళి చేసుకోటానికి అంగీకరించని పెద్దలున్నారు.రిజర్వేషన్ల కోసమైనా కులాలుండాలి అనేవాళ్ళూఉన్నారు.మరి కులనిర్మూలనకు దేశంలో సానుకూలత రావటం కోసం ఇలాంటి చర్చలు బాగా జరగాలి. గొంతుదాకా తిని కులం అడిగే వాళ్ళూ,కూటికి పేదలం కానీ కులానికి పేదలం కాదని విర్రవీగే వాళ్ళూ,కులంతక్కువ వాడు కూటికి ముందని అవమానించే వాళ్ళూ,కులనిర్మూలన జరిగేదాకా ఉంటారు.కులాంతర మతాంతరవివాహాలు మన దేశంలోని కులమత ద్వేషాలకు శాంతియుత విరుగుడు మందులు.ఏకులమో ఏమతమో చెప్పుకోలేని హైబ్రీడ్ పిల్లలు భారీగా పుట్టాలి.ఈసంకర పిల్లలే రేపటి భారతావనికి శాంతి దూతలు కావచ్చుకులం లేకుండా పోవడం వల్లనే మనలో నిజమైన ఐఖ్యత వస్తుంది.
*కులాంతర మతాంతర వివాహాలు భారీగా జరగాలని అంబేద్కర్ తోపాటు గాంధీజీ కూడా కోరారు.కాకపోతే అటువంటి వివాహాలకు తగిన ప్రోత్సాహకాలను ఆనాడే ప్రకటించలేదు. వారి మరణానంతరం వంద సార్లు రాజ్యాంగ సవరణలు జరిగినా ఈ అంశం ఎవరూ ముట్టుకోలేదు.ఇప్పటికైనా కులాంతర, మతంతర వివాహాలకు మాత్రమే రిజర్వేషన్లను పరిమితం చేయాలి.కులమత ప్రసక్తిలేని, ఏ కులమో చెప్పలేని భారత జాతి గణనీయంగా పెరిగితేనే కుల, మత కలహాలు సమసిపోతాయి..
 https://www.facebook.com/photo.php?fbid=765565526808773&set=a.233025936729404.60739.100000659993594&type=1&theater

10 కామెంట్‌లు:

  1. రహంతుల్లా నూర్ బాషా గారికి,
    అందరు మీలా ఆలోచించాలని , ఆ ఆలోచలను ఆచరించాలని కోరుకుంటున్నాను. వివేకి కి ఇంతకన్నా కావాల్సింది ఇంకా ఏముంటుంది? ఇది నాలో నీను ఎదుర్కుంటున్న ప్రశ్న.....అవును అందరు వివేకనందులు అవ్వనవసరం లేదు, అంతో ఇంతో అలా అలోచించి ఆచరిస్తే చాలు.....

    ఇక్కడ మీరు రాసిన వాక్యాలు
    దేశ శ్రేయస్సు దృష్ట్యా ప్రతి జంటకు ఒక్క బిడ్డ చాలు.మరో బిడ్డ కావాలంటే ఒక అనాధను దత్తత చేసుకోవటం మంచిది.కుటుంబ నియంత్రణ ఆపరేషన్లకు ఇచ్చే ప్రోత్సాహక మొత్తాన్ని పది వేలరూపాయలకు పెంచితే మంచిది.పదేళ్ళవరకూ మగవారికి సంతానోత్పత్తి చేసే కణాలను ఆపే ఇంజెక్షన్ (మేల్ పిల్) కూడా త్వరలో రాబోతుందట.

    నీను విజయానికి ఇదు మెట్లు చదివాక , ఒక్క బిడ్డ చాలు.మరో బిడ్డను దత్తత చేసుకోవటం, అన్న సూత్రానికి కట్టుబడి సగం ప్రయాణం చేసాను, మిగతా పని పూర్తి చెయ్యాలి.

    మీ బ్లాగ్ లు చాలా మంచి సమాచారం తో నిండుగా వున్నవి. అలాగే కొనసాగించండి.

    ధన్యవాదములు.

    రామ కృష్ణ
    నా బ్లాగ్స్ (నీనో కాపీ కాట్)
    http://ramugvs.blogspot.com/
    http://ramagvs.blogspot.com/

    రిప్లయితొలగించండి
  2. Caste needs to survive few more years, till benefits of reservations percolate/spread sufficiently and will survive no matter what for few more years.

    Already intercaste marriages are happening and they will happen much more till caste becomes immaterial.

    Few years ago, inter subsect marriages were not happening among many upper castes. Now subsects do not matter. Similarly in 50-100 years from now caste distinctions can disappear in south India. It will take some more time for this to happen in north India. Vegetarian and non vegetarian related caste differences can persist for some more time.

    Good to know that Muslim reservation was introduced by two Hindu Kings (along with reservations for non brahmins). I agree with your suggestion on BC-E reservation. Partition has big impact on integrating Muslims and extending reservations to Muslims in India. The effect of Partition in society is just slowly dying out. Muslims are coming out boldly and new Indian muslim middle class developed a fresh with no connection with muslim rule and Hindus ignoring muslims role in partition as current generation muslims can not be faulted with idiotic partition.

    రిప్లయితొలగించండి
  3. అందుకే కుల, మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగ నిర్మాతల అవివేకం, హ్రస్వదృష్టి అంటాను. పేదరికంలో మగ్గుతున్న వారికి ఆర్థికపరమైన రాయితీలు, పీజులు, సంక్షేమ హాస్టల్సు లాంటివి కల్పించాలి. ఓ కులం/తెగ వాళ్ళవి మరో తెగ తన్నుకుపోతున్నారు అనే కీచులాటలుండవు. డబ్బుంటే సాయబు సాహెబ్ అవుతాడు, జహాపనా కూడా అవుతాడు. కుల/మత రిజర్వేషన్లను ఆశించడం దీర్ఘకాలంలో ఆ కులం వాళ్ళను చవటలు, దద్దమ్మలుగా చూపడమే అవుతుంది.

    రిప్లయితొలగించండి
  4. https://www.facebook.com/photo.php?fbid=730998050265521&set=a.233025936729404.60739.100000659993594&type=1&theater

    రిప్లయితొలగించండి
  5. https://www.facebook.com/photo.php?fbid=765565526808773&set=a.233025936729404.60739.100000659993594&type=1&theater

    రిప్లయితొలగించండి
  6. రిజర్వేషన్లు కుల, మత పరంగా కాకుండా ధారిద్ర రేఖ పరంగా ఇస్తే దళిత కుటుంబాలకు మరియు అన్ని కుల మతాల లోని ఆర్థికంగా వెనక బడిన వారికి కూడా ఉపయోగ కరంగా ఉంటాయి. ఆర్ధిక స్థితి బాగా ఉన్న దళితులకు రిజర్వేషన్లు ఇవ్వటం కూడా నిరుపయోగమే అవుతుంది. బారతదేశం లో సర్వే నిర్వహింఛి ఆర్థికంగా వెనకబడిన వారు, మధ్యతరగతి వారు మరియు ఉన్న వారుగా విభజించి లేని వారికి ఎక్కువ రేజుర్వేషన్, మధ్యతరగతి వారికి ఒక రేజుర్వేషన్ మరియు ఉన్నవారికి తక్కువ రేజుర్వేషన్ ని కల్పించేలా రాజ్యాంగం లో మార్పులు చేస్తే అందరికి న్యాయం జరుగుతుంది.
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి