ఈ బ్లాగును శోధించు

17, మే 2010, సోమవారం

హిందూ ముస్లిం ఐక్యత కోసం ఉభయ తారక కార్యక్రమం

కుటుంబనియంత్రణ పాటించనందువల్ల ముస్లిముల జనాభా పెరిగిపోతున్నదని హిందూ నేతలు,ఎంతపెరిగినా మీ అంత జనాభా మాకు లేదులే అని ముస్లిం నేతలు వాపోతూ ఎవరి మతస్తులకు వాళ్ళు పిల్లల్ని కనటంలో పోటిలు పెడుతున్నారు.పైగా నారుపోసినవాడే నీరుపోస్తాడు అని,అవతలివాడికంటే మనదే పైచేయిగా ఉండాలంటే ఆ మాత్రం త్యాగం తప్పదని ఓదారుస్తున్నారు.ఇలాంటివాళ్ళ మాటలు విని అమాయకజనం శక్తికి మించి పిల్లల్ని కని నిరుపేదలైపోతున్నారు.అందువలన ఇరుమతాల ప్రజలకు మేలుచేసె ఒక కుటుంబనియంత్రణ కార్యక్రమానికి పెద్దలు నాంది పలికితే బాగుంటుంది.ఒకరు ఇద్దరు బిడ్డలతో ఆపరేషన్ చేయించుకోటానికి ముందుకొచ్చిన ముస్లింలకు హిందూ సంస్థలు,హిందువులకు ముస్లిం సంస్థలు పదివేల రూపాయల ఆర్ధిక సహాయం అందజేస్తే ఈ ముల్లాలు,స్వాముల మాటలు లెక్కచేయకుండా అన్ని మతాలలోని పేదలు ఆపరేషన్లకు బారులు తీరి నిలబడతారు.దేశంలో అధికజనాభా సమశ్య కూడా కొద్దిగా తగ్గుతుంది.ఎవరు ఎక్కువ ఖర్చు పెట్టగలిగితే వారిదే విజయం,పుణ్యం కూడా.పుణ్యం ఎలాగంటే మనిషి కష్టాలన్నిటికీ పుట్టుకే గదా కారణం?అసలు ఎన్నో కష్టాలకు కారణ భూతమైన ఆజన్మే కలుగకుండా ఎంతోమందికి ఆపరేషన్ల ద్వారా ముక్తిని మోక్షాన్ని ప్రసాదించే పుణ్యాత్ములకు కూడా పునర్జన్మ ఉండదు.మోక్షసిద్ధి ఖాయం.