ఈ బ్లాగును సెర్చ్ చేయండి

15, మే 2010, శనివారం

ఉగ్రవాదికి మతంలేదు

ఉగ్రవాదికి మతం ఏంటండీ?
వాడు మతాన్ని అడ్డం పెట్టుకున్న హంతకుడు.
హంతకుడు పాతబస్తీలోని మదరసాలో ఉన్నా,తిరుపతి పాపనాశనంలో ఉన్నా పట్టుకొని ఈ దేశ చట్టాల ప్రకారం శిక్షించాల్సిందే

*.ఇస్లాం దృష్టిలోఉగ్రవాదం నిషిద్ధం.ఇస్లామ్ లో ఈ హరామ్ పనికి చోటులేదని, ఇస్లాం మానవత్వానికి కట్టుబడి ఉందని జమీయతుల్ ఉలమాయె హింద్ ఫత్వా జారీచేసింది.

* ఉగ్రవాదుల మృతదేహాలను ముక్కలు, ముక్కలుగా కోసి సముద్రంలో పారేయాలని ముస్లిం పెద్దలు తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించారు. ప్రజల రక్తాన్ని మలినం చేసిన వారికిదే సమాధానమని వారు పిలుపునిచ్చారు.ఇస్లాంలో హింసకు, ఉగ్రవాదానికి తావు లేదని ఉగ్రవాదుల మృత దేహాలను పూడ్చిపెట్టడానికి స్థలాన్ని నిరాకరించాలని ,ఉగ్రవాదులు నిజమైన ముస్లింలు కాదని, పంజాబ్‌లోని పాటియాలా జిల్లా సమనాలో జరిగిన కాన్ఫరెన్స్‌లో ముస్లిం మత పెద్దలు, ఇతర ముస్లిం ప్రముఖులు ,హర్యానా గవర్నర్ ఎకే కిద్వాయ్ అన్నారు.ఆంధ్రజ్యోతి 4.12.2008.

* ఇలాంటి మంచిని కోరే 99% ముస్లిములు ఉగ్రవాదాన్ని తిరస్కరిస్తున్నారు.ఉగ్రవాదులు ఏ మతంలో ఉన్నా వారికి నరకమే వస్తుంది.హింసను ప్రోత్సహించే మతలేఖనాలను లెక్క చెయ్యవద్దు.సర్వేజనా సుఖినోభవ తో ముస్లిములూ గొంతుకలుపుతారు.

* హింసను బోధించే కురాన్ వాక్యాలు నాకు అక్కరలేదు.ఇలాంటి వాక్యాలు ఏ మతగ్రంధాలలో ఉన్నాపట్టించుకోకుండా మానవత్వాన్ని చూపటమే మంచి భక్తి. ఇస్లాం మతం తీవ్రవాదాన్నిఉగ్రవాద చర్యలను ఖండిస్తుంది . ఒక వ్యక్తిని చంపితే సర్వ మానవాళిని చంపినట్లే భావించాలి. చంపడమే తీవ్రవాదమైతే 17 లక్షల మందిని చంపిన మాజీ అమెరికా అధ్యక్షుడు బుష్ ప్రపంచంలోనే అతి పెద్ద తీవ్రవాది.ఇస్లాం ప్రపంచంలోని సర్వ మానవాళి సౌభ్రాతృత్వాన్ని కోరుతుంది.---ఇస్లామిక్ అకడమిక్ కంపారిటివ్ రిలీజియన్ (ఐఏసీఆర్) అధ్యక్షుడు ఆసిఫుద్దీన్ ముహమ్మద్ (ఈనాడు కర్నూలు 16.2.2009).

*ఇస్లాం ఉగ్రవాదానికి వ్యతిరేకం- రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ రహ్మెత్‌ఖాన్ (ఈనాడు హైదరాబాదు 16.2.2009)

*బంగ్లాదేశ్ లో ఉగ్రవాదులకు ఉరిశిక్ష విధిస్తున్నారు.ఉగ్రవాదులకు మరణశిక్ష, యావజ్జీవం, మూడేళ్ల నుంచి 20ఏళ్ల వరకు కఠిన కారాగారంలాంటి శిక్షలలో ఏదైనా విధించే అవకాశముంది. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చేవారికి సైతం మూడేళ్ల నుంచి 20ఏళ్ల వరకు కఠిన కారాగారం విధించే అవకాశం ఉంది.

*ఉగ్రవాదం అన్ని మతాలకూ శత్రువే.క్షమను పెంచడానికి, ఉగ్రవాదాన్ని తుంచడానికి సమైక్యంగా కూడిరావాలి.---- ఐక్యరాజ్యసమితి సదస్సులో సౌదీరాజు అబ్దుల్లా
*తురక టోపీలు,భారత దేశంపై దాడి చేస్తున్న ఇస్లాం సంస్థలు,సుల్తానుల అకృత్యాలు,లాంటి పదజాలాన్ని ఇంకా ఇంకా ఎంతకాలం ప్రయోగిస్తారు?ఇక్కడున్నకోట్లాది భారతీయ ముస్లిములపై సోదరభావం చూపించటానికి బదులు పాత వెధవలందరిని నిరంతరం గుర్తుచేస్తూ ఈ నాటి ముస్లిముల్ని అనుమానంగా చూస్తూ ఉండటం ధారుణం.
ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా భారతీయముస్లిముల్లోకి కూడా కులం పాకింది.పుట్టుకతో అందరూ శూద్రులే.భారతదేశంలో పుట్టుకే ఎన్నోజన్మల పుణ్యఫలం.అన్ని మతాలలో యుద్ధాలున్నాయి.నరహంతకులే శవం మీద మరమరాలు ఏరుకుతింటారు.హింసకులకు మతం ఒక సాకు మాత్రమే.మానవత్వమే అన్నిటికన్నా మంచి జీవన మార్గం.
 లేఖనాలలో హింసను వ్యతిరేకించే వాక్యాలను మాత్రమే గుర్తుచేసుకుందాం.కడుపుచించుకుంటే కాళ్ళమీద పడుతుంది అని ఎంతకాలం కడుపులోనే అశుద్ధాన్ని మోయటం?ఇలాంటి కిరాతకులను ఎవరూ సమర్దించరు.ఉగ్ర వాదము , పరమత అసహనం మీద ఎంత చర్చ జరిగితే అంతమేలు.

*హంతకులు అన్ని మతాలలో ఉన్నారు.మతాన్ని అడ్డం పెట్టుకొని ఆడవాళ్లను హిసించమనీ, ఒకటికి వంద పెళ్ళిళ్లు చేసుకోమనీ , ఉగ్రవాదానికి ఊతం ఇవ్వమనీ,ఇతరమతాల గుళ్లు గోపురాలు, అందులోని విగ్రహాలు పగలగొట్టమని ఇస్లాం బోధించిందా?సతీ సహగమనం లాంటి అనేక దురాచారాలను హిందూ మతం సరిదిద్దుకుంది.అలాగే ఇస్లాంమతంలో కూడా నిరంతరం సంస్కరణలు జరుగుతూనే ఉండాలి.మంచికోసం మనుషులు కదులుతారు కానీ ఎవడో చేసిన పాడుపనుల మచ్చలను ఈనాటి అమాయకులు మోయరు.నారుపోసినవాడే నీరు పోస్తాడనే ముల్లాల మాట పెడచెవిన పెట్టి మా బిడ్డల బరువు మేమే మోసుకోకతప్పదనే సత్యాన్ని గ్రహించి ముస్లిములు ఈనాడు కుటుంబనియంత్రణ ఆపరేషన్లు భారీగా చేయించుకుంటున్నారు.భవిష్యత్తులో మానవతావాదం మతాల్లో ఇంకా ఇంకా పెరిగితీరుతుంది.
ఎవరో అన్న మాటలను అందరికి ఆపాదించకూడదు.తప్పు ఎవరు చేసినా తప్పును తప్పుగా ఖండించాలి.మనకు కావలసింది శాంతి.నేరస్థుడు మతంతో నిమిత్తంలేకుండా శిక్షించబడాలి.పాత నేరస్థుల పాపాలచిట్టాకు ఈనాటి అమాయక వారసులు జవాబివ్వలేరు.అప్పటికి వీళ్ళెవరూ పుట్టలేదు.వాళ్ళు చేసిన అకృత్యాలకు వీళ్ళ పర్మిషన్ లేదు.వీళ్ళు ఏ విధంగానూ బాధ్యులు కాదు.శాంతియుత ప్రజా జీవనానికి భంగంకలిగించే ప్రతి తీవ్రవాదీ ప్రజాకంటకుడే.
అహింసామార్గం అత్యున్నతమైనది.మనందరం కలిసి సోదరభావాన్ని,శాంతిసామరస్యాలను ప్రభోదిద్దాం.మనం మాత్రం బ్రతికినంతకాలం మానవత్వాన్ని ఎక్కిస్తూనే పోదాం.వినేవాళ్ళే వింటారు.వినని వాళ్ళకు కసబ్,వికారుద్దీన్ ల గతే పడుతుంది.ఉగ్రవాదులు అమాయకుల్నిధారుణంగా చంపినప్పుడల్లా కాన్ఫరెన్స్‌లోని మతమౌఢ్య నాయకులలో ఇలాంటి ఆవేశపూరిత మాటలు పెల్లుబుకుతుంటాయి.మరోవైపు హింసను బోధించే కురాన్ వాక్యాలు నాకు అక్కరలేదు.ఇలాంటి వాక్యాలు పట్టించుకోకుండా మానవత్వాన్ని చూపటమే మంచి భక్తి అనే వాళ్ళూ ఉన్నారు.అహింసావాదుల సంఖ్య పెరుగుతూ ఉండాలంటే ఆ మత లేఖనాలలోని హింసా ప్రవృత్తి మీద ఎంత చర్చ జరిగితే అంత మంచిది.

1 కామెంట్‌:

  1. కొన్ని సార్లు సమయం సందర్భం గమనించకుండా వ్యాఖ్యలు మనసులోనుంచి బయటకు వస్తాయి.చంద్రబాబు నాయుడు గారు 2010 లో కుప్పం పర్యటనలో స్థానిక మసీదు లో ఇఫ్తార్ కు వెళ్ళి నమాజు చేసి ఇది నా పూర్వజన్మ సుకృతం అన్నారు.ముస్లిములు పూర్వజన్మను నమ్మరు.అదివిన్న ముల్లా గారు క్రితం జన్మలో ఎవరు ఏ మతంలో, ఏ ప్రాంతములో ఎలా పుట్టారో ఎవరికి తెలుసు ? వచ్చే జన్మలో హిందువులు ముస్లిములుగానూ,ముస్లిములు హిందువులుగానూ కూడా పుట్టొచ్చు అన్నారు

    రిప్లయితొలగించండి