ఈ బ్లాగును శోధించు

23, అక్టోబర్ 2011, ఆదివారం

తల్బినా --- తరీద్

తల్బినా --- తరీద్ ముహమ్మద్ ప్రవక్త ఇష్టపడ్డ వంటకాలు.ఈ వంటకాలను బాగా తినండని ప్రవక్త గారే చెప్పారు.
తల్బినా రోగి విచారాన్ని పోగొట్టే వంటకం. అయిషా (ప్రవక్త గారి భార్య ) బంధువుల్లో ఎవరైనా చనిపోతే స్త్రీలు చూడటానికి వచ్చితిరిగి ఎవరి ఇళ్ళకు వారు వెళ్ళిపోయేవారు. ఆమె దగ్గరి బంధువులు,స్నేహితులు మాత్రమే ఉండిపోయేవారు.అప్పుడామె ఒక కుండడు తల్బినా వండించేవారు.గోధుమలు మాంసంతో తయారుచేసిన తరీద్ ను తల్బినా పై పోసేవారు."ఇక తినండి.తల్బినా రోగి విచారాన్ని పోగొడుతుంది మనసును ప్రశాంతపరుస్తుందని దైవప్రవక్త చెప్పేవారని అయిషా చెప్పారు.(బుఖారీ 7:328) శవం దగ్గర రోదిస్తూ శోషిల్లిన వారు ,రోగులూ తల్బినా తినాలని అయిషా చెప్పేవారు. తల్బినా రోగి హృదయానికి విశ్రాంతి నిచ్చి దాన్ని చైతన్యవంతంగా చేస్తుందని ,దుఖాన్ని విచారాన్ని పోగొడుతుందనీ దైవ ప్రవక్త చెప్పేవారని అయిషా చెప్పారు.(బుఖారీ 7:593) "తల్బినా తినండి" అని అయిషా ప్రోత్సహించేవారు."రోగికి ఇష్టముండదు గానీ భలే మేలుచేస్తుంది" అనేవారు అయిషా.(బుఖారీ 7:594).
తరీద్ ముహమ్మద్ గారికి అత్యంత ప్రితిపాత్రమైన వంటకం.మాంసం,గోధుమలతో, రొట్టెగా చేశాక చారులో నానవేయబడుతుంది.(అబూ దావూద్ :1709,ముస్లిమ్:1093)దాని ఆవిరి పూర్తిగా పోయేదాకా మూతపెట్టాలని అప్పుడే అది మరింత ఆశీర్వాదాన్ని పుట్టిస్తుందని ప్రవక్త చెప్పారు(తిర్మిజీ:1130)
స్త్రీలలో అయిషా ఎంతటి పరిపూర్ణమైనదో అలాగే భోజన పదార్దాలలోతరీద్ అంతటి ఆధిక్యత గలది.(బుఖారీ4:623,5:113,114,7:330,339)
అందులోని సొరకాయ ముక్కల్ని ఆయన ఎంతో ఇష్టంగాఏరుకొని తినేవారు.(బుఖారీ 7:331)పళ్ళెంలోని తరీద్ ను మధ్యలోనుంచి,పైనుంచి కాకుండా ప్రక్క అంచుల్లోనుంచి తినండని ప్రవక్త చెప్పేవారు(తిర్మిజీ:1116)రకరకాల పండ్లు పళ్ళెంలో ఉంటే ఇష్టమైన వాటిని ఏరుకొని తినండని చెప్పేవారు(తిర్మిజీ:1125).