ఈ బ్లాగును సెర్చ్ చేయండి

24, మే 2010, సోమవారం

తెలుగు సాహిత్యంలో ముస్లిం కవులు రచయితలు

"సాయిబులకు తెలుగు సరిగా రాదు" అంటూ ముస్లిం పాత్రలకు నీకీ నాకీ అనే డైలాగులతో మన తెలుగు నటులూ,దర్శకులూ భలే ఎగతాలి చేస్తుంటారు.కానీ తెలుగు పండితులెవరికీ తీసిపోని విధంగా తెలుగు సాహిత్యంలో ముప్ఫైకి పైగా శతకాలను ముస్లిం కవులు రాశారు.భక్తి, నీతి, తాత్వాక, ప్రబోధాత్మక శతక సాహిత్యంలో ముస్లిం కవులు శతకాలు రాశారు.తెలుగుముస్లిం కవులు రాసిన కొన్ని శతకాలు ;
*ముహమ్మద్‌ హుస్సేన్‌
భక్త కల్పద్రుమ శతకం(1949)
మొక్కపాటి శ్రీరామశాస్త్రితో కలసి రాసిన శతకం ''సుమాంజలి''.
హరిహరనాథ శతకము
అనుగుబాల నీతి శతకము
తెనుగుబాల శతకము
మాతృదేవి యొకటి,మాతృభూమి యొకండు
మాతృ భాష యొండు మాన్యము గదా
మాతృ శబ్దము విన మది పులకింపదా?
వినుత ధర్మశీల తెనుగు బాల"
*షేక్‌ దావూద్‌
1963లో రసూల్‌ ప్రభు శతకము
అల్లా మాలిక్‌ శతకము
క్రీడా షిర్డీశ్వరము, 

సాయిబాబా చరిత్రము, 

చంద్రవదన, 

ఆనందకుమార, 

సుఖుడా శతకము, 

ఆదర్శము (నవల) 

అబ్దుల్ ఖాదర్ జిలాని దివ్య చరిత్రము, 

అభినవ తిక్కన కవితా సమీక్ష,

నాగూర్ ఖాదర్ వలీ చరిత్రము, 

ఆజాదు చరిత్రము 




*సయ్యద్‌ ముహమ్మద్‌ అజమ్‌

సయ్యదయ్యమాట సత్యమయ్య సూక్తి శతకము
*ముహమ్మద్‌ యార్‌
సోదర సూక్తులు
*గంగన్నవల్లి హుస్సేన్‌దాసు
హుస్సేన్‌దాసు శతకము-ధర్మగుణవర్య శ్రీ హుసేన్‌ దాసవర్య
*హాజీ‌ ముహమ్మద్‌ జైనుల్ అబెదీన్‌
ప్రవక్త సూక్తి శతకము,భయ్యా శతకము
*తక్కల్లపల్లి పాపాసాహెబ్‌
వేంకటేశ్వరుండు, బీబి నాంచారమ్మ
బెండ్లియాడి మతమభేదమనియె
హరి, ప్రమాణమైన వ్యర్థవాదాలేల?
పాపసాబు మాట పైడిమూట



*షేక్‌ ఖాసిం
సాధుశీల శతకము
కులము మతముగాదు గుణము ప్రధానంబు
దైవచింత లేమి తపముగాదు,
బాలయోగి కులము పంచమ కులమయా,
సాధులోకపాల సత్యశీల
*షేక్‌ అలీ
గురుని మాట యశము గూర్చుబాట అనే మకుటంతో 'గురుని మాట' శతకం(1950)
మానస ప్రబోధము శతకం
ఇంగిలీసు బాస ఎంతగ నేర్చిన
పాండితీ ప్రకర్ష పట్టుబడదు
పరులభాష గాన భాధను గూర్చును
గురుని మాట యశము గూర్చు బాట
దేశ భాషలెల్ల దీక్ష వహించి నీ
వభ్యసించ వలయు నర్భకుండ
మాతృ భాష నేర్చి మర్యాదలందుమా
గురుని మాట యశము గూర్చు బాట
*షేక్‌ రసూల్‌
మిత్రబోధామృతము అనే శతకం
*ఉమర్‌ ఆలీషా
బ్రహ్మ విద్యా విలాసము.

ఉర్దూ మాతృభాషగా గల ఎందరో ముస్లిములు కూడా తెలుగులో ముస్లిములు వెలువరించిన సాహిత్యం చాలా ఉంది.

"తెలుగు సాహిత్యం-1984 వరకు ముస్లిముల సేవ" అనే సిద్ధాంతవ్యాసానికి అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయ ఆచార్యుడు షేక్ మస్తాన్ గారికి లో పి.హెచ్.డి వచ్చింది.ఈ సిద్ధాంత గ్రంధాన్ని ఆయన 1991 లో ప్రచురించారు.
ఆ గ్రంధంలో 1984 వరకు వెలువడిన 42 మంది తెలుగు ముస్లిముల గ్రంధాలను పేర్కొన్నారుః
1.అబ్దుల్ గపూర్ ముహమ్మద్ - ఖుర్ ఆన్ (అను), ఇస్లాం మత ప్రభువులు,
మిష్ కాతె షరీఫ్ (అను), జగత్ర్ప వక్త
2.అలి ముహమ్మద్ 
ఆణి ముత్యాలు, 
హృదయమాధురి
వేదనా సౌరభము,
మమత.

3.అహమ్మద్ బాషా సయ్యద్ - శ్రీ ప్రవక్త ముహమ్మద్ రసూల్ వారి దివ్య చరిత్ర.
4.ఆమిరి మువ్వలున్ - విశ్వ ప్రవక్త
5.ఆలీ షేక్ - గురునిమాట, మానస ప్రబోధము.
6.ఇస్మాయిల్ - చెట్టునా ఆదర్శం, మృతువృక్షం, చిలకలు వాలిన చెట్టు.
7.ఇస్మాయిల్ - ఆఁ?
8.ఉమర్ ఆలీషా - అనసూయాదేవిఅనసూయాదేవి, ఉమర్ ఖయ్యామ్, కళ,
ఖండకావ్యములు, చంద్రగుప్త, తత్త్వ సందేశము, దానవవధ,
బర్హిణిదేవి, బ్రహ్మ విద్యా విలాసము, మహా భారత కౌరవ
రంగము, శ్రీ ముహమ్మద్ వారి చరిత్ర, స్వర్గమాత, సూఫీ
వేదాంత దర్శనము.
9.ఖాసింఖాన్ మొహమ్మద్ - ఆవిమారకము, ఆత్మాభిమానము, ఆల్బర్ట్ ఐన్ స్టీన్,
ఉత్తరరామ చరిత్ర, ఖురానెషరీప్(అను), దేవుడు నాదేశము,
దేశభక్తులు ప్రతిమ, వాసవదత్త.
10.ఖాసీం ఖాన్ సాహేబ్ షేక్ - వీరభద్ర విజయము.
11.ఖాసీం షెక్ - సాదుశీల శతకము
12.గపూర్ బేగ్ ముహమ్మద్ - నిరపరాధులు, గ్రీష్మంలో వసంతం.
13.జలాలుద్దీన్ యూసఫ్ మొహమ్మద్ లోక శాంతికి దైవ సూత్రము, మతము, రాజకీయము
యదార్ధమేది, దైవనియమావళి.
14.జై నుల్ అబెదీన్ ముహమ్మద్ - ఖుర్-ఆన్ సూక్తులు, ఖుర్ ఆన్ ప్రవచనములు,
ముహమ్మద్ ప్రవక్త జీవితము సందేశములు, భయ్యా
శతకము (అను), ప్రవక్త సూక్తి శతకము.
15.దరియా హుస్సేన్ షేక్ - పురుషోత్తముడు.
16.దస్తగిరి అచ్చుకట్ల - మణి మంజూష, అమృతమూర్తి
17.దావూద్ షేక్ - చిత్త పరివర్తనము, దాసీపన్నా, రసూల్ ప్రభుశతకము,
సంస్కార ప్రణయము, సూఫీ సూక్తులు.
18.నఫీజుద్దీన్ ముహమ్మద్ - కనకపు సిం హాసనమున, దేవుడూ నీకు దిక్కెవరు,
ధర్మ సంరక్షణార్ధం, విముక్తి విధి విన్యాసాలు.
19.నూరుల్లాః ఖాద్రిసయ్యద్ - రమజాను మహిమలు, నమాజు బోధిని, సుందరమగు
నమూనా, విశ్వాసములు, ఆరుమాటలు, జుబా:
20. పాపాసాహెబ్ తక్కల్లపల్లి - అంబ, రాణీ సం యుక్త, సత్యాన్వేషణము, పాపసాబుమాట
పైడిమూట.
21.పీరాన్ నిజామి, టి, హెచ్ - హజరత్ హుస్సేన్ సం స్కరణము, సూరాయె ఫాతిహా హజ్రత్
ముహమ్మద్ నల్లల్లాహు అలై హివస్సలాంగరి సీరత్ నుగురించి ఉపన్యాసములు.
22.ఫరీదు షేక్ - వేమన
23.బుడన్ సాహేబ్ షేక్ - ఖుతుబ్ నామా, జలాల్ నామా.
24.మస్తాన్ సయ్యద్ - మధు.
25.మహబూబ్, ఎస్. ఎమ్, - సమత.
26.మహబూబ్ ఖాన్ - సూరీడు.
27.మహబూబ్ సాహేబ్ షేక్ - శ్రీ శైల క్షేత్ర మాహాత్యము.
28.ముహమ్మద్ అజమ్ - సయ్యద్ సూక్తి శతకము (అము)
29.ముహమ్మద్ హుస్సేన్ షేక్ - భక్త కల్పధ్రుమ శతకము, హరినాధ శతకము, సుమాంజలి:
తెనుగుబాల, అనుగు బాల.
30.మిష్కిన్ సాహేబ్ షేక్ - నానార్ధనవనీతము (ఆము)
31.మీరాజాన్ షేక్ - సర్వ మత సార సంగ్రహణము
32.మొహియుద్దీన్ హుస్సేన్ సయ్యద్ షాహ్ -తౌహీద్
33.మొహిద్దీన్ పీరాన్ పటూరి - ఇస్లాం బోధిని,
34.మొహిద్దీన్ మల్లిక్ సుల్తాన్ - శ్రేయస్కర మార్గము, మరణానంతర జీవితము, ఇస్లాం జీవిత విధానము ,

ఆర్ధిక సమస్య-ఇస్లాం పరిష్కారము, నిర్మాణము విచ్చిన్నము, కలిమ
యె-
తయ్యబ ఆర్ధము, ప్రపంచ మార్గదర్శి,ఇస్లాంశిక్షణ

మౌలానా మౌదూది - ఇస్లాం బోధిని, నిర్యాణము, విచ్చిన్నము.
35.యార్ ముహమ్మద్ - ఆ వేదన, సోదర సూక్తులు.
36.రసూల్ షేక్ - మిత్ర బోధామృతము.
37.వజీర్ రహమాన్ - ఎచటికి పోతావీరాత్రి, కవిగా చలం.
38.వలి, ఎన్.కె. - శ్రీమతి లక్ష్మీ
39.వలి, ఎస్.ఎమ్. - ఊర్వశి.
40.సలాం అబ్దుల్ - చలంగారి శ్రీశ్రీ
41.షం సుద్దీన్ ముహమ్మద్ - కళంకిని, విజయ, నల్లబంగారం, ధనవంచిత అమృత పధం.
42.హమీదుల్లా షరీఫ్ షేక్ - దైవ ప్రవక్తలు, ఖురానీ గాధలు (అను)
43.ఎస్.ఎం.భాషా


సయ్యద్ నశీర్ అహ్మద్ "అక్షర శిల్పులు" పేరుతో 333 మంది ప్రస్తుత తెలుగు ముస్లిం కవులు రచయితల వివరాలతో 2010 లో ప్రచురించారు.


తెలుగు లో వచ్చిన ఖురాన్ అనువాదాలు:10

1.1925-చిలుకూరి నారాయణరావు ఖురాన్ షరీఫ్ మద్రాసు
2.1941-ముహమ్మదు ఖాసిం ఖాన్ ఖురాన్ షరీఫ్ 9 సూరాలు, హైదరాబాద్
౩.1948-మున్షీ మౌల్విముహమ్మద్ అబ్దుల్ గఫూర్, కురానె మజీద్ కర్నూలు
4.1980-షేక్ ఇబ్రాహీం నాసిర్ అహమ్మదియ్యా కురాన్ , హైదరాబాద్
5.1985-హమీదుల్లా షరీఫ్ ,దివ్య ఖుర్ ఆన్ జమాతె ఇస్లామి హింద్ హైదరాబాద్
6.2004-అబుల్ ఇర్ఫాన్ , ఖురాన్ భావామృతం, హైదరాబాద్
7.2007-యస్.ఎం.మలిక్ , ఖుర్ ఆన్ అవగాహనం అబుల్ అలా మౌదూదీ.
8.2008-డాక్టర్ అబ్దుల్ రహీమ్ బిన్ ముహమ్మద్ మౌలానా,సౌదీ అరేబియా
9.2009-ముహమ్మద్ అజీజుర్రహ్మాన్,అంతిమదైవగ్రంధం ఖుర్ ఆన్ [2870 పేజీలు] (మౌలానా ముహమ్మద్ జునాగడీ) గారి [అహ్ సనుల్ బయాన్] హైదరాబాదు
10.2010-అబ్దుల్ జలీల్ ,పవిత్ర ఖుర్ ఆన్ ,దారుల్ ఫుర్ ఖాన్,విజయవాడ.862 పేజీలు.

స్వాతంత్రానికి పూర్వం ముస్లిములు నడిపిన తెలుగు పత్రికలు

  • 1842-"వర్తమాన తరంగిణి "వార పత్రిక ---1842 జూన్ 8 న సయ్యద్ రహమతుల్లా మద్రాసు.సయ్యద్ రహమతుల్లా తెలుగు పత్రికా రంగంలో అడుగు పెట్టిన తొలి ముస్లిం.మొదటి పత్రికలో ఆయన రాసిన మాటలు:"మేము మిక్కిలి ధనవంతులము కాము.ఆంధ్ర భాశ్హ యందు మిక్కిలి జ్ఞానము గలవారమూ కాము.హిందువుల యొక్క స్నేహమునకు పాత్రులమై తద్వారా ప్రతిశ్హ్ట పొందవలెననే తాత్పర్యము చేత నూరార్లు వ్యయపడి ముద్రాక్షరములు మొదలగు పనిముట్లను సంపాదించి ఈ పత్రికను ఉదయింప జేయడమునకు కారకులమైతిమి"
  • 1891-"విద్వన్మనోహారిణి " -- మీర్ షుజాయత్ అలీ ఖాన్ ,నరసాపురం.తరువాత ఈ పత్రిక వీరేశ లింగం గారు నడిపిన "వివేకవర్ధిని " లో కలిసిపోయింది.
  • 1892 -- "సత్యాన్వేషిణి " -- బజులుల్లా సాహెబ్ ,రాజమండ్రి.
  • 1909 --"ఆరోగ్య ప్రబోధిని " షేక్ అహ్మద్ సాహెబ్,రాజమండ్రి.
  • 1944 -- "మీజాన్ " దినపత్రిక -- కలకత్తావాలా,హైదరాబాదుఅడవి బాపిరాజు సంపాదకుడు.
  • అవార్డులు
  • 2010-" కాలుతున్న పూలతోట" సలీం నవలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది.

5 కామెంట్‌లు:

  1. your work in telugu literature is extraordinary.
    let telugu get all respect.

    రిప్లయితొలగించండి
  2. https://www.facebook.com/nrahamthulla/media_set?set=a.1040333795998610.1073741859.100000659993594&type=3

    రిప్లయితొలగించండి
  3. షేక్ దావుద్ కవి గారి చంద్రవదన పుస్తకం కావాలెను దయఉంచి ఆ పుస్తకం యొక్క జాడ తెలియజేయండి.

    రిప్లయితొలగించండి
  4. తిరుమల స్వామి వారి సేవ
    అష్ట దళ పాద పద్మ ఆరాధనా సేవలోని స్వర్ణ పుష్పాలు ఒక ముస్లిం కుటంబం మూడుతరాలభక్తికి సంకేతం ఆ స్వర్ణ పుష్పాలు. ఇప్పటికీ ఆ స్వర్ణ పుష్పాలే ఆ సేవలో ఉపయోగిస్తారు.. అదీ శ్రీనివాసుని మహిమ అయన భక్త వాత్సల్యం. భక్తులకు ఇంతకు మించి భాగ్యం ఏముంటుంది.
    అందుకే తిరుమలకు ఇప్పటికీ ముస్లిం సోదర సోదరీమణులు విచ్చేస్తూనే ఉంటారు.
    భగవంతుడు మత సంభందీకుడు కాదు..
    భక్తి సంభందీకుడు. భక్తియే భగవంతుని సేవకు గీటు రాయి.
    నాకు తెలిసినంతలో
    🙏

    రిప్లయితొలగించండి