ఈ బ్లాగును శోధించు

లోడ్ అవుతోంది...

సోమవారం 24 మే 2010

బీబీ నాంచారమ్మ ముస్లిం స్త్రీ

శ్రీవేంకటేశ్వరుని రెండవ భార్య.ముస్లిం స్త్రీ.బీబీ నాంచారమ్మ కి కనకదుర్గ ఆడపడచు.చాలామంది మహమ్మదీయులు నేటికీ ఈమెను విశ్వసిస్తూ తిరుమలను దర్శించుకుంటున్నారు. ప్రతి మంగళవారం తిరుమలలో మూలవిరాట్టుకు సయ్యద్ మిర్జా అనే ముస్లిం సమర్పించిన బంగారు పుష్పాలతో స్వర్ణ పుష్పార్చన చేస్తారు. ఉత్సవదేవతలైన శ్రీదేవి, భూదేవిలకు సయ్యద్ మీర్జా సమర్పించిన మంగళసూత్రాలనే నేటికీ వేంకటేశ్వర కళ్యాణోత్సవంలో ఉపయోగిస్తున్నారు.

నాంచారమ్మ గురించి పలువురి వ్యాఖ్యలుః
*వేంకటేశ్వరుండు, బీబి నాంచారమ్మ
బెండ్లియాడి మతమభేదమనియె
హరి, ప్రమాణమైన వ్యర్థవాదాలేల?
పాపసాబు మాట పైడిమూట ---తక్కెళ్ళపల్లి పాపాసాహెబ్‌ 1949

* నాపాలి దైవమని నమ్ముకున్నానయ్య

నా భాగ్యదేవతా నను మరువకయ్యా
బీబి నాంచారమ్మ పొంచి ఉన్నాదయ్య
చాటు చేసుకు ఎటులో చెంతజేరెదనయ్య…
ఏడు కొండలవాడ వెంకటా రమణా
--పెళ్ళిచేసి చూడు లో పి.లీల పాట

* అమ్మమ్మ ఏమమ్మ అలమేల్మంగ నాంచారమ్మ

తమ్మియింట నలరుకొమ్మ ఓయమ్మ

నీరిలోన తల్లడించే నీకే తలవంచీ

నీరికింద పులకించీ నీరమణుండు

గోరికొన చెమరించీ కోపమే పచరించీ

సారెకు నీయలుక ఇట్టె చాలించవమ్మ

నీకుగానే చెయ్యిచాచీ నిండాకోపమురేచీ

మేకొని నీవిరహాన మేను వెంచీ

ఈకడాకడి సతుల హౄదయమే పెరరేచీ

ఆకు మడిచియ్యనైన ఆనతియ్యవమ్మా

చక్కదనములె పెంచీ సకలము గాలదంచి

నిక్కపు వేంకటేశుడు నీకే పొంచీ

మక్కువతో అలమేల్మంగ నాంచారమ్మ

అక్కున నాతని నిట్టే అలరించవమ్మ ---అన్నమయ్య
*కింకిణుల సవ్వడితో క్షీరాబ్ధి పుత్రిక ;;
కంకణాల రవళులతో - శ్రీ అలమేలు మంగమ్మ
బీబీ నాంచారమ్మ - హెచ్చరికలు చేసేరు
అమ్మలార! వైలమే దయ సేయండీ!http://akhilavanitha.blogspot.com/2010/11/blog-post_19.html

* తిరుపతి వెంకన్న భార్యలలో వొకరైన బీబీ నాంచారమ్మ కారణంగానైనా ముస్లిములకు టి.టి.డి.లో మూడవ వంతు వాటా ఇవ్వటం న్యాయమే.కనుక ఇస్లాం రచయితలను ఆహ్వానించకనే పోవటం తిరుపతి వెంకన్నకు కూడా అపచారం చేసిన దానితో అది సమానమే అవుతుంది.—దివికుమార్

*నాంచారమ్మ ప్రేమ కధలు రకరకాలు;
*1. బీబీ నాంచారమ్మ గురించి ప్రచారంలో ఉన్న పలు వృత్తాంతాలలో లోని ప్రధాన ఇతివృత్తం ఇలా సాగుతుంది. మధ్యయుగంలో దక్షిణ భారతదేశాన్ని ఒక మహమ్మదీయ సుల్తాను దండెత్తి, వైష్ణవాలయంలోని వైష్ణవ విగ్రహాన్ని (శ్రీరంగంలోని ఉత్సవ విగ్రహాన్ని) ఢిల్లీ తీసుకొని వెళతాడు. ఆ విగ్రహాన్ని చూసిన సుల్తాను కూతురు సమ్మోహితురాలై ప్రేమలో పడుతుంది. విగ్రహాన్ని తిరిగి ఇవ్వడానికి అంగీకరించక, తీసుకువెళ్ళటానికి వచ్చిన వ్యక్తులతో పాటు తనూ వెళుతుంది. ఆ తరువాత దైవసన్నిధిలో ఐక్యమై విష్ణు భార్యగా నిలచిపోతుంది. వివిధ వృత్తాంతాల్లో దండెత్తిన చక్రవర్తి ఔరంగజేబు గానూ, మాలిక్ కాఫూర్ గానూ చెప్పబడింది. తీసుకెళ్ళిన వైష్ణవ విగ్రహం శ్రీరంగంలోని శ్రీరంగనాథ విగ్రహమనీ, మేళ్కోటలోని కృష్ణ విగ్రహమని,విగ్రహన్ని సుల్తాను కూతురే తిరిగితీసుకు వచ్చిందని, రామనుజస్వామి వెళ్ళి తెచ్చారని, పురబ్రాహ్మణులు తీసుకువచ్చారని ఇలా వివిధ రకాలుగా చెబుతారు.
2.Bibi Nancharamma, a muslim woman and a daughter of Malik Kafur was married to Lord Venkateswara. It has been established that Malik Kafur was a eunach employed by Alla-ud-din Khilji.(History of South India by Nilakanta Sastri).

3.Mahavishnu launches his search for Maha Lakshmi who left him, unable to bear the insult hurled by Bhrugu Maharshi and her husband’s silence in response. While Mahalakshmi, also known as Sridevi, took the shape of Alivelu Manga, Vishnu’s another concert Bhoodevi reincarnated herself as Bibi Nanchari, who too starts her search for her Lord. In a helpless situation, terribly tired Bibi Nanchari swoons. As she wakes up she is surprised to see the very feet of her Lord before her.Here occurs the song -Brahma Kadigina Padamu.

నాంచారమ్మ గురించి రకరకాల వాదనలు ;
*She is not MUSLIM but DUDEKULA who don't follow one religion,but believe in multi religion concept.some of muslim communities in south india go to mosques and have muslim names, but some of them also pray to Indian gods. In AP, there is a community called 'Doodekulu' (Cotton-jenny community). In many villages even today, the village tailors belong to this community. An 18th Century devotee of Tirumala Balaji called 'Bibi Nanchari' belonged to this community. She has a temple named after her in Tirupati which is very popular. Several composers of devotional songs refer to Bibi Nanchari as the second wife of Sri Venkateswara.

*ప్రొద్దుటూరుకు చెందిన డా.సి.వి.సుబ్బన్న శతావధాని రచించిన "బీబీ నాంచారి ప్రబంధము" తిరుపతిలో తెలుగు భాషోధ్యమ సమితి ఆధ్వర్యంలో 25.4.2010 న ఆవిష్కరణ జరిగింది.కర్నాటకలోని మేల్కోటే లోని చెళ్ళపిళ్ళరాయుని విగ్రహాన్ని డిల్లీ సుల్తాన్ డిల్లీ కి తెప్పిస్తాడు.ఆ విగ్రహాన్ని ఆయన కుమార్తె ఆరాధిస్తుంది.ప్రేమలో పడుతుంది.వెంకటేశ్వరుడు సుల్తాన్ కు కలలో కనపడి ఆయన కుమార్తెను వివాహమాడతానని చెపుతాడు.సుల్తాన్ అంగీకరిస్తాడు.గోదాదేవి లాగానే నాంచారి కూడా విష్ణుపత్నిగా ఆరాధించ బడుతుంది.వెంకటేశ్వరుడు లౌకికవాదానికి ప్రతీకగా మారి మతాంతరవివాహాలకు మార్గం సుగమం చేసి మార్గదర్శకుడయ్యాడని శతావధాని చెప్పారు.http://beta.thehindu.com/arts/books/article415269.ece
*ఆ తల్లిని బీబి నాచ్చియర్ అంటారు బీబి నాచ్చియర్ , బీబి నాచ్చియరమ్మ....బీబి నాంచారమ్మగా మారింది. అమ్మ వారి విగ్రహం ఇక్కడ చూడచ్చు.http://3.bp.blogspot.com/_7uqcYErI-rY/TPuN4OvZ97I/AAAAAAAABms/z5miYzH79ok/s1600/5_YadugiriNachiyar.jpg
http://mana-samskruthi.blogspot.com/2011/03/blog-post_12.html

9 వ్యాఖ్యలు:

  1. చాలా బాగా చెప్పారు!
    ఈ కథ మా నాయనమ్మగారి ద్వారా విన్నాను నేను. కానీ.. మీ వ్యాసం చాలా సమగ్రం గా ఈ కథ ని టచ్ చేసింది.


    కృష్ణప్రియ/

    ప్రత్యుత్తరంతొలగించు
  2. కృష్ణప్రియ గారికి ధన్యవాదాలు.బీబీ నాంచారమ్మ గురించిన వివిధ కదనాలు ఒకచోట పెట్టాను.కొత్త విషయాలు తెలిస్తే జోడించండి.

    ప్రత్యుత్తరంతొలగించు
  3. రహమతుల్లా గారూ:
    మీ బ్లాగు నాకు నచ్చింది. మంచి విషయాలు చర్చకి తీసుకువస్తున్నారు.

    మీ ఈమైలు ఇవ్వగలరా?

    అఫ్సర్

    ప్రత్యుత్తరంతొలగించు
  4. బీబీ నాంచారమ్మ శ్రీవేంకటేశ్వరుని రెండవ భార్య.ఆమె ముస్లిం స్త్రీ అని కొందరు,దూదేకుల ముస్లిం స్త్రీ అని మరి కొందరు అంటారు.చాలామంది ముస్లిములు నేటికీ ఈజంటను విశ్వసిస్తూ తిరుమలను దర్శించుకుంటున్నారు. గోదాదేవి లాగానే బీబీ నాంచారి కూడా విష్ణుపత్నిగా ఆరాధించ బడుతుంది.వెంకటేశ్వరుడు లౌకికవాదానికి ప్రతీకగా మారి మతాంతరవివాహాలకు మార్గం సుగమం చేసి మార్గదర్శకుడయ్యాడని శతావధాని చెప్పారు.http://beta.thehindu.com/arts/books/article415269.ece .శ్రీవేంకటేశ్వరుని పై భక్తి విశ్వాసాలున్న హిందూ-ముస్లిము జంటలకు కూడా కళ్యాణమస్తు కార్యక్రమం విస్తరిస్తే క్రమేణా మతసామరస్యం,లౌకికత్వం బలపడి భావి భారత పౌరులు సుఖపడతారు.

    ప్రత్యుత్తరంతొలగించు
  5. in which year lord venkateshwara married bibi nanchari???

    ప్రత్యుత్తరంతొలగించు
  6. Pandu RV KuchibhotlaSep 29, 2011 06:42 PM

    ధన్యవాదాలు! రహ్మతుల్లాగారూ! శతకోటివందనాలు! మా చిన్నప్పుడు(నేను పుట్టింది 1954లో) కూడా ఇదే కధను చెప్పేవారు మా పెద్దలంతానీ! కొన్ని పాఠాంతరాలున్న మాట కూడా యదార్ధమే! ఎన్. టీ. ఆర్. గారు కూడా తను దర్శకత్వం వహించిన చిత్రంలో కొద్దిపాటి తేడాతో ఇదే కధను చూపారు కదండీ! అలాగే అబుల్ హసన్ తానీషాగారు గతజన్మలో బ్రాహ్మణుడనిన్నీ శ్రీకాళహస్తిలో శివుని ఆరాధించేవాడనిన్నీ, పాము-సాలెపురుగూ, ఏనుగలకు మోక్షమిచ్చి తనకు దర్శన సాక్షాత్కారం కూడా ఇవ్వని శివుని పై కోపగించి శివలింగం పైనే కొబ్బరికాయ కొట్టగా శివుడు ఆగ్రహించి మరుజన్మలో తురకగా పుట్టి కూడా నా భక్తుడిగా వుండిపొమ్మని అశరీరవాణి ద్వారా శపింపగా ఆ బ్రాహ్మణుడు శాపావకాశమును కోరి ప్రాధేయపడగా భక్తసులభుడగు ఈశ్వరుడు "నీకు తప్పక సాక్షాత్కరింతు"నని వాగ్దానమిచ్చెనట! అందువలననే భక్తరామదాసునకు సైతము సాధ్యముకాని శ్రీరామసాక్షాత్కారము రామోజీ-లక్ష్మోజీల పేరిట తానీషాప్రభువులకు ప్రాప్తమైనదట. ఏమైననూ రహ్మతుల్లాగారికి తిరిగి నమస్కరిస్తున్నాను. మంగళం మహత్ - శ్రీశ్రీశ్రీ. భవదీయుడు, పాండూ ఆర్. వీ. కూచిభొట్ల(USA).

    ప్రత్యుత్తరంతొలగించు
  7. కూచిబొట్ల గారూ.అబుల్ హసన్ తానీషా తురకగా పుట్టిన బ్రాహ్మణుడనే సంగతి చెప్పినందుకు ధన్యవాదాలు.చంద్రబాబు నాయుడు గారు కుప్పం పర్యటనలో స్థానిక మసీదు లో ఇఫ్తార్ కు వెళ్ళి నమాజు చేసి ఇది నా పూర్వజన్మ సుకృతం అన్నారు.ముస్లిములు పూర్వజన్మను పునర్జన్మను నమ్మరు.అదివిన్న ముల్లా గారు క్రితం జన్మలో ఎవరు ఏ మతంలో, ఏ ప్రాంతములో ఎలా పుట్టారో ఎవరికి తెలుసు ? వచ్చే జన్మలో హిందువులు ముస్లిములుగానూ,ముస్లిములు హిందువులుగానూ కూడా పుట్టొచ్చు అన్నారు.

    ప్రత్యుత్తరంతొలగించు
  8. అజ్ఞాతOct 1, 2011 12:58 AM

    ముంతాజ్ ఆలి గారి జివిత చరిత్ర గురించి చదవండి. పుట్టింది కేరళ. కాని మదన పల్లే లో ఉంటారు. గొప్ప ఆధ్యాత్మిక వేత్త.

    http://satsang-foundation.org/?page_id=80
    http://satsang-foundation.org/?p=52

    ప్రత్యుత్తరంతొలగించు