దేవుడు "అద్వితీయుడు" అని ఇస్లాం చెబుతోంది. ఖురాన్ కంటే ముందు దేవుడు వివిధ ప్రవక్తల ద్వారా పంపిన పూర్వ గ్రంథాలు చాలా వరకు బైబిలులో ఉన్నాయి. గత 15 సంవత్సరాలుగా బైబిలును తరచి పరిశీలించి చూచాను. మరి ఆ అపూర్వ గ్రంధం కూడా " దేవుడు ఒక్కడే" నని ఘోషిస్తున్నది. క్రైస్తవ సోదరులతో పాటు ముస్లిములు కూడా ఈ దైవ వాక్యాన్ని తెలిసికోవటం అవసరం.
అపోస్తలుడైన పోలు తిమోతీకి వ్రాసిన లేఖలో ఇలా అంటాడు: " సకల యుగములలో రాజైయిండి, అక్షయుడును, అదృశ్యుడునగు, 'అద్వితీయ దేవునికి' ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్"(1 తిమోతీ 1:17).
ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏది అని ఒక శాస్త్రి ఏసుక్రీస్తును అడుగుతాడు. అందుకు ఏసు - " ప్రధానమైనది ఏదనగా - ఓ ఇస్రాయేలు వినుము: మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను, నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననునదియే ప్రధానమైన ఆజ్ఞ” అంటాడు. ఆ శాస్త్రి "బోధకుడా, బాగా చెప్పావు. ఆయన అద్వితీయుడని, ఆయన తప్ప వేరొకడులేడని నీవు చెప్పిన మాట సత్యమే" అంటాడు. అతడు వివేకముగా ఉత్తరమిచ్చెనని ఏసు గ్రహింఛి 'నీవు దేవుని రాజ్యమునకు దూరస్థుడవు కావు" అని అతనితో అంటాడు. (మార్కు 12:28-34)
అంటే దేవుడు ఒక్కడేనని ఆయననే ఆరాధించాలని గ్రహించిన వాళ్ళు దేవుని రాజ్యానికి దూరస్థులు కారని ఏసుక్రీస్తు వారి భావం అయితే ఒక్కడైన ఆ దేవుడు ఎవరు? నేను అబ్రాహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడను అని దేవుడు మోషేతో చెప్పెను' అంటాడు యేసు. (మార్కు 12:26)
మరి ఈ అబ్రాహాము దేవుడు ఏసుక్రీస్తుకు కూడా దేవుడేనా లేక ఏసుక్రీస్తే దేవుడా? ఇంతకు ముందే యేసు చెప్పాడుగదా 'మనదేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు (మార్కు:12:29).
ఆయన మగ్ద లేనే మరియకు చెబుతాడు "నా సహోదరుల యొద్దకు వెళ్ళి -- నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడును అయిన వాని యొద్దకు ఎక్కిపోవుచున్నానని వారితో చెప్పమనెను"(యోహాను 20:17).
ఈ అద్వితీయ దేవుడు ఏసుక్రీస్తుకు కూడా దేవుడేనని స్పస్టమయ్యింది. అయితే దేవుడు ఆయనకు తండ్రా? ఆయన ఒక్కడికే కాదు మనకు కూడా తండ్రియే. ఎలా? " నా తండ్రియు మీ తండ్రియు" (యోహాను 20:17).
తండ్రి అంటే కుటుంబానికి శిరస్సు, యజమాని, పోషకుడు, సంరక్షకుడు తండ్రికి తన బిడ్డలపట్ల అపారమైన ప్రేమ ఉంటుంది. వారు తప్పుచేస్తే ప్రేమతో కూడిన కోపం వస్తుంది పిల్లలు చెడిపోతే తండ్రికంటే మరెవరు ఎక్కువ బాధ పడతారు? పిల్లలు తను చెప్పిన బాటలోనే నడుస్తుంటే తండ్రికి ఎంత ఆనందం? ఏసు - " దేవుడు తన తండ్రి" అని చెప్పుకోవటం ద్వారా ఆ దేవుని పట్ల బిడ్డలాంటి భక్తిని ప్రేమను చూపించాడు. అంతేగాని స్వయంగా దేవుడు తన తల్లిని భార్యగా చేసికొన్నట్లు, శారీరక సంబంధంతో తనను కనినట్లుగా ఆయన చెప్పలేదు దేవుని పరిశుద్ధాత్మ ద్వారా మరియమ్మకు జన్మించిన ఏసు తన తండ్రిగా ఇంకెవరిని చెప్పుకోవాలి? ఆయన రూహుల్లాహ్!
అయితే యూదుల దృష్టిలో " ఈ మాటే" పెద్ద పాపంలా కనబడింది. పిలాతు ఏసులో ఏ నేరమూ కనుక్కోలేకపోతాడు. అప్పుడు యూదులు - "మాకొక నియమము కలదు. తాను దేవుని కుమారుడనని ఇతడు చెప్పుకొనెను గనుక ఆ నియమము చొప్పున ఇతడు చావవలెను" అనిరి.(యోహాను 19:7).
ఆ నియమం ఏమిటి? "యోహోవా నామమును దూషించు వాడు మరణ శిక్ష నొందవలెను. సర్వ సమాజము రాళ్ళతో అట్టి వానిని చావగొట్టవలెను"(తేలీ 24:16) ఇది మోషే ధర్మశాస్త్రం ద్వారా యూదులకు ఇవ్వబడిన నియమం. అయితే ఏసుదేవుని దూషించాడా? దూషించటం అంటే తిట్టనక్కరలేదు. 'దేవుడు నా తండ్రి' అని చెబితే దేవుడ్ని దూషించినట్లే యూదులు భావించే వారు.అది ఎలాగ? చూడండి: "ఏసు షబ్బాతు దినాచారాన్ని మీరుట మాత్రమేగాక, దేవుడు తన స్వంత తండ్రి అని చెప్పి తనను దేవునితో సమానునిగా చేసికొనెను గనుక ఇందు నిమిత్తము యూదులు ఆయనను చంపవలెనని మరి ఎక్కువగా ప్రయత్నము చేసిరి"(యోహాను 5:18)
చూచారా? మోషే ధర్మశాస్త్రానికి యూదులు ఎలాంటి గతి పట్టించారో! వారు ఆ ధర్మ శాస్త్రాన్ని ఖచ్చితంగా అమల చేసే వారయితే వారే ఏసును చంపవలసింది. పిలాతు దగ్గరకు ఎందుకు తీసి కెళ్ళారు? మీరతన్ని తీసుకుపోయి మీ ధర్మశాస్త్రం చొప్పున తీర్పు తీర్చండి అని పిలాతు యూదులతో చెబుతాడు. అందుకు యూదులు- "ఎవనికిని మరణశిక్ష విధించుటకు మాకు అధికారము లేదు" అని అంటారు. (యోహాను 18:31,32). ధర్మశాస్త్రాన్ని వక్రీకరించిన మాయావులు యూదులు. అయితే ఏసు తన తల్లి ఫలానా అని చెప్పుకోగలడు. తన తండ్రి ఎవరని చెప్పుకోవాలి? యూదుల సంకుచిత దృష్టిలో ఇదే మరణ శిక్షకు తగినంత నేరం అయ్యంది. "అందుకు ఏసు-మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడి యుండలేదా? లేఖనము నిరర్ధకము కానేరదుగదా! వారే దైవములని చెప్పిన ఎడల- నేను దేవుని కుమారుడనని ఛెప్పినందుకు,తండ్రి ప్రతిష్టచేసి ఈ లోకములోనికి పంపినవానితో - నీవు దేవదూషణ చేయుచున్నానని చెప్పుదురా? అనెను"(యోహాను 10:34-36)
కేవలం శారీరక దృష్టితో ఆలోచించేవారికి ఆత్మీయ విషయాలు అర్ధంకావు. ఏసు దేవుడ్ని తనకు ఏలాంటి తండ్రిగా భావించాడు? "నా తండ్రి అందరి కంటే గొప్ప వాడు" "తండ్రి నా కంటే గొప్ప వాడు” (యోహాను 10:29;14:28) ఎంత గొప్పవాడు? "ఆయన నా తండ్రి. నా దేవుడు". (యోహాను 20:17). ఏసు దేవునికి ఇలా ప్రార్ధిస్తాడు. "అద్వితీయ సత్యదేవుడవయిన నిన్నును, నీవు పంపిన ఏసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవము"(యోహాను 17:3) "అద్వితీయ దేవునివలన వచ్చు మెప్పును కోరక ఒకనివలన ఒకడు మెప్పు పొందుచున్న మీరు ఏలాగున నమ్మగలరు?... మీరు మోషేను నమ్మినట్టయిన నన్నును నమ్ముదురు" అని యూదులతో అంటాడు.(యోహాను 5:44)
ఆ అద్వితీయ దేవుడు ఎలాంటి వాడు? "మీరు ఏ కాలమందైనను ఆయన శబ్దము వినలేదు. ఆయన స్వరూపము చూడలేదు" అని ఏసు యూదులతో చెబుతాడు(యోహ్ను 5:37) పౌలు కూడా ఈ విషయమై సాక్షమిస్తున్నాడు: "శ్రీమంతుడును అద్వితీయుడువగు సర్వాధిపతి యుక్తకాలములయందు ఆ ప్రత్యక్షతను(క్రీస్తు తిరిగిరావటాన్ని) కనపరఛును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై యున్నాడు. ఆయన మాత్రమే దురవగాహమైన తేజస్సులో వసించుచు అమరత్వముగల వాడై యున్నాడు. మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు. ఎవడును చూడనేరడు"(1 తిమోతీ 6:15,16).
అద్వితీయుడు అంటే? ద్వితీయుడు లేనివాడు. "దేవుడు ఒక్కడే"(1 తిమోతీ 2:5; గలతీ3:20) ఆయన ఎవరికి దేవుడు? "దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? అన్యజనులకును దేవుడు కాడా? అవును, అన్యజనులకును దేవుడే.దేవుడు ఒక్కడే"(రోమా 3:29).
లోకమందు విగ్రహము వట్టిదనియు, ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని ఎరుగుదుము. దేవతలనబడినవారు, ప్రభువులన బడినవారు అనేకులున్నారు. ఆకాశ మందైనను భూమిమీదనైనను దేవతలనబడినవి యున్నను, మనకు ఒకే దేవుడున్నాడు. ఆయన తండ్రి, ఆయన మూలముగా సమస్తమును కలిగెను. ఆయన నిమిత్తము మనమున్నాము. (1 కొరింథీ 8:4-6)
"యెహోవాను నేనే. ఇదే నా నామము మరి ఎవనికిని నా మహిమను నేనిచ్చువాడను కాను. నాకు రావలసిన స్థోత్రమును విగ్రహములకు చెందనియ్యను"(యెషయా 42:8)
దేవుని ఏకత్వానికి సంబందించిన విషయాలు బైబిలులో కొల్లలుగా కనిపిస్తాయి. ఆయన స్థానంలో మరొకరిని చేర్చటం బైబిలు ప్రబోధానికి విరుద్దం. " నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు" అనేది మోషే కిచ్చిన పది ఆజ్ఞలలో మొదటిది(నిర్గమ 20:3)
"ఇదిగో నేను నేనే దేవుడను. నేను తప్ప వేరొక దేవుడులేడు. మృతినొందించువాడను బ్రతికించువాడను నేనే గాయపరచువాడను స్వస్థపరచువాడను నేనే. నా చేతిలో నుండి విడిపించువాడెవడునులేడు"(ద్విత్శ్ 32:39).
ఈ అద్వితీయ దేవుడినే ఏసు వేడుకుంటాడు.
శిలువపైనుండి "నా దేవా, నా దేవా, నన్నెందుకు చేయి విడిచితివి?"(ఏలీ, ఏలీ, లామా సబక్తానీ)
అని కేకవేస్తాడు(మత్తయి 27:46) ఈ "ఏలీ' అనే పదం దేవునికి సంబంధించింది. అది హెబ్ర్రూలో "ఎలాహ్"(బహువచనం). ఏక వచనంలో చెప్పాలంటే అదే ఇలాహ్(అల్+ఇలాహ్=అల్లాహ్The God )
స్కోఫీల్డు బైబిల్లో ఇలాహ్ (అల్లాహ్) అనే పదం ఇదివరకు ఉండేది.ఏసుక్రీస్తు దేవుడిని అల్లాహ్ అని పిలిచి ఉండవచ్చు. లేక హెబ్రూలో ఎలాహ్ అనే పదానికి అరబ్బీలో ఇలాహ్ తగిన పదం అయి ఉండవచ్చు.
అయితే ఈ ఏసుక్రీస్తు ఎవరు?"దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే ఆయన క్రీస్తు యేసను నరుడు"(1 తిమోతీ 2:5). ఆయన మధ్య వర్తిత్వం ఎలాంటిది? 'మధ్యవర్తి ఒకనికి మధ్యవర్తికాడుగాని దేవుడొక్కడే'(గలతీ 3:20). అంటే ధర్మశాస్త్రాన్ని తెచ్చిన మోషేలాంటి మధ్యవర్తిత్వమే ప్రజలకు దైవ సందేశాన్ని మోసుకు రావటం అంటే మధ్యవర్తిత్వం గాక మరేమిటి? దేవునికి ప్రజలకు మధ్యవర్తిగా ప్రవక్త ఉంటాడు. అయితే ప్రవక్త పాపాలు క్షమించజాలడు. ప్రజలను గురించి వేడుకుంటాడు. ప్రవక్త దేవుని స్థానాన్ని ఆక్రమించలేడు. మరొకరి పాపాలకు తాను బలికాలేడు. దేవుడు ఎవరి పాపాన్ని గురించి వారినే ప్రశ్నించి శిక్ష విధిస్తాడు. అందరి పాపాలు తీసికెళ్ళి ఒక వ్యక్తిపై అన్యాయంగా మోపి అతన్ని బలిచేసి తృప్తిచెందడు. బలులు పాపాలను పోగొట్టవు.అల్లాహ్ ను, ఆయన ప్రవక్తల్ని నమ్మండి (దివ్యఖుర్ఆన్-3:179)
విశ్వసించిన ప్రజలారా! అల్లాహ్ ను కాదని ఈ ప్రజలు ఎవరినయితే ప్రార్ధిస్తున్నారో వారిని దూషించకండి--వీరు తమ అజ్ఞానం మూలంగా మితిమీరి అల్లాహ్ నే దూషించగలరు.(దివ్యఖుర్ఆన్-6:108) ఆదాము, అబ్రాహాము, మోషే, ఏసు, ముహమ్మదుల దేవుడే మన అద్వితీయ దేవుడు.అందువలన ముస్లిములు,క్రైస్తవులు ,యూదులు ఆ అద్వితీయదేవునికోసం ఏకంకావాలి.
---- నూర్ బాషా రహంతుల్లా గీటురాయి వారపత్రిక 17.4.1987
Ok..........
రిప్లయితొలగించండిoka angle lo na aalochana kuda idhe,
kaani meeru vedhaalu kuda chadivithe baaguntundhi,
endhukante, allah gurinchi quran lo maathrame untundhi, krishna gurinchi bhagavathgeetha lo untundhi, kaani jesus gurinchi, bible, quran, 4 vadhal lo untundhi... manushulu paapam tho devuniki dooram ayyaru devudu daggari nunchi vachina mana aathma thirigi devudi daggaraku vellali ante 2 ways unnai 1= Jesus Blood, 2-aathma shakthi like meditation power... Nizamaina devudu mana papala nimitham bhumi meedhi vachi aayana raktham tho ee bhoomi ni thaduputhadu... idhi bible, bagavath geetha , quran, laanti chinna chinna books puttaka mundhe,vedhallalo raasi petti uncharu mana rushulu..............
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిchandu
తొలగించండిkaani jesus gurinchi, bible, quran, 4 vadhal lo untundhi..
haribabu
as we are all belong to different religions,we should not mix-up religious doctrines of others with yours.It will apply both:writer of this post and person commented like this.
both Islam and Christianity stresses that only our god is the supreme.only our god will save.Oh people belong to other religions!come,come to us - otherwise you will lost!How a vaidik book which belongs to a time period 1500 BC - 3000 BC will tell about jesus or prophet?
The most dangerous small mistake is defamatiing other religions to praise your religion!In the beginning it starts as simple talk,an expression of dragging comparisons,but in long term this will creatae a repeated misgivings and a trend will come out as religious intolerance!To cover up the mistakes,we have to use force to stop that habit - and ultimately if this force is not balanced properly war will come into existence..
Most of the crusardes and jihads started like this small streams,beware the war!
devudu oka kanya dvara bhoomi midhi vasthadu ani raasi undhi mana vedhaalallo...
రిప్లయితొలగించండిJesus emani cheppyadu, nayandhi na thandri, na thandri yandhi nenu unnamu ani, andhuke jesuschrist chesina miracle ippati varaku evvaru cheyaleru chesinattu ekkada kuda raasindhi ledhu, even jesus father( Jehovah,aloheem, allah )chesina miracle kante ekkuva ga jesus chesyadu,...
idhi meeku clear ga artham kaavali ante Just think smart... devudu chala mandhi prophits throw chala saarlu manatho maatlidinatlu manam chaduvukunnam, kaani ippudu endhiku maatladatam ledhu,................. ?
Maatladuthunnadu ! Jesus christ throw its real chaala proof lu unnay...
చందూ గారు ఏసు గురించి వేదాల్లో ఎక్కుడ వుందో ఏవేదం లో ఉందో ఆ ఉన్న శ్లోకం అర్థం ఏంటో వివరిస్తే మాలాంటి వారికి తెలుస్తుంది..కాస్త వివరించండి
తొలగించండి
తొలగించండిఏసోవాస్యోపనిషత్ మొత్తం ప్రభువు గురించే నండి ; దాంట్లో పూర్తి వివరాలు ముఫత్ లో ఉందండి
తొలగించండిఏసోవాస్యోపనిషత్ మొత్తం ప్రభువు గురించే నండి ; దాంట్లో పూర్తి వివరాలు ముఫత్ లో ఉందండి
Mimmalni edirinchi maatlaadalane uddesham naadhi kaadu, nenemaina mistake chesthe SORRY.....
రిప్లయితొలగించండినా మతం గొప్పదని రుజువు చేయడానికి ఇతర గ్రంథాలను 100 సార్లు చదివి అందులోని నిగూఢమైన నాకు అర్థం కాని సంగతులను ఎత్తిచూపి తానేదో గొప్పవాడిగా నేను అనుకుంటే నా అంత వెర్రి జ్ఝాని ఎవరు ఉండరు గాక ఉండరు. బైబిల్ లోని తనకు అనుకూలంగా ఉండే వచనాలను మాత్రమే చూపించి ఏదో గొప్ప గా భావించనక్కరలేదు. మిగతా మేయిన్ విషయాలు ఎందుకు వదిలేసినట్టో మరి. క్రీస్తు పాదాలయొద్ద నేర్చుకొన్న వారే క్రీస్తుకొరకు చెప్పగలరు.
రిప్లయితొలగించండిదేవుడు ఒక్కడే, ఆయన యేసు కాదు యేసు కూడ సృష్టించబడినవాడే
రిప్లయితొలగించండి