ఈ బ్లాగును సెర్చ్ చేయండి

24, మే 2010, సోమవారం

హిందూ-ముస్లిం భాయీ భాయి



* "ప్రస్థాన త్రయం అంటే "భగవద్గీత ,ఉపనిషత్తులు ,బ్రహ్మ సూత్రాలు " . అంతే కాదు " భగవద్గీత ,బైబిల్ ,ఖురాను కూడా" --వివేకానందుడు

* షహనాయి విద్వాంసుడు బిస్మిల్లా ఖాన్ (https://www.facebook.com/photo.php?fbid=457730137592315&set=a.233025936729404.60739.100000659993594&type=1&theater&notif_t=like), నేపధ్య గాయకుడు మొహమ్మద్ రఫీ ,సంగీత దర్శకుడు నౌషాద్ ఎన్నో హిందూ భక్తి గీతాలతో దేశప్రజలను అలరించారు.
*అలీఖాన్ అనే హిందూస్థానీ సితార్ పండిట్ రుద్రాక్షలు వేసుకుని, తిలకం పెట్టుకుని యు ట్యూబ్లో బాహాటంగా తన హిందూ విశ్వాసాలపై గౌరవం చాటుకున్నాడు.
* మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం అన్ని మతాల వారి ఆదరణను పొందారు.
* తమిళ నాడులోని శ్రీరంగం దేవాలయం, భద్రాచలం రాముల వారి దేవాలయంలో సన్నాయి వాయించేది తెలుగు ముస్లింలే.షేక్ చినమౌలానా సుబ్రహ్మణ్యస్వామి భక్తుడు.శ్రీరంగం దేవస్థానంలో స్వర్గీయ షేక్ చినమౌలానా నాదస్వర సేవ చేశాడు.ఆయన మనమడు నేటికీ సేవిస్తున్నాడు.
* నాగూర్ బాబు (మనో) కుటుంబం రంజాన్‌ని ఎంత ఘనంగా చేసుకుంటారో దీపావళి, క్రిస్‌మస్‌లను కూడా అంతే గొప్పగా జరుపుకొంటారు.భార్య జమీలా తో కలిసి ప్రతి ఏటా తిరుమలకు కాలినడకన వెళతారు. శబరిమలైకి వెళ్లి అయప్పస్వామిని దర్శించుకుంటారు.(ఆగస్ట్ 8, 2010 ఈనాడు వసుంధర)
* అమర్‌నాధ్ బాబా గుడి కనిపెట్టింది ఒక ముస్లిం సోదరుడు.ఆ గుడి దగ్గర షాపుల్లో పూజా సామాగ్రి ముస్లిం సోదరులు కూడా అమ్ముతారు.
* కేరళలోని మాతా అమృతానందమాయి దేశంలో పలుచోట్ల నిర్మించిన ఆలయాల వాస్తుశిల్పి ముస్లిం.
* భద్రాచలంలోని రాములవారి కల్యాణానికి ముత్యాలు నిజాం వంశీయుల నుండి వచ్చేవి.
*మెహర్ బాబా ఆత్మజ్నానాన్ని హజరత్ బాబాజాన్ అనే సద్గురు దగ్గర పొందారు.పూనే లోని ఆమె దర్గాకు హిందూ ముస్లిం ప్రజలందరూ ఈనాటికీ వెళుతున్నారు.http://en.wikipedia.org/wiki/Hazrat_Babajan
* బీబీ నాంచారమ్మ (వేంకటేశ్వరుని రెండవ భార్య)ముస్లిం స్త్రీ.తిరుమలలో ఆమె దేవాలయం ఉంది.ప్రతి మంగళవారం తిరుమలలో మూలవిరాట్టుకు గుంటూరు జిల్లాకు చెందిన షేక్ హుస్సేన్ సాహెబ్ మరియు హైదరాబాదుకు చెందిన సయ్యద్ మీర్జా అనే ముస్లిములు సమర్పించిన 108 బంగారు పుష్పాలతో బాలాజీ 108 నామాలు ఉచ్చరిస్తూ "స్వర్ణ పుష్పార్చన" లేదా "అష్టదళ పాద పద్మారాధన" చేస్తారు. ఉత్సవదేవతలైన శ్రీదేవి, భూదేవిలకు సయ్యద్ మీర్జా సమర్పించిన రెండు మంగళసూత్రాలనే నేటికీ వేంకటేశ్వర కళ్యాణోత్సవంలో ఉపయోగిస్తున్నారు.ఆనాటి బ్రిటీష్ అధికారి సర్ థామస్ మన్రో సమర్పించిన మన్రో గంగాళం లోనే నేటికీ నైవేద్యం తెస్తున్నారు.(http://ravindrasriramanujadasan.co.cc/tirumala/impq/tfaq13.html),సాక్షి ఆదివారం అనుబందం 25.9.2011
*మంగళూరులో హజరత్ సైదానీ బీబీ సాహిబా అనే సన్యాసిని దర్గాకు ఇరుమతాలవారూ ఇప్పటికీ భక్తితో వెళుతున్నారు.(డెక్కన్ హెరాల్డ్ 9.9.2013)http://www.deccanherald.com/content/350426/woman-saint039s-dargah-centre-communal.html
*మెదక్‌ జిల్లా ముత్తంగి గ్రామంలోని పిఈఎస్‌కాలనీలో వినాయక విగ్రహం వద్ద నిర్వహించిన వేలంలో ఓ ముస్లిం యువకుడు యూనస్‌ రూ24,600కి లడ్డూను చేజిక్కించుకున్నారు. లడ్డూను అందరికీ పంచిపెడితే మంచి జరుగుతుందనే ఉద్దేశంతో వేలంలో పాల్గొన్నట్లు యూనస్‌ తెలిపారు.ఈనాడు12.9.2011
 * షిర్డీ శాయిబాబా ఒక మసీదులో నివసించాడు. రెండు మతాల పద్ధతులను తన బోధనలో అవలంభించాడు. ఈయన రెండు సాంప్రదాయాల యొక్క పదాలను, చిత్రాలను ఉపయోగించాడు. ఈయన యొక్క వ్యాఖ్యలలో ముఖ్యమైన ఒక వాక్యము అల్లా మాలిక్, సబ్ కా మాలిక్ ఎక్ (सबका मालिक एक) (అందరి ప్రభువు ఒక్కడే).ఆ మసీదు ( ద్వారకామాయి) లోనే శ్రీరామనవమి పండుగ జరిపేవాడు.రెండు మతాల గ్రంధాలనూ సాయిబాబా ఆదరించి వ్యాఖ్యానించాడు.
*
అన్ని మతాలూ వికసించాలి. భగవంతుని వైభవం అన్ని భాషలలోనూ గానం చేయబడాలి. అదే ఆదర్శవంతమైనది. వివిధ మతాల మధ్య భేదాలను గౌరవించండి. కాని ఐక్యత అనే జ్యోతిని ఆరిపోనీయవద్దు అన్నారు పుట్టపర్తి శాయిబాబా.
*
అక్బర్ చక్రవర్తి మీరా బాయి భజనలు వినడానికి వెళ్ళేవాడు.
*
శబరిమలై అయ్యప్ప కు వావర్ అనే ముస్లిం మిత్రుడున్నాడట.భక్తులు దగ్గరలోని వావర్ దర్గాకు కూడా వెళతారు.వావర్‌ స్వామి కోసం ప్రత్యేకంగా మిరియాల పొట్లం ఇరుముడి లో పెట్టుకొని తీసికెళతారు.


సాక్షి 10.12.2018
*
నిజామాబాద్‌ జిల్లా మాక్లూర్‌లో అయ్యప్ప, షిరిడీ సాయి ఆలయాలకు స్థానిక ముస్లింలు తరలివస్తారు.భజనలు చేసి తీర్థ ప్రసాదాలను స్వీకరిస్తారు.
*
పశ్చిమగోదావరి జిల్లా కాళ్ళ లో మీరాసాహెబ్ దుర్గా మాతకు గుడి కట్టి నిష్టతో పూజారిగా ఇప్పటికీ పనిచేస్తున్నాడు.
*
నిజామాబాద్‌ జిల్లాలోని భైంసాలో మతకల్లోలాలు జరిగినప్పుడు ఓ సాధారణ హిందూ వనిత తుల్జాబాయి దాడికిలోనైన కొందరు ముస్లింలకు ఆశ్రయం యిచ్చింది.
*
సికింద్రాబాద్‌ లోని టకార్‌ బస్తీవాసి షేక్‌ ఇమ్రానుద్దీన్‌,హనుమాన్‌ జయంతిని ఎంతో భక్తితో జరుపు కుంటాడు.
*
హైదరాబాద్‌లో బాలాజీ దేవాలయం సమీపంలోనే హనుమంతుని ఆలయం.స్థానికంగా ఓ ముస్లిం మరణిస్తే, గౌరవ సూచకంగా హనుమజ్జయంతిరోజున హనుమంతుని ఆలయాన్ని మూసివేశారు.
*
పాతబస్తీలోని గొల్లా ఖిడ్కీ కాలనిలో ఇతేషామ్‌ ఆలీఖాన్‌ స్థానిక ముస్లింలతో, హిందువులపై దాడిని వారించారు. సుబోధ్‌ కుమార్‌, తనహిందూ మిత్రులతో కలిసి హిందూ ఆందోళన కారులనుండి ముస్లిం సోదరులను కాపాడాడు.
*
బేగం బజారులోని మొహ్మద్‌ ఇస్మాయిల్‌ గత 25 సంవత్సరాలుగా తనదుకాణం 'హషీమ్‌ అండ్‌ సన్స్‌' తలుపులపై హిందువుల దేవతాచిత్రాల బొమ్మలకు అగరుబత్తీలు వెలిగిస్తున్నాడు.
*
ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్ కడప పెద్ద దర్గాను దర్శించుకుని ప్రార్థనలు జరిపారు. దర్గాను దర్శించుకున్న తరువాతే తన పేరు గిన్నీస్ బుక్ లో చేరిందని,పెద్ద దర్గా మత సామరస్యానికి ప్రతీక అని గజల్ శ్రీనివాస్ అభివర్ణించారు.
*
విశ్వహిందూ పరిషత్‌ (విహెచ్‌పి) నిర్వహించిన భగవద్గీత శ్లోకాలపఠన పోటీల్లో తుంగతుర్తి మండలం అన్నారం ఉన్నత పాఠశాలలో చదివే ముగ్గురు ముస్లిం సోదరులు అలీమ్‌ (16) అజీమ్‌ (14), అజామ్‌ (13) లు రాష్ట్ర స్థాయిలో జరిగిన పలు పోటీల్లో పాల్గొని అనేక బహుమతులను దక్కించుకున్నారు.తెలుగు ఉపాధ్యాయుడు వి.కృష్ణమాచార్యులు కారణంగా ఆ సోదరులు ప్రస్తుతం 60 శ్లోకాలను సరియైన ఉచ్ఛారణతో పఠించటంతో పాటు వాటి తాత్పర్యాన్ని కూడా చెప్పగలుగుతున్నారు.
*
మహంకాళీ అమ్మవారి బోనాల పండుగలో హైదరాబాదు పాతబస్తీకి చెందిన ముస్లిములు కొందరు తమ భార్యలతో సహా భక్తి శ్రద్ధలతో పాల్గొనటం,తమకు అమ్మవారి దయవల్ల బిడ్డలు పుట్టారని చెప్పటం 8.8.2010న టీ.వీ చానెళ్ళు ప్రసారం చేశాయి.
*
హైదరాబాద్‌కి చెందిన 55 ఏళ్ళ షాహీన్‌ సల్తానా 1980లో మత కల్లోలాల్లో భయంకరమైన హింసని చూసిన ఆమె మత సామరస్యం కోసం కృషి చేస్తోంది.నవీన మహిళా కాంటెస్ట్‌ 2008 కి ఫైనలిస్ట్‌గా ఎంపికైంది.
*
కృష్ణా జిల్లా అడిషనల్ జాయింట్ కలెక్టర్ శంషీర్ అహ్మద్ షిర్డీ శాయిబాబా భజన కీర్తనలను స్వయంగా రాసి ప్రచురించి ఉచితంగా పంపిణీ చేస్తున్నాడు.
*
లంగర్‌హౌజ్‌ గొల్లబస్తీలో హనుమాన్‌ జయంతి సందర్భంగా హిందువులు,ముస్లిములు అందరూ కలిసి సహపంక్తి భోజనం చేశారు.(ప్రజాశక్తి31.3.2010)
*
చంద్రాయణగుట్ట లాల్‌దర్వాజాలో ఒక ముస్లిం యువకుడు వినాయక మండపాన్ని ఏర్పాటు చేసి పూజలు నిర్వహిస్తున్నాడు. మతవిద్వేషాలుకాదు అన్నిమతాల సారం ఒక్కటే అని చెబుతున్నాడు.ఇదే తరహాలోఅమీర్‌పేట్‌కు చెందిన షఫీక్‌ చాంద్రాయణగుట్టలో ట్రేడ్‌ యూని యన్‌ నాయకుడిగా పనిచేసిన పాషా ప్రతి యేడు చాంద్రాయణగుట్ట చౌరస్తాలో వినాయక మండ పాన్ని ఏర్పాటు చేసి పూజలు నిర్వహించాడు.(సూర్య 25.8.2009)
*
మంగళగిరి మిద్దె సెంటర్లో 19.2.1975న హిందూ ముస్లిములు కలిసి బాలగణపతి గుడి ప్రారంభించారు.ఇప్పటికీ షేక్ ఖాసిం సోదరులు హిందువులతో కలిసి నవరాత్రిఉత్సవాలు నిర్వహిస్తున్నారు.(సాక్షి మంగళగిరి 12.9.2010)
*
గుంటూరు కొత్తపేటలోని గణేశ్ వారి వీధిలో ముస్లిం యువకులు 5 ఏళ్ళుగా వినాయకుని విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు.ముస్లిం యువత ఏర్పాటు చేసిన వినాయకుడికి ఎమ్మెల్యే షేక్ మస్తాన్ వలి పూజలు చేశారు.(సాక్షి గుంటూరు12.9.2010)
*
ఔరంగాబాద్ లోని ఓ దర్గామసీదులో వినాయకచవితి వేడుకలు 35 సంవత్సరాలనుండి స్థానిక ముస్లిములు చేస్తున్నారు(జీ టీవీ వార్త17.9.2010)
*
పీర్ల పండుగకు బూంది, సాంబ్రాణి సమర్పించి, గుండంలోని బూడిదను నుదుట దిద్దుకునే హిందూ ప్రజలున్నారు. దీపావళి, దసరా వేడుకల్లో, క్రిస్మస్ వేడుకల్లో, ఈద్ విందుల్లో పాల్గొనే క్రైస్తవ,ముస్లిం ప్రజలున్నారు.చిత్తూరు జిల్లా కార్వేటినగరంలో ఇప్పటికీ హిందూ ముస్లిములిద్దరూ కలిసి దసరా రంజాన్ పండుగలు జరుపుకుంటున్నారు (హిందూ 20.11.2001)
*
కాశ్మీర్‌లో పండిట్ల గ్రామాల్లో ముస్లింలే హిందువులకు దేవాలయాలను నిర్మించారు. కాశ్మీరీ పండిట్లంతా ఏటేటా జరిగే హజరత్ సయీద్ అక్బరుద్ దిన్ ఉర్సు వేడుకల్లో అత్యంత ఉత్సాహంతో పాల్గొంటారు. సొంత వేడుకగానే జరుపుకునేవారు.ఉర్సులలో హిందువులు పాలుపంచుకోవడం పరిపాటే.
కాశ్మీర్‌లో పుల్వామా గ్రామంలో నేటికీ హిందువులు, ముస్లింలు ఇద్దరూ ఒకే ముస్లిం పవిత్ర స్థలంలో ఒకపక్క హోమం, మరో పక్క నమాజు చేస్తారు.
*
గుజరాత్‌లోని అహ్మదాబాద్ సమీపంలో ఉన్న పిరానా గ్రామంలోని 600 ఏళ్ల నాటి ఇమామ్ దర్గాలో హిందూ ముస్లింలు కలిసి ప్రార్థనలు చేస్తారు.
*
ఉత్తరప్రదేశ్‌లో దుసావా కాలా గ్రామంలోని ముస్లింలు తమ మతస్తుల సమాధులను పంచాయితీ కేటాయించిన మరో స్థలంలోకి మార్చేపని చేపట్టారు. ఆ తవ్వకం పనుల్లో రాతి శివలింగం, నంది బయటపడ్డాయి. వెంటనే గ్రామ పెద్దలంతా సమావేశమై లింగం, నంది లభించిన స్థలంలో శివాల యం కట్టుకోవాలని, మిగతా స్థలాన్ని ముస్లింలు ఉపయోగించుకోవాలని నిర్ణయించారు.సాక్షి 22.9.2010
*
హైదరాబాద్‌లో జరిగే వినాయక ఉత్సవాలు సర్వమత సమ్మేళనానికి నిదర్శనంగా నిలుస్తాయని నిరూపించారు జఫరుల్లాఖాన్. వేలంలో లక్షా రెండు వేలకు గణపతి లడ్డూను సొంతం చేసుకుని ఆయన మత సామరస్యాన్ని చాటారు. కొండాపూర్‌లోని శ్రీరాంనగర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేలంలో శ్రీరాంనగర్-బి, సి బ్లాక్‌ల అధ్యక్షుడైన జఫరుల్లాఖాన్ పది మందితో పోటీపడి మరీ లడ్డూను దక్కించుకున్నారు. ఏటా వినాయక చవితి, శ్రీరామనవమి ఉత్సవాలను కాలనీ వాసులంతా కలిసి నిర్వహిస్తామని ,ఏటా తన సమక్షంలో వేలం పాట జరిగేదని, ఈసారి తానే లడ్డూను సొంతం చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు.సాక్షి 23.9.2010
*
అయోధ్యలోని హనుమాన్ గర్హి ప్రాంతంలో కొలువైన సత్యార్సర్వమత ప్రార్థనాలయం.అక్కడ ఓ వైపు రాముడు, మరోవైపు గౌతమ బుద్ధుడు, ఇంకోవైపు మహావీరుడు, ఓ చోట మక్కా-మదీనా చిత్రపటం, ఇంకో చోట క్రిస్ట్రియన్ మత చిహ్నాలు ఇలా.. అన్ని మతాలకు చెందిన పండుగలను ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు. గుజరాత్‌కు చెందిన పారిశ్రామికవేత్త, సామాజిక కార్యకర్త లాల్జీబాయ్ సత్య సనేహి 60 ఏళ్ల క్రితం ఈ ప్రార్థనాలయాన్ని నిర్మించారు.ఈ ఆలయంలోకి వచ్చిన వారు తమ మతానికి చెందిన దేవుడిని పూజించిన అనంతరం .. పక్కనే ఉన్న ఇతర మతాలకు చెందిన దేవుళ్లను ప్రార్థిస్తారు.సాక్షి 26.9.2010
*"
నేను ముస్లిం మతానికి చెందిన కుటుంబంలో పుట్టినా,ఊహ తెలిసిన తర్వాత క్రైస్తవాన్ని పుచ్చుకున్నాను.మా అమ్మ గొప్ప ఆధ్యాత్మికవాది.ఆమె నన్ను చర్చి వాతావరణంలో పెంచలేదు.క్రీస్తు బోధనలు నా భావి జీవితానికి మార్గాన్ని సుగమం చేశాయి. అందుకే క్రైస్తవాన్ని ఎంచుకున్నాను.నా పాపాలకు ప్రాయశ్చిత్తంగా క్రీస్తు శిలువపై చనిపోవడం,మానవులుగా మనందరిలో ఉండాల్సిన నమ్రతను గుర్తు చేసింది. మనందరం పాపులం. తప్పులు చేస్తాం. మనలోనే దోషాలు ఉన్నాయి. దేవుని ప్రేమతోనే అందరికీ విముక్తి లభిస్తుంది.నాకు పరమత ద్వేషంలేదు.మతనమ్మకం ఉన్నవాళ్లనూ, మతనమ్మకం లేనివాళ్లనూ ఈ ప్రపంచం సమానంగా ఆదరిస్తోంది.మన దగ్గర క్రైస్తవుల సంఖ్య ఎక్కువగానే ఉన్నప్పటికీ ఇక్కడ యూదులు, ముస్లింలు, హిందువులు, నాస్తికులు, హేతువాదులు, బౌద్ధులు కూడా ఉన్నారు. విముక్తిపై మనకు నమ్మకం ఎలా ఉందో అలాగే వారికీ విశ్వాసాలు ఉన్నాయి. మన నమ్మకాన్ని ఎలా గౌరవిస్తామో వారి నమ్మకాలనూ అలాగే గౌరవించాలి".--- అమెరికా అధ్యక్షుడు బరాక్‌ హుసేన్ [[ఒబామా]] (ఈనాడు30.9.2010)
*
పంజాబ్‌లోని పాటియాలాలో ఉన్న చారిత్రక కాళీమాత ఆలయంలో ప్రముఖ బాలీవుడ్ నటి కత్రినాకైఫ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.(సాక్షి 25.10.2010)
*
గుంటూరు జిల్లా మాచవరం మండలం జింకలపాలెం 25 ముస్లిం కుటుంబాలు సుమారు వందసంవత్సరాలనుండి ధ్వజస్థంభాల తయారుచేస్తున్నారు.ఆకురాజుపల్లె లో ఆంజనేయుడికి పూజలుచేశాక పని ప్రారంభిస్తారట.సాక్షి గుంటూరు 28.10.2010

*"
హిందూ, ముస్లింల సోదరభావానికి, ఐకమత్యానికి కావరియా యాత్ర ప్రతీక.కావరియాలు తీసుకొని హరిద్వార్‌కు యాత్ర నిర్వహించే భక్తులకు ముస్లిం వర్గాలు స్వాగతం పలికి సత్కరించడం సంతోషం"--షీలా దీక్షిత్‌
*
నడికుడి పంచాయతీ పరిధిలోని మన్షూర్షాపేట కు చెందిన షేక్ మస్తాన్‌బీ నేపాల్ నుంచి ఒక పంచముఖ రుద్రాక్ష మొక్కను తెప్పించి పెరట్లో నాటింది.ఆ చెట్టు నుంచి కాచిన పంచ ముఖ రుద్రాక్షలతో రోజూ తిరుపతమ్మ తల్లికి పూజలు చేస్తోంది.(సాక్షి 2.11.2010)

*ఇండోనేసియా ప్రపంచంలోకెల్లా పెద్ద ముస్లిం దేశం.అక్కడి నేషనల్ ఎయిర్‌లైన్ పేరు ‘గరుడ’ డొమెస్టిక్ ఎయిర్‌లైన్ పేరు ‘జటాయు’.
ఇండోనేసియన్ కరెన్సీ నోటుమీద గణేశుడి బొమ్మ!
రాజధాని జకార్తాలో ముఖ్యకూడలివద్ద అర్జునుడికి కృష్ణుడు రథం మీద గీతోపదేశం చేస్తున్న నిలువెత్తు ప్రతిమ!
*
బాల్యంలోనే ఇరాక్ నుండి వచ్చి చిత్తూరు జిల్లాలో యాచకురాలిగా వచ్చిన డబ్బుతో దర్గాలు,శివాలయం కట్టించిన స్త్రీకి "మస్తానమ్మ" అనే పేరుపెట్టుకొని అక్కడి జనం ఆదరిస్తున్నారు.స్టూడియో ఎన్. వార్త20.6.2011
*
ప్రకాశం జిల్లా తాళ్ళూరు మండలంలోని తురకపాలెం గ్రామంలో 600 ముస్లిం కుటుంబాలు, ఒకే ఒక్క హిందూ కుటుంబం ఉన్నాయి.ఆ ఒక్క హిందూ కుటుంబం కోసం ముస్లిములు రామాలయం నిర్మించారు.స్టూడియో ఎన్ 8.7.2011

*హైదరాబాదు పోలీస్ కమీషనర్ ఏ.కె.ఖాన్ టీ.వీ.9 వారు నిర్వహించిన మట్టి వినాయకుని పూజలో పాల్గొని కొబ్బరికాయ కొట్టి మత సామరస్యాన్ని చాటారు.టీ.వి.9 వార్త 13.9.2011
*మంగళగిరి దగ్గర 'పుట్టతోట' లోని హిందువుల పాముపుట్ట,ముస్లిముల జెండా చెట్టు రెంటికీ కలిపి పూజలు చేస్తున్నారు.(ఈనాడు గుంటూరు 31.10.2011)
*
ప్రకాశం బ్యారేజి దిగువన సీతానగరం లోని పల్లె కారులు ప్రతి యేటా నాగుల మీరా జెండా పండుగ కృష్ణానదీ తీరంలో జరుపుతారు (ఈనాడు గుంటూరు 12.11.2011) (సాక్షి 30.11.2013)







 

*విశ్వ హిందూ పరిషత్,తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహింఛిన భగవద్గీత శ్లోక పఠన పోటీలలో ఖమ్మం జిల్లా ఏన్కూరుగురుకులం లో 10,6,తరగతులు ఛదువుతున్న షేక్ సాజిద్,షారుక్ బాబా లు పాల్గొని ప్రధమ బహుమతులు గెలిఛారు.సాజిద్ 64 శ్లోకాలను ఛెప్పేస్తాడు.(ఈనాడు2.12.2011)
*అనంతపురం జిల్లా నార్పల మండలం లోని గూగూడు గ్రామంలో కుళ్ళాయిస్వామి,ఆంజనేయస్వామి కి కలిపి ఒకే చోట సరిగెత్తు జరుగుతుంది.హిందూ ముస్లిమ్ భక్తులు ఇటు కుళ్ళాయి స్వామి పీర్లకు అటు ఆంజనేయస్వామికి మొక్కులు తీర్చుకుంటారు(సాక్షి 3.12.2011,11.11.2013)

*కర్నూలు జిల్లా కౌతాళం లోని ఖాదర్ లింగా స్వామి దర్గాలో అక్కడి బ్రాహ్మణులు ప్రతి ఉగాది రోజున పంచాంగ పఠనం నిర్వహిస్తున్నారు (ఈనాడు 21.12.2011)
*గుంటూరు జిల్లా వట్టి చెరుకూరు మండలం పుల్లడిగుంటమలినేని పెరుమాళ్ళు ఇంజనీరింగ్ కాలేజీలో ఎం.బి.ఏ.చదువుతున్న షేక్ జాన్ బాబు భగవద్గీత లోని పది ఆధ్యాయాలను అనర్గళంగా చెబుతూ అనేక బహుమతులు పొందాడు.(ఈనాడు 5.1.2012)
*కడప జిల్లా చక్రాయపేట గండి పుణ్యక్షేత్రానికి సమీపంలోని వీరన్నగట్టుపల్లె కు చెందిన కమాల్ బీ, మదార్‌ఖాన్ ల కుమారుడు ఖాదర్‌ఖాన్ (రామానంద కబీర్‌) ( 80 ) ఉమామహేశ్వర ఆలయాన్ని కట్టించి పార్వతీ పరమేశ్వరులను పూజిస్తూ బ్రహ్మచర్యం పాటిస్తూ నిత్యం అన్నదానం చేస్తున్నాడు.(సాక్షి కడప 9.1.2012)
*అనంతపురం జిల్లా గోరంట్ల మండలం వానవోలు గ్రామం లో ఆయుర్వేద డాక్టర్ అన్వర్ బాషా కోసం శివాలయం కట్టించాడు.ఈయన సత్య ధర్మ మకరందం,ఓ మనిషీ తెలుసుకో,కస్తూరి రంగనాధ స్వామి చరిత్ర,ఫకీర్ బాబా,మోక్ష మార్గం పుస్తకాలను రచించారు.(ఈనాడు అనంతపురం 23.1.2012)
*గుడ్ల వల్లేరు మండలం అంగలూరులో ఒకే ప్రాంగణం లో తాజుద్దీన్ బాబా కుటీర్ ,జ్ఞాన శాయి మందిరం ఉన్నాయి .ఇక్కడ కుల మతాలకతీతంగా పండుగలు చేసుకుంటున్నారు.ఇది ఒక అరుదైన ఆద్యాత్మిక కేంద్రం .(సాక్షి 2.2.2012)
*ఆదోనిలోని మహలక్ష్మమ్మనగర్ ముస్లిములు ప్రతియేటా వినాయకచవితి పూజల్లో పాల్గొంటున్నారు.అక్కడ ఖాజావలి పూజారిగా వ్యవహరిస్తున్నాడు.అక్కడి హిందువులు కూడా పీర్లకు దర్గాలకు మొక్కుతున్నారు.(సాక్షి 13.9.2013)
*

హిందూ మందిరం కోసం పోరాడుతున్న ముస్లింలు

పాకిస్తాన్ వాణిజ్య రాజధాని కరాచీ లోని 150 ఏళ్ల చరిత్రాత్మక శ్రీ రత్నేశ్వర్ మహాదేవ్ మందిరం ఇప్పుడు ప్రమాదంలో పడింది. దానికి కొద్ది అడుగుల దూరంలోనే ఒక ఫ్లైఓవర్ నిర్మాణమౌతోంది. భారీ క్రేన్లు, ఎర్త్ మూవర్లు భూమిని అతలాకుతలం చేస్తున్నాయి. మీటర్లకు మీటర్లు గోతులు తవ్వేస్తున్నాయి. ఈ పనుల వల్ల కలిగే ప్రకంపనలు శ్రీ రత్నేశ్వర మహాదేవుడి గుడికి ప్రమాదంగా పరిణమించాయి.
గుప్పెడు మంది కూడా లేని పాకిస్తానీ హిందువులు గుడి కోసం పోరాడే పరిస్థితిలో లేరు. కానీ కరాచీలోని ముస్లింలు వారికి బాసటగా నిలుస్తున్నారు. పాక్ సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ తసదుక్ హుసేన్ జిలానీ ఈ నిర్మాణం వల్ల మందిరం పై ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలపాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు.
రత్నేశ్వర్ మహాదేవ్ మందిరానికి ఘనమైన చరిత్ర ఉంది. ఒకప్పుడు లాహోర్ లో ఉన్న అతి పెద్ద మందిరాల్లో అదొకటి. అక్కడ శివరాత్రి ఉత్సవాలు మహాఘనంగా జరిగేవి. అయితే ఇప్పుడు అదంతా గతం. కానీ ఆ గతాన్ని ఖతం కానీయబోమంటూ అక్కడి ముస్లింలు ముందుకొస్తున్నారు.(సాక్షి 26.3.2014)



సాక్షి4.12.2013



అందరివాళ్ళు(ఈనాడు17.10.2013)                        
ఈనాడు  24.4.2014
సాక్షి 17.8.2014

DECCAN CHRONICLE 17.8.2014
ఈనాడు 27.10.2014
(సాక్షి 26.12.2014)
(ఈనాడు 18.2.2015)
 (ఈనాడు 10.3.2015)
 ఈనాడు 4.4.2015
https://www.facebook.com/amjed.u.khan/videos/10205929201242692/

బీబీ నాంచారమ్మ

శ్రీవేంకటేశ్వరుని రెండవ భార్య.ముస్లిం స్త్రీ.బీబీ నాంచారమ్మ కి కనకదుర్గ ఆడపడచు.చాలామంది మహమ్మదీయులు నేటికీ ఈమెను విశ్వసిస్తూ తిరుమలను దర్శించుకుంటున్నారు. ప్రతి మంగళవారం తిరుమలలో మూలవిరాట్టుకు సయ్యద్ మిర్జా అనే ముస్లిం సమర్పించిన బంగారు పుష్పాలతో స్వర్ణ పుష్పార్చన చేస్తారు. ఉత్సవదేవతలైన శ్రీదేవి, భూదేవిలకు సయ్యద్ మీర్జా సమర్పించిన మంగళసూత్రాలనే నేటికీ వేంకటేశ్వర కళ్యాణోత్సవంలో ఉపయోగిస్తున్నారు. Devotees believe that Bibi Nanchari is reincarnation of Bhudevi (Mother Earth). You can find a temple devoted to her in one of the avenues of India's largest temple in Srirangam (Tiruchirapally), comprising of 7 avenues in 156 acres. The image Srirangam temple is rich in wealth and architecture. Its beauty is described in Silappadikaram, a Tamil epic, in third century.

నాంచారమ్మ గురించి పలువురి వ్యాఖ్యలుః
*వేంకటేశ్వరుండు, బీబి నాంచారమ్మ
బెండ్లియాడి మతమభేదమనియె
హరి, ప్రమాణమైన వ్యర్థవాదాలేల?
పాపసాబు మాట పైడిమూట ---తక్కెళ్ళపల్లి పాపాసాహెబ్‌ 1949

* నాపాలి దైవమని నమ్ముకున్నానయ్య
నా భాగ్యదేవతా నను మరువకయ్యా
బీబి నాంచారమ్మ పొంచి ఉన్నాదయ్య
చాటు చేసుకు ఎటులో చెంతజేరెదనయ్య…
ఏడు కొండలవాడ వెంకటా రమణా    --పింగళి నాగేంద్రరావు,పెళ్ళిచేసి చూడు, పి.లీల

* అమ్మమ్మ ఏమమ్మ అలమేల్మంగ నాంచారమ్మ
నిక్కపు వేంకటేశుడు నీకే పొంచీ
మక్కువతో అలమేల్మంగ నాంచారమ్మ
అక్కున నాతని నిట్టే అలరించవమ్మ ---అన్నమయ్య


*చూడరమ్మ సతులారా సోబాన పాడరమ్మ |

కూడున్నది పతి చూడి కుడుత నాంచారి ||

కోమలాంగి ఈ చూడి కుడుత నాంచారి ||

కలశాబ్ధి కూతురట గంభీరలకే మరుదు |
తలపలోక మాతయట దయ మరి ఏమరుదు |
జలజనివాసినియట చల్లదనమేమరుదు |
కొలదిమీర ఈ చూడి కుడుత నాంచారి ||

అమరవందితయట అట్టీ మహిమ ఏమరుదు |
అమృతము చుట్టమట ఆనందాలకేమరుదు |
తమితో శ్రీవేంకటేశు దానె వచ్చి పెండ్లాడె |
కౌమెర వయస్సు ఈ చూడి కుడుత నాంచారి ---అన్నమయ్య

*కింకిణుల సవ్వడితో క్షీరాబ్ధి పుత్రిక ;;
కంకణాల రవళులతో - శ్రీ అలమేలు మంగమ్మ
బీబీ నాంచారమ్మ - హెచ్చరికలు చేసేరు
అమ్మలార! వైలమే దయ సేయండీ!   http://akhilavanitha.blogspot.com/2010/11/blog-post_19.html


* తిరుపతి వెంకన్న భార్యలలో వొకరైన బీబీ నాంచారమ్మ కారణంగానైనా ముస్లిములకు టి.టి.డి.లో మూడవ వంతు వాటా ఇవ్వటం న్యాయమే.కనుక ఇస్లాం రచయితలను ఆహ్వానించకనే పోవటం తిరుపతి వెంకన్నకు కూడా అపచారం చేసిన దానితో అది సమానమే అవుతుంది.—దివికుమార్
 సాక్షి 16.8.2014
*నాంచారమ్మ గురించి రకరకాల ప్రేమ కధలు వాదనలు;
1. బీబీ నాంచారమ్మ గురించి ప్రచారంలో ఉన్న పలు వృత్తాంతాలలో లోని ప్రధాన ఇతివృత్తం ఇలా సాగుతుంది. మధ్యయుగంలో దక్షిణ భారతదేశాన్ని ఒక మహమ్మదీయ సుల్తాను దండెత్తి, వైష్ణవాలయంలోని వైష్ణవ విగ్రహాన్ని (శ్రీరంగంలోని ఉత్సవ విగ్రహాన్ని) ఢిల్లీ తీసుకొని వెళతాడు. ఆ విగ్రహాన్ని చూసిన సుల్తాను కూతురు సమ్మోహితురాలై ప్రేమలో పడుతుంది. విగ్రహాన్ని తిరిగి ఇవ్వడానికి అంగీకరించక, తీసుకువెళ్ళటానికి వచ్చిన వ్యక్తులతో పాటు తనూ వెళుతుంది. ఆ తరువాత దైవసన్నిధిలో ఐక్యమై విష్ణు భార్యగా నిలచిపోతుంది. వివిధ వృత్తాంతాల్లో దండెత్తిన చక్రవర్తి ఔరంగజేబు గానూ, మాలిక్ కాఫూర్ గానూ చెప్పబడింది. తీసుకెళ్ళిన వైష్ణవ విగ్రహం శ్రీరంగంలోని శ్రీరంగనాథ విగ్రహమనీ, మేళ్కోటలోని కృష్ణ విగ్రహమని,విగ్రహన్ని సుల్తాను కూతురే తిరిగితీసుకు వచ్చిందని, రామనుజస్వామి వెళ్ళి తెచ్చారని, పురబ్రాహ్మణులు తీసుకువచ్చారని ఇలా వివిధ రకాలుగా చెబుతారు. 
అనాదిగా తిరుమలతత్వం మతసామరస్యా నికి ప్రతీకగా నిలచింది. వేంకటేశ్వరుని పట్టపురాణిగా కీర్తించబడే అమ్మవార్లకు అలమేలుమంగ లేక పద్మావతిగా తమిళంలో ఆండాళ్‌, గోదాదేవిగా, శ్రీదేవిగా చెప్పుకుంటారు. స్వామి దేవేరిగా బీబీనాంచారమ్మను కూడా భక్తులందరూ స్మరించుకోవడం పరిపాటి. బీబీ అనే పదం ముస్లింలకు సంబంధించిన ఉర్దూ భాషా పదం. నాంచారి అనేది తమిళ పదం. రెండింటి అర్థం భార్యే…బీబీనాంచారి ప్రస్థావనకొచ్చేసరికి కొందరు వైష్ణవ పండితులు ఒక కథను ప్రస్థావిస్తారు. ఒకప్పుడు మైసూర్‌ చక్రవర్తి హైదరాలీ తిరుమల దగ్గరలో ఉన్న చంద్రగిరి కోటను వశపరుచుకున్నాడట. దారిలో ఉండే హిందూ దేవాలయాలన్నింటినీ నగలు, సంపదలతో సహా వశపరుచుకునేవాడట.
కాగా తిరుమల శ్రీవేంకటేశ్వరుని సొత్తును సైతం స్వాధీనం చేసుకోవడానికి ఉద్యక్తుడవుతుండగా…కొందరు తిరుమలకు వెళ్లే యాత్రికులు తలనీలాలు, గడ్డం గుబురుగా పెంచుకుని గోవింద నామంతో వెళుతున్నారట. దానితో హైదరాలీ అక్కడి ప్రాంతం వారిని అడగగా అది తిరుమల ఆచారమని…స్వామివారు బీబీనాంచారి అనే ముస్లిం యువతిని పెండ్లాడారని…భక్తులు స్వామివారి గౌరవార్థం జుట్టు, గడ్డం పెంచుకుని వెళతారని… స్వామిని దర్శించుకుని వచ్చేటప్పుడు తిరిగి తలనీలాలు సమర్పించుకుని బోడిగుండుతో వెళతారని చెప్పగానే…
హైదరాలీ పశ్చాత్తాపపడి తమ మతానికి చెందిన బీబీనాంచారి గౌరవార్థం స్వామివారి సంపదలను కొల్లగొట్టకుండానే తిరిగి వెళ్లిపోయాడట.తమ మతానికి చెందిన ఆడపడచును హైదరాలీ గౌరవించడంతో అప్పటినుంచి ఏ ఏటికాయేడు ముస్లింలు కూడా వెంకటేశ్వరుని కొలుచుకోవడం ఆనవాయితీగా మారింది. అయితే 16వ శతాబ్దానికి చెందిన పదకవితా పితామహుడు అన్నమయ్య తన కీర్తనలలో ఎక్కడా కూడా బీబీనాంచారి పేరు ప్రస్థావించకపోవడం గమనార్హం.http://nalgonda.blog.com/2009/09/24/%E0%B0%AC%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B9%E0%B1%8D%E0%B0%AE%E0%B0%BE%E0%B0%82%E0%B0%A1-%E0%B0%A8%E0%B0%BE%E0%B0%AF%E0%B0%95%E0%B1%81%E0%B0%A8%E0%B0%BF-%E0%B0%AC%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B9%E0%B1%8D%E0%B0%AE/


2.ఆండాళ్ వలే స్వామిని ఘాడంగా ప్రేమించిన బీబీ నాంచారమ్మ విగ్రహాన్ని తయారుచేయించి, శ్రీ రామానుజాచారి శ్రీ రంగంలో ప్రతిస్టించినారు. ఇప్పటికి ఆ బీబీ నాంచారమ్మ విగ్రహానికి అక్కడ పూజాది కైంకర్యాలు నిర్వహించబడుతున్నాయి.http://mana-samskruthi.blogspot.com/2011/03/blog-post_12.html

3.Bibi Nancharamma, a muslim woman and a daughter of Malik Kafur was married to Lord Venkateswara. It has been established that Malik Kafur was a eunach employed by Alla-ud-din Khilji.(History of South India by Nilakanta Sastri).


4.Mahavishnu launches his search for Maha Lakshmi who left him, unable to bear the insult hurled by Bhrugu Maharshi and her husband’s silence in response. While Mahalakshmi, also known as Sridevi, took the shape of Alivelu Manga, Vishnu’s another concert Bhoodevi reincarnated herself as Bibi Nanchari, who too starts her search for her Lord. In a helpless situation, terribly tired Bibi Nanchari swoons. As she wakes up she is surprised to see the very feet of her Lord before her.Here occurs the song -Brahma Kadigina Padamu.


5.She is not MUSLIM but DUDEKULA who don't follow one religion,but believe in multi religion concept.some of muslim communities in south india go to mosques and have muslim names, but some of them also pray to Indian gods. In AP, there is a community called 'Doodekulu' (Cotton-jenny community). In many villages even today, the village tailors belong to this community. An 18th Century devotee of Tirumala Balaji called 'Bibi Nanchari' belonged to this community. She has a temple named after her in Tirupati which is very popular. Several composers of devotional songs refer to Bibi Nanchari as the second wife of Sri Venkateswara.



6.ప్రొద్దుటూరుకు చెందిన డా.సి.వి.సుబ్బన్న శతావధాని రచించిన "బీబీ నాంచారి ప్రబంధము" తిరుపతిలో తెలుగు భాషోధ్యమ సమితి ఆధ్వర్యంలో 25.4.2010 న ఆవిష్కరణ జరిగింది.కర్నాటకలోని మేల్కోటే లోని చెళ్ళపిళ్ళరాయుని విగ్రహాన్ని డిల్లీ సుల్తాన్ డిల్లీ కి తెప్పిస్తాడు.ఆ విగ్రహాన్ని ఆయన కుమార్తె ఆరాధిస్తుంది.ప్రేమలో పడుతుంది.వెంకటేశ్వరుడు సుల్తాన్ కు కలలో కనపడి ఆయన కుమార్తెను వివాహమాడతానని చెపుతాడు.సుల్తాన్ అంగీకరిస్తాడు.గోదాదేవి లాగానే నాంచారి కూడా విష్ణుపత్నిగా ఆరాధించ బడుతుంది.వెంకటేశ్వరుడు లౌకికవాదానికి ప్రతీకగా మారి మతాంతరవివాహాలకు మార్గం సుగమం చేసి మార్గదర్శకుడయ్యాడని శతావధాని చెప్పారు.“Bibi is revered all over South India as the Lord's Consort, similar to ‘Andal' (Godhadevi), who too loved and married Lord Vishnu,” Sathavadhani said, adding that the Lord Himself stood as personification of secularism and paved the way for inter-faith marriages.(The Hindu 29.4.2010)  http://beta.thehindu.com/arts/books/article415269.ece


7.శ్రీ రామానుజాచార్యులు ప్రజలలో సంకుచిత భావాలు పోగొట్టి, కుల, మత భేదం లేకుండా భక్తులందరికీ దేవాలయ ప్రవేశం దర్శన భాగ్యం కల్పించారు. విశాల హృదయుడైన రామానుజులవారు ఆండాళ్ గోదాదేవి ప్రేమకూ, ముస్లిం రాకుమార్తె ప్రేమకూ ఎలాటి భేదంలేదని, స్వామి ప్రేమలో ఐక్యమైన బీబీ నాంచారి విగ్రహాన్ని చేయించి శ్రీరంగంలోని రంగనాథుని దేవాలయంలో ప్రతిష్టించారు.- సి.క్రిష్ణవేణి ఆంధ్రభూమి 25/03/2012.http://archive.andhrabhoomi.net/content/ramanuja-charyulu?qt-most_tabs=1
ఆ తల్లిని బీబి నాచ్చియర్ అంటారు బీబి నాచ్చియర్ , బీబి నాచ్చియరమ్మ....బీబి నాంచారమ్మగా మారింది. అమ్మ వారి విగ్రహం ఇక్కడ చూడచ్చు.https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiXGvqqFSrr4M23XYg14HZjZQFBET9gcbCI3syfwI04uFQqAfRCaYQ6BgBFPSqGX978IVTMVz9pAzEt8gYC0yAwthHRUXnBVKRjYmTu9CayJ_LTtEbASNcVoy2u5YCRXg8ffvKd5WsD/s1600/5_YadugiriNachiyar.jpg





8.కొండపై వెలసిన దేవుడు "బీబీ నాంచారి" అనే ముస్లిం కన్యను పెండ్లాడాడని ఒక కధనం. లక్ష్మీదేవియే ఈ అమ్మవారిగా జన్మించి ముస్లిముల ఇంట పెరిగిందట! తమ ఆడపడుచుపై గౌరవంతో కొండలరాయుని దర్శించుకొన్న ముస్లిం సోదరులను చూసి హైదర్ ఆలీ తిరుమల కొండపైని సంపద జోలికి పోలేదని అంటారు. శ్రీరంగంలోని శ్రీరంగనాధుని ఉత్సవ విగ్రహాన్ని ఢిల్లీ సుల్తాను తీసుకొని పోగా అతని కుమార్తె "తుళుక్కు నాచియార్" రంగనాధుని మనోహర రూపానికి మనసునిచ్చిందని ఒక కధనం. శ్రీరంగం నుండి వైష్ణవ సంప్రదాయంతో బాటు ఈ దేవత కూడా తిరుమలకు వేంచేసి ఉండవచ్చును.http://www.szkolenie.jaworzno.pl/jaworzno/w/te/%E0%B0%85%E0%B0%B2%E0%B0%AE%E0%B1%87%E0%B0%B2%E0%B1%81_%E0%B0%AE%E0%B0%82%E0%B0%97 


9.బీబీ నాంచారమ్మను పరిణయ మాడడం వల్ల అతను మహమ్మదీయులకు కూడ దగ్గర వాడయ్యాడు !
 ఋషి --- సూత మునీంద్రా ! బీబీ నాంచారమ్మను , శ్రీవారు ఏ విధంగా చేపట్టారు ?
ఋషి --- మత సామరస్య ప్రబోధకమైన నాంచారమ్మ చరిత్రను చెప్పండి !
సూతుడు --- మునులారా ! శ్రధ్ధాభక్తులతో ఆలకించండి !! ---అయల సోమయాజుల శ్రీధర్, బీబీ నాంచారమ్మ చరిత్ర పౌరాణిక నాటకం  14 కేంద్రాల లో విజయవంతంగా ప్రదర్శింపబడింది. 21 ఏప్రిల్ 2004 'బీబీ నాంచారి'ని మా-టివి వారు టెలికాస్టు చేసారు.http://pustakam.net/?p=3150 ,http://te.wikipedia.org/wiki/%E0%B0%A6%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82:Wikisource-logo.svg


10.వెంకటేశ్వరునికి మహమ్మదీయులు కూడా పూజలు చేస్తారు.--- వీరబ్రహ్మం గారు.
వేంకటేశ్వరునికి మహమ్మదీయ వనిత బీబీ నాంచారి భార్య అనే విషయం అందరికీ తెలిసిందే. http://kalagnanam2012.blogspot.in/2012/06/blog-post.html

 

11.ఇది మత్స్య పురాణ కధ"వెంకటేశ్వరస్వామి గజనీ మహమ్మదు నకు జ్ఞాన భోధన చేసి ,అతనిని మార్చి ,అతనిచే సత్కారములు పొందిన వాడై ,వాని కుమార్తెను పరిచారికగా స్వీకరించి మహా వైభవముతో శేషాద్రికి వేంచేయు చున్నాడు.వేంకటేశ్వరుడు దిగువ తిరుపతిలోని తన అన్నగారైన గోవిందరాజస్వామి వారి కడకు వచ్చి నమస్కరించి ,బీబీ వృత్తాంత మంతయు చెప్పి ,సోదరా ! ఈ బీబీ ని నీ సమీపమున నే నిలుపుకొని చూచుచుండుము. " అని ప్రార్ధించి ,బీబీతో "నేను ప్రతిదినము మంగాపురమునకు పోయి వచ్చుచు మధ్యలో నిన్ను చూచి పోవుచుందును. నీ విచ్చటనే "బీ బీ నాంచారమ్మ" అను పేరుతో పూజ లందు కొను చుండుము "అని పలికి శేషాద్రి మీదకి విజయం చేసెను.అని సూతుడు శౌనకాది మహా మునులకు మత్స్య పురాణ కధను జెప్పగా విని వారందరును మహానందము బొందిరి .http://www.epurohith.com/telugu/viewtopics.php?page=19&cat_id=928 
                                                        
12. (ఆంధ్రజ్యోతి 26.11.2017)
వెంకన్న ప్రేమలో ఖిల్జీ వారసురాలు!
తెరపైకి బీబీ నాంచారి కథ

బాలాజీ విగ్రహంతో ఆమె ప్రేమ
స్వామినే పెళ్లాడతానని పట్టు
అంగీకరించిన రాజు ముబారక్‌
న్యూఢిల్లీ, నవంబరు 25: ఆ రాణీ ప్రేమ పురాణం... ఆ ముట్టడికైన ఖర్చు... ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం! అని సింపుల్‌గా తేల్చేయద్దు! నాటి చరిత్రలే నేడు సినిమాలకు కథా వస్తువులవుతున్నాయి. ఆ సినిమాలే ఎడ తెగని వివాదాలనూ సృష్టిస్తున్నాయి. అటు రతన్‌సింగ్‌- రాణీ పద్మిని మధ్య ప్రేమ... ఇటు చిత్తోర్‌గఢ్‌పై అల్లావుద్దీన్‌ ఖిల్జీ ముట్టడి రెండూ కలగలిసిన చారిత్రక గాథ... ‘పద్మావతి’! ఈ సినిమా చుట్టూ జరుగుతున్న వివాదం నేపథ్యంలో... చరిత్రను తవ్వుతున్నప్పుడు సరికొత్త, ఆసక్తికరమైన అంశాలూ బయటపడుతున్నాయి.

అందులో ఒకటి... బీబీ నాంచారి కథ! బీబీ నాంచారి వెంకటేశ్వరస్వామి భక్తురాలు! ఇంకా చెప్పాలంటే... స్వామి పట్ల ఆమెది భక్తిని మించిన తన్మయత్వం! 8వ శతాబ్దిలో ఆండాల్‌, 16వ శతాబ్దిలో మీరాబాయిలాగే ఆమె కూడా దేవుడినే ప్రేమించింది. పెళ్లాడింది. ఈ విషయం అందరికీ తెలుసు! కొందరికే తెలిసిన సంగతి ఏమిటంటే... బీబీ నాంచారి అల్లావుద్దీన్‌ ఖిల్జీ వారసురాలు! భారత్‌పై దండెత్తి హిందూ రాణులను చెరపట్టడమే లక్ష్యంగా అల్లావుద్దీన్‌ ఖిల్జీ కదం తొక్కగా... ఆయన వారసురాలైన బీబీ నాంచారి మాత్రం హిందువులు ఆరాధించే వెంకటేశ్వరస్వామి ప్రేమలో పడటమే ఇక్కడ వైచిత్రి! పలు చారిత్రక గ్రంథాల ప్రకారం... అల్లావుద్దీన్‌ ఖిల్జీ వాఘేలా కోటపై దాడి చేసి... రాయ్‌ కర్ణదేవ్‌-2ను ఓడించాడు.

కర్ణదేవ్‌ తన కుమార్తెతో దేవల్‌ దేవితో కలిసి దేవగిరికి పారిపోయాడు. ఆయన భార్య కౌలా దేవిని మాత్రం ఖిల్జీ చెరబట్టాడు. అయితే... కాలక్రమంలో ఆమె కూడా ఖిల్జీ విశ్వాసాన్ని చూరగొంది. దేవగిరికి పారిపోయిన తన కుమార్తె దేవల్‌ను వెనక్కి తీసుకురావాలని ఖిల్జీని కోరింది. ఇందుకు ఖిల్జీ అంగీకరించాడు. ఈ పనిని... తన సైన్యాధిపతి మాలిక్‌ కఫూర్‌కు అప్పగించాడు.

1303లో కఫూర్‌ ఈ పని దిగ్విజయంగా పూర్తి చేశాడు. అదే సమయంలో... దక్షిణాదిలోని పాండ్య రాజులపైనా కఫూర్‌ దాడులు చేశాడు. వారిని ఓడించి... నగలు, విగ్రహాలు, ఇతర సంపదను కొల్లగొట్టి ఢిల్లీకి తీసుకెళ్లాడు. అలా దోచుకున్న వాటిలో వెంకటేశ్వరస్వామి విగ్రహం కూడా ఉంది. ‘ఇదిగో ఈ బొమ్మతో ఆడుకో’ అంటూ ఖిల్జీ వంశంలో జన్మించిన బీబీ నాంచారికి ఇచ్చారు. అల్లావుద్దీన్‌ ఖిల్జీ మరణానంతరం అంతఃపుర కుట్రలు, కూహకాల్లో పెరిగిపోయాయి. మాలిక్‌ కఫూర్‌ హత్యకు గురయ్యాడు. ఖిల్జీ కుమారుడు ఖిజ్ర్‌! ఖిజ్ర్‌ కొడుకు ముబారక్‌! అతను పరమ క్రూరుడు. సొంత అక్క చెల్లెళ్లనే చంపేశాడు. తానే రాజు అయ్యాడు. అంతటి క్రూరుడు బీబీ నాంచారిని మాత్రం ఆదరించాడు

తాను వెంకటేశ్వరస్వామినే వివాహమాడతానని బీబీ నాంచారి చెప్పగా అందుకు అంగీకరించాడు. అంతేకాదు... మాలిక్‌ కఫూర్‌ దక్షిణ భారత దేశ ఆలయాల నుంచి లూటీ చేసిన విగ్రహాలన్నింటినీ తిరిగి ఇచ్చేందుకు కూడా అంగీకరించాడు. మరోవైపున... కర్ణాటకలోని మెల్కోటెలోని శ్రీవైష్ణవ మఠ అధిపతి రామానుజాచార్య... స్వామి వారి విగ్రహాలను వెనక్కి తీసుకువచ్చేందుకు ఢిల్లీకి బయలుదేరాడు.

విగ్రహాలతోపాటు బీబీ నాంచారి కూడా రామానుజాచార్య బృందంతో బయలుదేరింది. అయితే.. ఈ ప్రయాణంలో ఆమె ఆరోగ్యం బాగా దెబ్బతింది. 1316లో వెంకటేశ్వరస్వామి (విగ్రహం)తో ఆమె వివాహం జరిగింది. మెల్కోటెలోని చెల్లపిల్లరాయ ఆలయంలో ఉంటూ... శ్రీవారి సేవలో తరించింది. అక్కడే మరణించింది. ఆమె సమాధి చెల్లపిల్లరాయ ఆలయ ప్రాంగణంలోనే ఉంది. ‘పద్మావతి’పై వివాదం చెలరేగుతున్న సమయంలో బీబీ నాంచారి కథ ఆసక్తికరంగా మారింది.
 
13. ఈ దంపతులపై భక్తి విశ్వాసాలున్న హిందూ-ముస్లిము జంటలకు కూడా కళ్యాణమస్తు కార్యక్రమం విస్తరిస్తే భారీ స్థాయిలో మతాంతర వివాహాలు జరిగి ఆయా జంటలకు ఏకులమో ఏమతమో చెప్పుకోలేని అసలైన భావి భారత పౌరులు పుట్టి సుఖపడతారు.క్రమేణా మతసామరస్యం,లౌకికతత్వం బలపడుతుంది.
 https://www.facebook.com/photo.php?fbid=809353062430019&set=a.233025936729404.60739.100000659993594&type=1&theater&notif_t=like