"గ్రంధాలు కల ఓ ప్రజలారా! మీ ధార్మిక విషయాల్లో హద్దులు మీరకండి. సత్యాన్ని తప్ప దేనినీ అల్లాహ్ కు ఆపాదించకండి. మసీహ్, మర్యమ్ కుమారుడైన ఈసా, అల్లాహ్ పంపిన ఒక దైవ ప్రవక్త తప్ప మరేమీ కాదు.అల్లాహ్ మర్యమ్ దగ్గరకు పంపిన ఒక ఆజ్ఞ.అల్లాహ్ తరపు నుండి వచ్చి మర్యమ్ గర్భంలో బిడ్డ రూపం దాల్చిన ఒక ఆత్మమాత్రమే. కనుక అల్లాను, ఆయన ప్రవక్తల్ని విశ్వసించండి.."ముగ్గురు దేవుళ్ళు" అని అనటం మానండి. ఇది మీకే శ్రేయస్కరం. అల్లాహ్ ఒక్కడే దేవుడు. ఆయనకు ఒక కొడుకు ఉన్నాడంతగదు,అలాంటి బలహీనతలకు ఆయన అతీతుడు. (నిసా - 171)
ఖురాన్ లోని ఈ మాటలు చదివినప్పుడు నాకు అత్యాశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే ఈ వాక్యం గ్రంథం గల యూదులు,క్రైస్తవుల కోసమే.
నిరాధార వాదన
అయితే గ్రంథం గలవాళ్ళు తమ గ్రంథం చెప్పే దాన్ని యధాతధంగా నమ్మితే ఈ "త్రిత్వం" కుప్పకూలిపోతోంది. కాని దురదృష్టవశాత్తు క్రైస్తవులలో 83 శాతం మంది దేవుడు ఒక త్రిత్వమేనని నమ్ముతున్నారు. " ఈ త్రిత్వమనేది సాధారణ క్రైస్తవులకు అర్ధం కాని ఒక సిద్దాంతం. నిజానికి వారి సంఘం వారికేమి బోధిస్తుందో తెలిసికొనే ఆసక్తి కూడా ఎక్కువ మందికి లేదు. నిరూపించలేని ఒక సిద్దాంతాన్ని గతిలేని పరిస్థితిలో నమ్మవలసి రావటం లేఖనానికి విరుద్దం." అంటాడు. జి.ఎల్. జాన్ సన్.
త్రిత్వాన్ని బైబిలు బోధించటం లేదు. అయినా ఏ ప్రయోజనాన్ని ఆశించో కొందరు క్రైస్తవ పండితులు ఈ అర్ధం కాని త్రిత్వం నెలకొల్పారు. లిండ్సెల్, వుడ్ బ్రి డ్ జ్
అనే బోధకులు ఏమన్నా రంటే, " మనిషి మనస్సు త్రిత్వ మార్గాన్ని పూర్తిగా అర్ధం చేసికోలేదు. ఈ మర్మాన్ని పూర్తిగా తెలిసికోవాలని ప్రయత్నం చేసిన వాడికి మతిపోతుంది. కాని ఈ త్రిత్వాన్ని వదిలివేసిన వాడికి ఆత్మే పోతుంది"
హేతువు వెలుగులో
ఈ రకంగా క్రైస్తవులు తమకు అర్ధం కాకపోయినప్పటికీ గత్యంతరం లేక త్రిత్వాన్ని నమ్ముతున్నారు. కాని " సమస్తాన్ని పరీక్షించి మేలైన దానిని చేపట్టండి" అంటాడు పౌలు. (1 థెస్స5:21). పేతురు కూడా "మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మల్ని హేతువు అడిగే ప్రతివాడికీ సమాధానం చెప్పటానికి సిధ్ధంగా ఉండండి" అంటాడు.(1 పేతురు 3:15). కాబట్టి దేవుడు త్రిత్వమా కాదా అని నిరూపించవలసిన బాధ్యత క్రైస్తవునిదే. ఆ నిరూపణ ఊహాగానాల మీద, సంప్రదాయాల మీద కాకుండా, నేటికీ క్రైస్తవ సోదరుల చేతుల్లో సజీవంగా నిలిచియున్న దైవ గ్రంధం బైబిలు ఆధారంగానే జరగాలి. అందులో దేవుని సందేశం ఉంది.
'త్రిత్వం' అనే పదం బైబిలులో లేదు. దీనికి రుజువుగా 1 యోహాను 5:7 ను చెబుతారు. కింగ్ జేమ్స్ బైబిలులో మాత్రమే కనబడే వచనం ఇది. "పరలోకంలో" సాక్ష్యమిచ్చేవారు ముగ్గురు. తండ్రి, వాక్యము, పరిశుద్దాత్మ. వీరు ముగ్గురూ ఒక్కటే" ఈ మాట మరే బైబిలులోను ఉండదు. గ్రీకు మూల ప్రతుల్లో కూడా లేదు. కావాలంటే అన్ని బైబిళ్ళూ పరిశీలించండి. ఇది క్రొత్తగా కలుపబడింది. అంటాడు జాన్ సన్. ఇది నిజమైతే అదే యోహాను వ్రాసిన ప్రకటన గ్రంధం 22వ అధ్యాయం 18,19 వచనాల ప్రకారం కింగ్ జేమ్స్. బైబిలులో ఈ మాట కలిపిన వారికి దేవుడు తెగుళ్ళు కలుగజేయాలి. ఇది నిజం కాకపోతే మిగతా బైబిళ్ళలో ఈ మాట తీసివేసినవారికి పరిశుద్ద పట్టణంలో పాలు ఉండదు. జీవగ్రంధంలో నుండి వారి పేర్లు తీసివేయబడతాయి. క్రైస్తవులు ఇందులో దేనికి ఒప్పుకుంటారు? దేనికో ఒక దానికి వారు ఒప్పుకోక తప్పదు.
త్రిత్వానికి అంకురార్పణ
యూదులు "దేవుడు ఒక్కడే" అని నమ్మేవారు. " నేను దేవుని కుమారుడ్ని" అని ఏసు చెబితే దానిని దైవ దూషణగా భావించి ఆయన్ని రాళ్ళతో కొట్టి చంపబోయారు కూడా(యోహాను 10:33) ఆర్తడాక్స్ యూదులు ఎన్నటికీ ఏసు మెస్సయా అని ఒప్పుకోరు. హేస్టింగ్స్ ఇలా వ్రాశాడు: "హిందూమతంలో బ్రహ్మ, విష్ణువు, శివుడు అని ఒక త్రిత్వం ఉంది. ఈజిప్టు మతంలో ఒసిరిస్, ఇసిస్, హారస్ అనే త్రిత్వం ఉంది. మధ్య క్రైస్తవయుగంలో తండ్రి, తల్లి, కుమారుల చిత్రపటాలు ఉంచేవారు."
మరి తండ్రి, కుమార, పరిశుద్దాత్మలతో కూడిన ఈ త్రిత్వం ఎప్పుడొచ్చింది? మెక్లంటాక్ మాటల్లో చదవండి:- "2 వ శతాబ్దంలో యూదు మతంలోంచి, అన్యమతాలలోంచి, చాలామంది విద్వాంసులు క్రైస్తవ మతంలోకి వచ్చారు. వస్తూ వస్తూ వారు ప్లేట్లో గారి ఆలోచనలను తెచ్చారు. క్రీస్తు మరణానంతరం 300 ఏళ్ళ తరువాత 4వ శతాబ్దంలో మాత్రమే- త్రిత్వ సిద్దాంతం బాగా బలపడింది. మొదటి శతాబ్దంలో లేనేలేదు. రోమన్ కాథలిక్ మతం త్రిత్వానికి బాగా పునాది వేసింది. క్రీ..శ. 325లో బితూనీయలోని నైసియాలో, కాన్ స్టాంటైన్ చక్రవర్తి ఒక సభ జరిపాడు. సిద్దాంత బేధాలతో చీలిపోయిన సంఘాన్నిఒకటిగా చేసి క్రైస్తవుల మద్దతు పొందజూచాడు. సభ ఏరియస్, అతనేసియస్, అనే ఇద్దరు పండితుల వాదాలతో చీలిపోయింది. ఏరియస్ వాదమేమంటే "క్రీస్తు దేవుడు కాదు సృజింపబడిన ఒక వ్యక్తి" అతనేసియస్ వాదం ఏమిటంటే " తండ్రి, కుమారుడు, పరిశుద్దాత్మ ముగ్గురూ ఒక్కరే" చివరికి ఏరియస్ ను సభ నుండి వెలివేశారు. అతనేసియస్ వాదం నెగ్గింది. అదే వేదం అయ్యింది కాని వివాదం అంతం కాలేదు. సిద్దాంత భేదాలతో క్రైస్తవులే ఒకరినొకరు చంపుకొన్నారు. రోమా చక్రవర్తులందరూ కలిసి కూడా ఇంతమంది క్రైస్తవులను చంపలేకపోయారు. అయిదు సంవత్సరాలపాటు ఆగకుండా ఈ హత్యాకాండ కొనసాగింది" ఆ విధంగా హింస ద్వారా అధికారం ద్వారా త్రిత్వం నమ్మించబడింది ఆ మేరకు లేఖనం మార్చబడింది.
దేవుడు ఒక్కడే
అసలు ఇప్పటికీ మన చేతుల్లో ఉన్న బైబిలు ప్రకారం చూచినా త్రిత్వం ఒక కట్టుకధ మాత్రమే అని తేలుతుంది. త్రిత్వం మాయలో పడి లేఖనంలోకి తొంగి చూడని వారు, త్రిత్వంలోని మూడవ వ్యక్తి పరిశుద్ధాత్మను తొలగించి ద్విత్వాన్ని మాత్రమే నమ్మేవారు. అద్వితీయుడైన దేవుడ్ని నమ్ముతూనే తండ్రీ కుమారులిద్దరూ ఒక్కరేనని నమ్మేవారు... ఇలా క్రైస్తవ్యం వందలాది చీలికలై పోయింది. అందుకు కారణం ఏమిటి? ప్రతి డినామినేషన్ తన వాదానికి ఆధారంగా బైబిలులోని వాక్యాలనే ఎత్తిచూపుతున్నది. పరస్పర విరుద్దమైన, అపోహలకు, అపార్ధాలకు తావిచ్చే అనేక అంశాలతో బైబిలు నిండి వుంది. " దేవుడు ఒక్కడే" అని బైబిలులో ఎన్నోసార్లు మనకు కనిపిస్తుంది. మరి దేవుడు ఒక్కడే అయితే మేము ఇద్దరము లేక ముగ్గురము అనే మాట ఆయన తన గ్రంధములో చెప్పాడు. చెప్పకూడదు కూడా. మాటాలు మార్చే దేవుడ్ని, మరికొందరిని తన మహిమలో భాగస్థులుగా చేసికొనే దేవుడ్ని మనం నమ్మగలమా?
త్రిత్వంలోని అద్వితీయుడైన, తండ్రియైన దేవుడ్ని మనం నిశ్చింతగా అంగీకరించగలం. అయితే సమస్యల్లా కుమారుడైన దేవుడు, పరిశుద్దాత్మ దేవుళ్ళ దగ్గరే వస్తూ ఉంది, ఈ దేవుడైన ఏసు ఎవరు? దేవుడే మనిషిగా వచ్చాడా? లేక దేవుడీ మనిషిని తన కుమారునిగా ఎన్నుకున్నాడా? లేక కన్నాడా? మరి ఆ పరిశుద్దాత్మ దేవుడెవరు? పరిశుద్దాత్మ అంటే ఆయన ఒక ఆత్మా లేక వ్యక్తా లేక శక్తా? బైబిలు ప్రకారమే అయితే కొన్ని లేఖనాలను తీసికొని " అవును" అని చెప్పవచ్చు. దృఢంగా అద్వితీయ దేవుని గురించి బోధిస్తూ నిలబడవలసిన గ్రంధం కొందరి స్వంత భావాల చొప్పింపు వలన వంగిపోయింది. నిశ్చయంగా బైబిలులో దేవుని ఉద్దేశం స్పష్టంగా నేటికీ వెల్లడవుతూనే ఉంది. అబ్రాహాము నమ్మిన దేవుడ్ని పలచబరిచే వాక్యాలు ఆ దైవ గ్రంధంలో చేరాయి. ఇప్పుడు " త్రిత్వం" లోని మిగతా ఇద్దరి గురించి వివరంగా చూద్దాము. అది కూడా బైబిలు ఆధారంతోనే:-
క్రీస్తుకు పూర్వం 600 ఏళ్ళ క్రితం దాని యేలు దర్శనంలో " ఆకాశమేఘారుడుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహా వృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి, ఆయన సముఖమునకు తేబడటం" చూచాడు. (దాని యేలు 7:13), సకల జనుల మీద ప్రభుత్వం, ఆధిపత్యము, ఆయనకివ్వబడినవి.(దాని 7-14). ఏసుక్రీస్తే దేవుడయితే ఆయన సన్నిధికి వెళ్ళటం కుదరదు. దేవుని సన్నిధికి కొనిపోబడిన వారిలో ఏసుక్రీస్తు, ముహమ్మదు ప్రవక్త ఇద్దరూ ఉన్నారు. మరి ఈ మనుష్య కుమారుడు క్రీస్తే అని బైబిలులో ఉంది. మనుష్య కుమారుడు దేవుని కుమారుడు, దేవుడు ఎలా అవుతాడు?
తండ్రియైన దేవుడు, క్రీస్తు, పరిశుద్దాత్మ " ముగ్గురూ కూడా ఏసే" అనేవాళ్ళు కొందరూ, "వాళ్ళంతా వేరే వేరే" అనే వాళ్ళు కొందరు. అయితే బైబిలు ఏమంటున్నది? పరలోకంలో తండ్రి మాట్లాడుతుంటే. పరిశుద్దాత్మ పావురంలాగా ఆకాశం నుండి దిగివస్తుంటే, ఏసు అదే సమయంలో బాప్తిస్మం పొందినట్లు మత్తయి సువార్త 3:16,17 లో ఉంది. ఏసు తనకుతానే ప్రార్ధించుకోకుండా దైవాన్ని ప్రార్ధిస్తాడు(లూకా 6:12) తాను వెళ్ళి తండ్రి ఆదరణకర్తను పంపేలా వేడుకుంటానన్నాడు.(యోహాను 14:26).
"అద్వితీయ సత్యదేవుడవైన నిన్నూ, నీవు పంపిన ఏసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవము" అని ఏసు అంటాడు(యోహాను 17:3). త్రిత్వంలోని ముగ్గురూ ఏసే అయ్యేటట్లయితే ఏసు సిలువ మీద చనిపోయి, మూడు రోజులు సమాధిలో ఉన్నప్పుడూ " దేవుడు కూడా" చనిపోయి లేచినట్లే" ఆ మూడు రోజులపాటు దేవుడు లేకుండానే ప్రపంచం మనగలిగిందా?
దేవుడు అద్వితీయుడైతే ఈ ద్వితీయుడు ఎవరు?
ఇక పరిశుద్దాత్మ అనేది ఒక వ్యక్తో, శక్తో అర్ధం కానంత అయోమయం క్రైస్తవులను ఆవరించింది. వాస్తవానికి అది పురుష లింగం కాని స్త్రీ లింగంకాని, కాక నపుంసక లింగమై వుండాలని కొందరి వాదన. పాత నిబంధనలోని "ఆత్మ" స్త్రీలింగంలో చెప్పబడింది. దైవత్వంలోని ముగ్గురిలో ఆత్మ స్త్రీయేనని కొందరన్నారు. అందుకే తండ్రి, తల్లి, కుమారుడు వెలిశారు. చివరికి ఈ నవీన త్రిత్వవాదులు వారిని ఖండించి తల్లిగా పిలవబడే ఆత్మ పురుషుడేనని అన్నారు.
బైబిలు ప్రకారం పరిశుద్దాత్మ దేవుని శక్తి(జెకెర్యా 4:6, మీకా 3:8). అది ఒక వరం(అపోకార్య 2:38). అది క్రుమ్మరించబడుతుంది.(అపోకార్య 2:17; 10:46). దానిని ప్రజ్వలింపజేయవచ్చు. ఆర్పివేయవచ్చు(మోతిజే 1:7;1 థెస్స 5:19) అది పుట్టించే దేవుని జీవశక్తి(మత్తయి 1:18; రోమా 3:9-11) వ్యక్తి అయితే ఈ పనులు సాధ్యం కావు.
పౌలు కూడా త్రిత్వాన్ని గుర్తించలేదు,"
మన తండ్రి అయిన, దేవుని నుండియు, ప్రభువైన ఏసు క్రీస్తు నుండియు కృపాసమాధానములు మీకు కలుగుగాక" అని తాను వ్రాసిన లేఖనాలన్నింటిలోనూ పౌలు ముందుగా వ్రాశేవాడు. మరి దేవుడొక త్రిత్వమయితే పరిశుద్దాత్మను పౌలు వదిలేశాడేమి? త్రిత్వం నిజమయితే ఇది దైవదూషణే. ఇలాంటి మాయత్రిత్వంలో మనం మునిగిపోయి. "అద్వితీయ దేవుడ్ని" గుర్తించకూడదనే షైతాను ఈ సిద్దాంతాన్ని లోకంలో వ్యాపింపజేశాడు. వాడి జాలం నుంచి బయటపడలేనంత అజ్ఞనంలోకి పండితులు వెళ్ళిపోయారు.
సత్యం కోసం మన సంకుచిత భావాలను ఇప్పటికైనా వదిలి కళ్ళు తెరిస్తే ఒక్కడయిన " ఆ దేవుడే" కనిపిస్తాడు. ఆ దేవుడు మానవాళి కోసం పరితపించిన దేవుడు. " నా దగ్గరకు రండి, నేనే మీ పోషకుడ్ని, మీ కోసం పరలోకం ఉంచాను" అని పదే పదే ప్రవక్త లను పంపిన దేవుడు. ఆయనకు బదులు మరొకరిని ఆరాదిద్దామా? యాకోబు సంతానమయిన ఇశ్రాయేలీయులు దేవుని విషయమై నిబంధన చేసి ఎన్నోసార్లు ఈ విషయామై తప్పిపోయారు. దేవుడు తనను వదిలి మరొకరిని ఆరాధించినవారిని "వ్యభిచారులు" అన్నాడు. ఏ భర్త అయినా వ్యభిచారము చేసిన భార్యను క్షమించి కాపురం చేయ నిష్టపడగలడా? నన్ను విడిచి విగ్రహారాధన వైపు మళ్ళిన మిమ్మల్ని నేను ఎన్నోసార్లు క్షమించి స్వీకరించాను. నా కరుణా స్వభావాన్ని మీరు చులకనగా ఎంచారు అన్నాడు దేవుడు ఇశ్రాయేలీయులతో.
త్రిత్వవాదుల గురించి దేవుడు ఏమని చెబుతున్నాడు?
"మర్యం కుమారుడైన మసీహే అల్లాహ్ అని అన్నవారు నిశ్చయంగా తిరస్కారానికి పాల్పడ్డారు. వాస్తవానికి మసీహ్ అన్నాడు,"ఓ ఇస్రాయీలు సంతానమా! అల్లాహ్ ధాస్యం చెయ్యండి. ఆయన నాకూ ప్రభువే. మీకూ ప్రభువే. ఎవరయితే ఇతరుల్ని అల్లాహ్కు భాగస్వాములుగా చేస్తారో వారికి అల్లాహ్ స్వర్గం నిషిద్దం చేశాడు. వారి నివాసం నరకం. అటువంటి దుర్మార్గులకు సహాయం అందించే వాడెవ్వడూ లేడు."అల్లాహ్ ముగ్గురిలో ఒకడు" అని అన్నవారు నిశ్చయంగా తిరస్కారానికి పాల్పడ్డారు.వాస్తవమేముటంటే ఒకే దైవం తప్ప ఏ దైవమూ లేడు. వారు తమ ఈ మాటల్ని మానుకోకపోతే,తిరస్కారానికి ఒడిగట్టిన వారికి వృధాభరితమైన శిక్ష పడుతుంది. ఐతే, వారు అల్లాహ్ సమక్షంలో తౌబా(పశ్చాత్తాపం-మరలుట) చేసుకోరా? క్షమించమని ఆయన్ని వేడూకోరా? అల్లా అమితంగా మన్నించేవాడు, కరుణించే వాడూను. మర్యమ్ పుత్రుడైన మసీహ్ ఒక ప్రవక్త తప్ప మరేమీ కాడూ. ఆయనకు పూర్వం కూడా ఎంతో మంది ప్రవక్తలు గతించారు. ఆయన తల్లి ఒక సత్యవతి. వారు ఉభయులూ భోజనం చేసే వారు--చూడండి! మేము ఏ విధంగా వీరి ముందు సత్యానికి సంబంధించిన సూచనల్ని విశదీకరిస్తారేమో చూడండి! తరువాత వారు వెనక్కి తిరిగి ఎటు పోతున్నారో! వారితో అనండి,"ఇదేమిటి, మీరు అల్లాను వదిలి మీకు నష్టం కాని, లాభంగానీ కలిగించే అధికారంలేనిదాన్ని ఎందుకు పూజిస్తారు? అందరిదీ వినేవాడు అంతా తెలిసిన వాడైతే అల్లాహ్ మాత్రమే". "గ్రంధం కల ఓ ప్రజలారా! మీ ధర్మంలో అధర్మంగా హద్దులు మీరకండి. మీకు పూర్వం స్వయంగా తామూ మార్గభ్రష్టులై, ఇంకా చాలా మందిని మార్గభ్రష్టులుగా చేసి, ఋజుమార్గం తప్పిన వారి భావనల్ని అనుసరించకండి" అని చెప్పండి( అల్ మాఇద: 72-76)
నీవు అల్లాహ్ తో పాటూ మరొక ఆరాధ్యుణ్ణి చేసుకోకు(ఖురాన్-17:22)
తెలుసుకోండి! ఆకాశాల్లో ఉండేవారైనా, భూమిలో ఉండేవారయినా సర్వులూ అల్లాహ్ పాలితులే. ఎవరయితే అల్లాను కాదని(తమ స్వకల్పితమైన) కొందరు భాగస్వాముల్ని వేడుకుంటున్నారో, వారు కేవలం భ్రమను, అనుమానాన్ని అనుసరిస్తున్నారు(ఖురాన్:10:66)
----- నూర్ బాషా రహంతుల్లా ( గీటురాయి 8.5.1987)
అయ్యా నూర్ బాష రహంతుల్లా గారు. మీరు వ్రాసిన ముగ్గురు దేవుళ్ళు ( బ్లాగు ) గురించి చదివాను. అందులో మీరు చేసిన వ్యాఖ్యలు అర్ధరహితమైనవిగాను, మభ్య పెట్టేవిగాను, అసంపూర్ణము గాను ఉన్నాయి. క్రైస్తవులు గత్యంతరం లేని పరిస్తితుల్లో త్రిత్వాన్ని నమ్మాల్సిన స్తితిలో లేరు. ఎందు కంటే వారు కేవలం క్రీస్తుని నమ్మిన వాళ్ళు మాత్రమే కాదు. బైబిలును సరిగా చదవకుండా దేవుడు త్రిత్వమా అని వ్రాసిన అనేక మంది క్రీస్తు విరోధులకు, మాత్రమే కాకుండా జ్ఞానులను సిగ్గు పరచుటకు లోకములోనుండు వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొన్న సాధనములు. (౧ కోరిందీ ౧:౨౯) అంతే కాదు పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించు సంపూర్ణులు. ( ౧ కోరిందీ ౨:౬ ) మీ వ్యాఖ్యలు నిరర్ధక మైనవని నేను నిరూపించటానికి ( త్రిత్వ దేవుని గురించి సవివరంగా 'పూనురిరమేష్.వర్డుప్రెస్సు.బ్లాగ్ లో ) వ్రాసాను. కేవలం బైబిల్ వాక్యాల ఆధారంగా మాత్రమే.
రిప్లయితొలగించండి"యోహొవా సాక్షులు,ఏడవ దినమును ఆచరించేవారు,యేసు నామం వారు దేవుడు త్రిత్వము కాదు దేవుడు ఒక్కడే అని చాటించి, జనులను మోసగించుచున్నారు "అని మీరు అంటున్నారు.మీకు త్రిత్వం ఎలాగో వారికి ఏకత్వం అలాగ.దేవుడు ఒక్కడు కాదు ముగ్గురు అంటూ మీరే జనాన్ని మోసం చేస్తున్నారని వారు కూడా అంటున్నారు మరి.దేవుడు ఒక్కడే ఆయన అద్వితీయుడు అనే బైబిల్ వాక్యంతో ఖురాన్ ఏకీభవిస్తున్నది.
రిప్లయితొలగించండిత్రిత్వాన్ని ఇంకా బాగా అందరికీ అర్ధమయ్యేలా వివరించవచ్చు.ఒక్క నీరే నీళ్ళు మంచు ఆవిరి గా ఎలా ఘన ద్రవ వాయు రూపాల్లో దర్శనమిస్తుందో దేవుడు కూడా తండ్రి, కుమార (యేసు), పరిశుద్ధాత్మ అనే మూడు రూపాల్లో దర్శనమిస్తాడు.మీకు నచ్చవచ్చు.అయితే అవి నా సొంతమాటలు.ఒక్కడే దేవుడు.ఆయనకు ఒక కొడుకు ఉన్నాడనటం తగదు అనేది ముస్లిముల నమ్మకం.అలా నమ్మేవారందరికీ సహనంతో జవాబివ్వాలి గానీ పిల్లోచ్చి గుడ్డును వెక్కిరించినట్టు,వంచకులు ,శాపగ్రస్తులు, వారితో శుభమని చెప్పవద్దు,సత్యం అనే పునాదే సరిగాలేని రహమతుల్లా అంటే ఎలా?
యోహొవా సాక్షులు, ఏడవ దినమును ఆచరించేవారు, యేసు నామం వారు దేవుడు త్రిత్వము కాదు దేవుడు ఒక్కడే అని చాటించి, జనులను మోసగించుచున్నారు"
రిప్లయితొలగించండిఅని మేము అనటము లేదు. పరిశుద్ద గ్రంధమైన బైబిలు అంటుంది. త్రిత్వము మా వివరణ కాదు మాకు బైబిల్ ఇచ్చిన వివరణ. మాకే కాదు లోకములో ఉన్న ప్రతి ఒక్కరికి మా ద్వారా సవివరణ! ఇకపోతే మోసం అంటారా మాది మోసం వాళ్ళది మోసం అనే కంటే బైబిలో అపోస్తులుడైన పౌలు పరిశుద్దాత్మ ద్వారా ఇచ్చిన వేద వాక్యమే పునాది!! ( దేవుడు నాకనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి యైన శిల్పకారునివలె పునాది వేసితిని, మరి యొకడు దాని మీద కట్టుచున్నాడు; ప్రతి వాడు దాని మీద ఎలాగు కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. | వేయబడినది తప్ప, మరియొక పునాది ఎవడును వేయనేరడు; ఈ పునాది యేసు క్రీస్తే. | ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగాల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన యెడల, వాని వాని పని కనబడును, ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. | ౧ కోరిందీయులకు 2 : ౧౦-౧౪ )
నాకు తెలిసి అగ్నికి తట్టుకునేది బంగారమే, ఎవరు ఎవిరి కిష్టమోచ్చినట్లు వారు కట్టుకోవచ్చును, ఎందుకంటే పరీక్షించేది నేను కాదు, అగ్ని అని వివరణ ఉంది.
అందరిని దేవుడు పరలోకానికి మార్గం తెరిచాడు. కాని అది ఇరుకు మార్గము అగ్ని అనే పరీక్షా పరలోకానికి గీటురాయి. నరకానికి హద్దు రాయి. ఇంతటి గొప్ప పనిలో దేవుడే పునాదిరాయి, "జాగ్రత్త అనే పదం అనుభవములోకి వచ్చినదాక దానిని తెలుసుకోవటం కష్టమే" దానిని తన బిడ్డలకు నేర్పడం కూడా దేవుని ఇష్టమే .
ఇక పొతే ఇంత వివరణ ఇవ్వడానికి కారణం, భూమి మీద మనుష్యులలో ఉండే త్రిత్వ వైకరే!! నాకు తెలిసి అందరి ఏకాభి ప్రాయలు కుదరక పోవడానికి ఇదే కారణం కావచ్చు, ( మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంబందమైన సంగతులను ఆత్మ సంబందమైన సంగతులతో సరి చూచుచు, ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము భోదించుచున్నాము. ప్రకృతి సంబదియైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రి తనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఆత్మసంబంధి యైనవాడు అన్నిటిని వేవేచించును గాని అతడేవని చేతనైనను వివేచింపబడడు. ౧ కోరిందీ ౨:౧౩-౧౫) ఇక పొతే శరీరసంబంది అని ౩వ అధ్యాయములో వ్రాసిన వివరణ ఆదారముగా దేవుని వాక్యమే త్రిత్వ వైకరి వలన మనుష్యులలో బేధము కలుగుతున్నదని ఋజువుచేస్తుంది. బహుశా మావైకరి మిగిలిన వర్గాల వారికి అర్ధం కాకపోవటానికి కారణం వారు దేవుని వాక్య ప్రకారం శరీర, ప్రకృతి సంబందులై ఉండవచ్చు, ఎందు కంటే ఈ రెండిటి గురంచి దేవునివాక్యములో స్ప్రష్టమైన వివరణ ఉంది.
క్రైస్తవులు గత్యంతరం లేక త్రిత్వాన్ని నమ్ముతున్నారు. అనే పదం ఎంత దారుణం! ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు యొక్క అత్యంత పరిశుద్దమైన బైబిల్ గ్రందాని పదిహేను సంవత్సరాలు చదివిన మీరు ఈ వ్యాఖ్యలు చేయడం చాలా ఘోరం !! పిల్లోచ్చి గుడ్డును వెక్కిరించినట్టు,వంచకులు ,శాపగ్రస్తులు, వారితో శుభమని చెప్పవద్దు,సత్యం అనే పునాదే సరిగాలేని రహమతుల్లా ఇలాంటి పదాలన్ని మీరు చేసిన ఈ వ్యాఖ్యల ముందు దిగదుడుపే !!
చివరిగా ఎవరు నమ్మిన నమ్మక పోయిన సువార్త ప్రకటించటం మా ప్రాణం దీనికోసమే ప్రభువు మమ్మలను ఏర్పాటు చేసుకొనియున్నాడు. అనేకులను రక్షించటం కోసం ఈ వాక్యాన్ని కూడా నమ్ముతాము ( దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కా ర్యమునకు పూర్ణముగా సిద్దపడి యుండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతీ లేఖనము, ఉపదేసించుటకు, ఖండించుటకు, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజన కరమైయున్నది. ౨. తిమోతి ౩:౧౬) ఈ క్రమములో కొన్ని వాక్యాలు మీకు బాధ కలిగినను మీరు సువార్తను నమ్మిన యెడల అది మీకు ప్రయోజన కరమైయున్నది.
యోహొవా సాక్షులు, ఏడవ దినమును ఆచరించేవారు, యేసు నామం వారు దేవుడు త్రిత్వము కాదు దేవుడు ఒక్కడే అని చాటించి, జనులను మోసగించుచున్నారు అని మీరెలా చెప్పగలరు?దేవుడు ఒక్కడే అంటే మీకు అభ్యంతరం ఎందుకు?వ్యక్తిగత విమర్శలు అనవసరం.ఇది సిద్ధాంత చర్చ.త్రిత్వాన్ని సమర్ధించే బైబిల్ వాక్యాలనే ఉదాహరించండి.
రిప్లయితొలగించండివాక్యాధారము ద్వారానే మేము వివరించాము. పునురి రమేష్ వర్డుప్రెస్సు.కామ్ లో పూర్తి ప్రతి ఉంది. దయచేసి దానిని పరిశీలించమని కోరుతున్నాను. కేవలం వాక్యాధారము ద్వారానే వివరించాము. మాకు అభ్యంతరం అనే పదం లేనే లేదు. నేను పుట్టుకతో క్రైస్తవుడను కాదు, భారతీయుడిని అది కచ్చితమా కాదా అని లేఖనాల ఆధారముగా పరిశోధించి ప్రామాణికముగా ఉన్న వాటిని మాత్రమే గుర్తించి వ్రాయడం జరిగింది. చూడటానికి ఒకేలాగా ఉన్నాయని ఉప్పుని, కర్పూరాన్ని ఒకటే అంటె ఎలా?
రిప్లయితొలగించండిపునూరి రమేష్ గారూ
రిప్లయితొలగించండిఉప్పు ఉప్పే కర్పూరం కర్పూరమే.దేవుడు ఒక్కడు కాదు ముగ్గురు అని చెప్పే బైబిల్ వాక్యాలను మాత్రమే దయచేసి ఇక్కడ కోట్ చెయ్యండి చాలు.త్రిత్వాన్ని సమర్ధించే బైబిల్ వాక్యాల రిఫరెన్సులు ఇవ్వండి చాలు.
త్రిత్వమనేది కల్పితం మాత్రమే దీనికి ఆధారాలు ఎన్నో ఉన్నాయి
రిప్లయితొలగించండిబైబిల్ లో కూడా ఎక్కడా నేను ఈ త్రిత్వ సిద్ధాంతాన్ని చదవలేదు
జవహర్ పీటర్ గారూ
రిప్లయితొలగించండిబైబిల్ వాదకులు ఖురాన్ లోని నరకానికీ,ఖురాన్ వాదకులు బైబిల్లోని నరకానికీ పాత్రులవుతారనేగా మీ కొత్త సిద్ధాంతం?యేసు ప్రాణం పెట్టలేదంటే అది సైతాను సిద్ధాంతమని బైబిల్ చెబుతోందా?రిఫరెన్సులు ఇవ్వండి.
ఖురాను దైవ గ్రంధం కాదు మొహమ్మద్ద్ (ప్రవక్త ) గ్రంధం అది కేవలం మక్కా పోవటానికి మాత్రమే దారి చూపెడుతుంది. పరలోకానికి పోవటానికి ఉపయోగ పడదు. కాదంటారా ? అయితే రుజువులు చూపించండి !
రిప్లయితొలగించండిదొంగలున్నారు జాగ్రత్త అన్నట్లు వణుకు పుట్టించకుండా సబ్జెక్ట్ పై మీ అభిప్రాయం ధారాళంగా చెప్పండి చాలు.ఇది చర్చా వేదికే గానీ సవాళ్ళ వేదిక కాదు.
రిప్లయితొలగించండిరహంతుల్లా గారు మీ చర్చ త్రిత్వం గురించా? లేక (ఇస్లాం)మతం గురించా? సూటిగా ప్రశ్న మాత్రం అడగండి అప్పుడు మీకు కావాలసిన జవాబులు ఇచ్చేందుకు అనువుగా ఉంటుంది
రిప్లయితొలగించండిత్రిత్వం గురించే
రిప్లయితొలగించండిత్రీ అంటే . . . మూడు . . . .
రిప్లయితొలగించండియెక అంటే ఒకటి . . .ఇవి సంస్కృత పదాలు . . .
ముగ్గురు యేకమైనారు కాబట్టి . . . త్రీ యెక అని పిలుస్తాము . . .
మీ సహోదరుడు . . .
త్రీ అంటే . . . మూడు . . . .
రిప్లయితొలగించండియెక అంటే ఒకటి . . .ఇవి సంస్కృత పదాలు . . .
ముగ్గురు యేకమైనారు కాబట్టి . . . త్రీ యెక అని పిలుస్తాము . . .
మీ సహోదరుడు . . .
> త్రీ అంటే . . . మూడు . . . .యెక అంటే ఒకటి . . .ఇవి సంస్కృత పదాలు . . .
తొలగించండి'యెక' కాదండి. 'ఎక' కూడా కాదు. సంస్కృతంలో పొట్టిగా 'ఎ' అన్నది లేదు. 'ఏ' అన్న అక్షరం ఒకటే ఉంది. ఒకటి అనటానికి సంస్కృతపదం ఏకమ్ అని. 'ఏక' అన్న రూపమూ బహుసందర్భాల్లో వస్తుంది.
>ముగ్గురు యేకమైనారు కాబట్టి . . . త్రీ యెక అని పిలుస్తాము .
త్రయైక అన్నది సరైన రూపం.
నా సవరణలకు మీకు అభ్యంతరం ఉంటే మన్నించండి.
పదం
రిప్లయితొలగించండి