22 షెడ్యూల్డ్ భాషలు | ||||
క్రమ సంఖ్య | భాష పేరు | తొలి భగవద్గీత అచ్చు వేసిన సంవత్సరం | తొలి బైబిల్ అచ్చు వేసిన సంవత్సరం | తొలి ఖుర్ ఆన్ ముద్రించిన సంవత్సరం |
1 | హిందీ | | 1818 | 1915 |
2 | బెంగాలీ | | 1809 | 1886 |
3 | తెలుగు | | 1854 | 1930 |
4 | మరాఠి | | 1821 | 1973 |
5 | తమిళం | | 1727 | 1879 |
6 | ఉర్దూ | | 1848 | 1731 |
7 | గుజరాతీ | | 1823 | 1879 |
8 | కన్నడ | | 1831 | 1978 |
9 | మళయాళం | | 1841 | 1970 |
10 | ఒరియా | | 1815 | |
11 | పంజాబీ | | 1959 | 1870 |
12 | ఇంగ్లీషు | 1785 | 1382 | 1649 |
13 | అస్సామీ | | 1833 | 1970 |
14 | మైధిలీ | | 1914 | |
15 | సంతాలి | | 1914 | |
16 | కశ్మీరి | | 1899 | 1887 |
17 | సింధీ | | 1954 | 1867 |
18 | నేపాలి | | 1914 | 2008 |
19 | కొంకణి | | 1970 | |
20 | మణిపురి (మైధీ) | | 1984 | |
21 | బోడో | | 1981 | |
22 | డోగ్రి | | 1826 | |
23 | సంస్కృతం | | 1822 | 1897 |
తెలుగు మాతృభాషగా గల ముస్లిములకోసం భాషాపరమైన సంస్కరణలు కోరటం,వారు ఎదుర్కొంటున్న వివిధ సామాజిక సమస్యలను చర్చించటం కోసం ఈ బ్లాగు
ఈ బ్లాగును సెర్చ్ చేయండి
31, డిసెంబర్ 2011, శనివారం
భారతీయ షెడ్యూల్డ్ భాషల్లో తొలి భగవద్గీత,బైబిల్,ఖురాన్ లు
భారతీయ షెడ్యూల్డ్ భాషల్లో తొలి భగవద్గీత,బైబిల్,ఖురాన్ లు ప్రచురించబడిన వివరాలుః దొరికినవరకు సేకరించి ఇస్తున్నాను. దొరకనివి ఖాళీగా ఉంచాను.తెలిసిన వారు సమాచారం చేర్చండిః
తెలుగులో కురాను,నమాజు
మానవ నిర్మితమైన పారంపర్యాచారాలను నిలుపుకోవాలనే తలంపుతో, దైవోపదేశాలను వదిలివేసి, కేవలం మన హేతుబుధ్ధితో అగోచర విషయాలను తర్కించబూనటం అవివేకం అవుతుంది. (ఇమ్రాన్:7)
ఆరబీ బాష అత్యున్నతమైనదే కావచ్చు. ఆది అర్ధం అయ్యే వారికే దాని గొప్పతనం తెలుస్తుంది.ఆందరికీ అదే భాషను అవశ్యం చెయ్యటం కంటె ఆ భాషలో వెలువడిన దైవ సందేశాన్ని అందరికీ అర్ధం అయ్యెట్లు చెప్పటం వివేకవంతంగా ఉంటుంది. ఎందుకంటే దేవుని ద్రుష్టిలో కూడా భాషకంటె భావమే విలువైనది.ఖురాన్ బోధ చాలా సులువైనది(చంద్రుడు17,22,40).
కానీ ప్రపంచంలోని కోట్లాది అరబ్బేతరులకు అది అర్ధం కాని మంత్ర పటనం లాగా ఎందుకు ఉంది? కేవలం ఆ మహా ఘనత గల దైవ సందేశాన్ని(కహఫ్:1)అరబీ భాషలో బంధించటం వల్లనే కాదా? " ఏ జాతి వారి తాత ముత్తాతలకు భయబోధ చేయబడలేదో వారిని భయపెట్టటం కోసం ఈ అరబ్బు ప్రవక్తగా పంపబడ్డారు(యాసీన్:6).
ఈ అరబ్ ప్రవక్త తెచ్చిన భయబోధ ఆ జాతి వారికే పరిమితమై ఉంటుందని, అరబ్బేతరులకు వర్తించదని ఎవరైనా చెప్పగలరా? అందరికీ వచ్చే భాష అందరికీ అర్ధమయ్యె భాష ఏది?
"వీళ్ళు గ్రహించటం కోసం ఈ కురాన్ను నీ భాషలో సులువుగా చేశాము"(పొగ:58) అంటే అరబ్బులు తప్ప ఇతర భాషల జనం దాన్ని గ్రహించకూదదని దెవుని భావం కాదు.ప్రవక్త అరబీయుదు,అతని స్వజనం అతని మాటలు వినాలంటే అతని భాషలోనే దైవ సందేశం రావాలి. ఫ్రవక్తకే అర్ధం కాని భాష ప్రవక్త జాతి ప్రజలకు అర్దం ఎలా అవుతుంది?ఒక వేళ దెవుడు పరాయి భాషలను అర్ధం చేసుకునే అద్బుత శక్తిని ప్రవక్తకు ఇచ్చి సందెశాన్ని పంపినప్పటికీ ఆ జనం "అరబ్బీ ప్రవక్త- అర్ధంకాని అజమీ కురాన్" అని ఎగతాళి చేస్తారు (సజ్దా:44).
ఆరబ్బేతరుడు అరబీలొ ప్రవచిస్తూ వస్తే అతన్నీ నమ్మరు (కవులు:198,199). అందువలన ప్రవక్త స్వభాషలోనే ప్రవచనం రావటం ఎంత ఆవశ్యకమో ఆ ప్రవచనం ఆయా ప్రజల భాషలలోనే వారికి అందించబడటం కూడా అంతే అవసరం. ఆద్వితీయ దేవుని గురించి అరబ్బులకు అరబీలో చెబుతుంటేనే, నీ మాటలు మా హ్రుదయాల్లొ దూరవు, మా చెవులు చెవిటివైపోయాయి. నీకూ మాకూ మధ్య పెద్ద తెర ఒకటి అడ్డంగా ఉంది, నీ దారి నీదీ మాదారి మాదీ అన్నారు విగ్రహారాధకులు(హామీం:5).
అరబ్బేతరులకు అరబీలొ చెప్పి ఒప్పింపచేయటం అలవి అయ్యే పనేనా? రాజ్యాధికారం పొందిన ఆంగ్లెయులు ఇంగ్లీషును అందరిమీదా రుద్దినలాగా అరబీని అందరికీ అంటగట్టగలిగితేనే అది సాధ్యం అవుతుంది.
ఆయినా ఇక్కడ సమస్యను చిటికెలో తీర్చగల సర్వలోకాల ప్రభువు కురాన్ను అరబీలొ పంపి ఆదమరచి నిద్రపోలేదు. ఫంపిన ఉద్దేశం వెల్లడించాడు.ఆది విశ్వాసులకు స్థిరత్వం ఇవ్వాలి,సన్మార్గం చూపించాలి, సువార్త వినిపించాలి (తేనెటీగ:103)
నమాజులోకానీ, మరో చోట కానీ అరబీ కురాన్ వింటుంటే మనకు పై మూడు ప్రయోజనాలు కలగటం లేదు.తెలుగు కురాన్ ద్వారా అవి మనకు సిద్ధిస్తున్నాయి. నిశ్చయంగా కురాన్ మనను కష్టపెట్టటానికి గాక మనకు బోధ చెయ్యడానికే వచ్చింది.(ఓ మానవుడా:2,3). ప్రతి ప్రవక్త కూడా తన మాతృభాషలోనె దైవ సందేశం ప్రచారం చేసేవాడు. దైవసందేశం కూడా ప్రవక్తల మాతృభాషలోనె వచ్చేది.ఎందుకని? ముదు ప్రవక్తకు అర్ధం కావాలి.ఆతరువాత ఏ ప్రజలకైతే చెప్పబోతున్నాడో ఆ ప్రజలకూ అర్ధం కావాలి.అర్ధమయ్యిందే సరైన మతం. ఈమర్మం కురానులోనే విప్పిచెప్పబడింది.కురానును అల్లా అరబ్బీలోనే ఎందుకు పంపాడు?1."ప్రవక్తకు అర్ధం కావడానికి"(కురాను 12:2),2."అరబ్బులు గ్రహించటం కోసం"(43:2,3),3."మక్కా చుట్తుపక్కల ఉన్నవారిని హెచ్చరించటం కోసం"(కురాను 12:7).మరి మన తెలుగువాళ్ళు గ్రహించాలన్నా,అర్ధంచేసుకోవాలన్నా,హెచ్చరికపొందాలన్నా అది తెలుగులోనే సాధ్యంగదా? మాటిమాటికి పఠించే ఆ ఏడు వాక్యాలు (గుట్ట:87) కూడా ప్రతి ప్రార్ధనలో మనకు బోధ చేస్తూ ఉండాలి.అది మన మాత్రుభాషలొనె మనకు సాధ్యమవుతుంది. మనిషిని ఉద్ధరించగల ప్రార్ధనలో 4 ముఖ్య విషయాలున్నాయి:-
ఈ వచనాన్ని గురించి అబ్దుల్ గఫూర్ గారు ఇలా వ్యాఖ్యానించారు:
"నమాజు చాలా మహిమగలది.దానిని నియమముగా భక్తి పూర్వకముగా చేసినచో అది భక్తులను సిగ్గుమాలిన పనులనుండి పాపకార్యములనుండి మానిపించును. దుర్గుణములను తొలగించి మంచి గుణములను కలిగించుట దాని స్వభావము. ఎట్లు మందును నియమముగా పథ్యముతో సేవించిన రోగము పోయి ఆరోగ్యము చేకూరునో, అట్లే నమాజు సలుపుచు దానికి విరోద కార్యములను మాను కొనినచో, ఆత్మ సంబందమైన రోగములు అను దుర్గుణములు నశించి, ఆత్మకు ఆరొగ్యము అనెడి సుగుణములు అలవడును. భక్తుడు పాపములు వదలుకొనును.దొంగ భక్తి వలన పాపములు తొలగనిచో అది వాని తప్పుయే కాని నమాజు దోషము కాదు.నమాజు చేయునపుడు దేవుని సాన్నిధ్యమున నిలచి భక్తితోనుందునని వాగ్ధానము చేసి నమాజు ముగించిన పిదప పాప కార్యములు చెయువాడు మాట తప్పిన వాడగును. అట్లు చేయవలదు అని నమాజు హెచ్చరించుచుండును". "నేను జిన్నాతులను మానవులను పుట్టించినది వారు నన్ను ఆరాధించుట కొరకే" (51:56)
అంటే మనిషి జీవిత ఉద్దేశమే దైవారాధన. మీరు నన్ను పొషించనవసరం లేదు.నాకు అన్నం పెట్టనక్కరలేదు. నేనే మీకు అవన్నీ ఇస్తాను.నా ద్వారా మేళ్ళు పొంది క్రుతజ్ఞులై నన్ను ఆరాధించండి అని దేవుడు అంటున్నాడు.తీర్పుదినాన దేవుని సిం హాసనానికి కుడివైపు చేరిన సజ్జనులు నరకాగ్నిలొ మాడుతున్న వారిని ఒక ప్రశ్న వేస్తారు:"మీరు నరకంలో త్రోయబడటానికి కారణం ఎమిటి?" అంటే వాళ్ళు నాలుగు కారణాలు చెబుతారు. ఆందులో మొదటిది" నమాజు చెయ్యకపోవటం"(74:43)
“ఓ విశ్వాసులారా, శుక్రవారం నాడు నమాజుకు పిలుపు వినబడగానే మీ వ్యాపారాన్ని వదిలిపెట్టి దేవుని ధ్యానించటానికి పరుగెత్తి రండి. ఆది మీకెంతో మేలైనదని తెలిసికోండి"(62:9) మరి ఇంతమేలైనది,మనల్ని నరకశిక్ష నుండి తప్పించేది,నైతికంగా ఉద్ధరించేది అయిన నమాజు అనేక మందికి నిరుపయోగంగా ఉంటున్నది.నమాజు ద్వారా మనిషి పొందవలసినంత ప్రయోజనం పొందటం లేదు.అర్ధంకాని మంత్రాలలాంటి కొన్ని పదాలను వల్లించటం అనే తంతుతో నమాజు ముగుస్తున్నది. గొంతులోనుండి వెలువడే నమాజు ఉచ్చారణ కంటే, హ్రుదయంలోంచి పెల్లుబికే ప్రార్ధన నిశ్చయంగా గొప్పది.
నమాజు అనేకుల జీవితాల్లొ మార్పుతేలేకపోవటానికి ఒక కారణం "ఆ నమాజు వాళ్ళకు అర్ధంకాక పోవటం". అర్ధంకాకపోవటానికి కారణం అతనికి అరబ్బీ భాష రాకపోవటం దేవునికి అరబ్బీ భాషలొ మాత్రమే నమాజు చెయ్యలి అనే కట్టడి.ప్రతి విశ్వాసీ తప్పని సరిగా అరబ్బీ నేర్వాలి అనే నిర్బంధం.అర్ధం అయినా కాకపొయినా సరే అరబ్బీలో రాయబడిన కురానే చదవాలి అని ఒత్తిడి చెయ్యటం.ఇది అనుల్లంఘనీయమైన సంప్రదాయం కావటం. "మోకరించి మీ మాత్రుభాషలో దేవుని అయిదుపూటలా ప్రార్దించుకోండి,మీకు వచ్చిన భాషల్లొనే కురాన్ చదువుకోండి అంటే ప్రపంచ ప్రజలందరికీ "అర్ధం అయ్యే నమాజు" అందుబాటులొ ఉందేది.కానీ అరబ్బీలో మాత్రమే ఇలా ఇలా వంగుతూ లేస్తూ నమాజు చెయాలి అనటంతో ఈ శారీరక విన్యాసంలోని అంతరార్దమేమిటొ ప్రజలకు అర్ధం కాలెదు. "అర్ధం లెని చదువు వ్యర్ధము" అన్నట్లే" అర్ధం కాని ప్రార్ధన కూడా వ్యర్ధమే".
మహా ప్రవక్త గారి మాత్రుభాషలోనె దైవ సందేశం ఎందుకు వచ్చింది?మరో భాషలోవస్తే ఆయనకు అర్ధం కాదనే గదా!".
ఆయన సన్నిధికి వచ్చి"అలహందులిల్లాహి" అనవలసినదేగాని"సర్వలోకాలప్రభూ"అని సంబోధించలేడు తెలుగువాడు.గుండెలోని భావం గొంతుదాటి రాకూడదా? అది దేవుడు వినడా? అరబ్బీ రాని ప్రజల యాతన చూడండి. మతంలో బలాత్కారం లేదన్న వాళ్ళే బలవంతంగా ఒక భాషను నిర్బంధం చేసారు.ఆ భాషరానిదే నీవు ముస్లిం కాదు పొమ్మన్నారు.దేవుని ప్రార్ధించుకోటానికి ఆ భాషలో ఉచ్చరించనిదే మసీదు గడపతొక్కటానికి సైతం నీకు అర్హత లేదు పొమ్మన్నారు.అన్ని రంగులూ, అన్ని భాషలూ దేవునివేనని చెప్పేవారూ ఈ భాష తప్ప మరో భాషలో చేసే ప్రార్ధన దేవునికి అర్ధం కాదు అన్నట్లుగా పట్టు పడుతున్నారు. నమాజు మనిషిని నైతికంగా ఉద్ధరిస్తుంది.కాని అరబిక్ సూరాల కంఠస్తం అవశ్యం కావటం వల్ల అన్యుల ప్రవెశానికి ఆటంకం కలిగిస్తొంది.హ్రుదయంలో వున్న విషయాలను చెప్పుకొను వీలు లేదు.తెలుగు భక్తుడు,అరబ్బీ దేవుడు.తెలుగు ముస్లిములు అయిదు వేళలా దేవుని తెలుగులోనే ధ్యానిస్తే వారి మది సేద తీరుతుంది.దేవుని స్తుతించి, హ్రుదయమంతా ఆయన ప్రసన్నతను నింపుకొని, ఆయన ఆజ్ఞలను మనస్సులొ నిలుపుకొని జాగ్రత్తతో బ్రతుకవచ్చు.కానీ అరబ్బీ ఆచార సంపన్నులు తెలుగుముస్లిముల తెలుగు ప్రార్ధనలకు ఆమోదముద్ర వేయరట! మరి మన తెలుగు ప్రార్దనలు అల్లా దరి జేరవా? గడ్డం పెంచలేదనీ, నమాజు సమయంలొ కాలి గిలకలు కాన రాలెదనీ, అన్నం తిన్నాక ఫలానా వరుసలో చేతివేళ్ళు నాకలేదనీ, అరబ్బీ రాదనీ విమర్శించే వాళ్ళను లెక్క చెయ్యకండి.అన్ని భాషలూ దేవునివే గనుక అయితే, అన్ని భాషలను ఆయనే అనుమతించి ఉంటే ఈ ప్రత్యేక భాషాదాస్యం చెయ్యమని ఆయన చెప్పడు. తెలుగు ముస్లిములకోసం తెలుగులో నమాజును,తెలుగు మసీదులను ప్రారంభించాలి.అల్లా సన్నిధికి చేరి మన హ్రుదయాలను ధారాళంగా తెరిచే అవకాశం మనకు తెలుగులోనే దొరుకుతుంది"
అరబీ భాషలోనే ఖురాన్ ఎందుకు పంపాడో అల్లాహ్ చెప్పిన కారణాలు ఈ 10 వాక్యాలలో దొరికాయిః
1.We have revealed this Qur'an in the Arabic language so that you Arabs may understand 12:2
2.We have revealed this commandment in the Arabic language. 13:37
3."A certain man teaches him." But the man they allude to speaks a foreign language while this Qur'an is in eloquent Arabic. 16:103
4.Thus have we sent down this Qur'an in Arabic and clearly proclaimed in it some of the warnings so that they may take heed or that it may serve as a reminder to them. 20:113
5.Surely this Qur'an is a revelation from the Rabb of the Worlds.The trustworthy Spirit (Angel Gabriel) brought it down upon your heart so that you may become one of those who are appointed by Allah to warn the people in a plain Arabic language. This fact was foretold in the scriptures of the former people. Is it not sufficient proof for the people that the learned men of the children of Israel knew about it? Even so that if We had revealed it to a non-Arab,and he had recited it to them in fluent Arabic, they would still not have believed in it.26:192-199
6.This Qur'an is revealed in Arabic, which is free from any flaw, so that they may learn to be righteous. 39:28
7.a Book whose verses are well explained, a Qur'an in the Arabic language for people who understand.41:3
8.Thus have We revealed to you this Qur'an in Arabic, so that you may warn the residents of the Mother City (Makkah) and its suburbs, and forewarn them of the Day of assembly 42:7
9.We have revealed this Qur'an in the Arabic language so that you may understand its meanings. 43:3
10.Yet before it the Book of Musa was revealed which was a guide and blessing; and this Book (Qur'an) confirms it. It is revealed in the Arabic language to forewarn the wrongdoers and to give good news to those who have adopted the righteous conduct.46:12
అయితే పరలోకవాసుల భాష అరబీ అనే వాదనకు నాకు లేఖనాధారం దొరకలేదు
1.It was narrated by al-Tabaraani in al-Awsat, al-Haakim, al-Bayhaqi in Shu’ab al-Eemaan and others that Ibn ‘Abbaas (may Allah be pleased with him) said: The Messenger of Allah said: “Love the Arabs for three reasons, because I am an Arab, the Qur’aan is Arabic and the speech of the people of Paradise is Arabic.” (Baihaqi in Shuabul Iman.)
ఇది కల్పిత హదీసుగా ఇబ్నె అల్ జౌజీ,అల్ దహబీ,అల్ అల్బానీ లాంటి కొందరు పండితులు కొట్టిపారేశారు.
2. On the day of judgment, Allah will also judge us in Arabic.Everyone will know how to speak Arabic. After death our speaking language automatically converts to Arabic.we are asked about our past in Arabic by the Angles.
ఇది కూడా నిరాధారమైన వాదనేః
Shaykh al-Islam Ibn Taymiyah was asked: in what language will Allaah address the people on the Day of Resurrection? Will Allaah address them in the tongue of the Arabs? Is it true that the language of the people of Hell will be Farsi and that the language of the people of Paradise will be Arabic? He replied: Praise be to Allaah, the Lord of the Worlds. It is not known what language the people will speak on that Day, or in what language they will hear the words of the Lord, may He be exalted, because Allaah has not told us anything about that, nor has His Messenger. It is not true that Farsi will be the language of the people of Hell, or that Arabic will be the language of the people of Paradise. We do not know of any discussion of that among the Sahaabah , rather all of them refrained from speaking of that because speaking about such a thing is discussion of something unnecessary… but there was a dispute concerning that among later scholars. Some people said that they will be addressed in Arabic and others said that the people of Hell will respond in Farsi, which will be their language in Hell. Others said that they will be addressed in Syriac because that was the language of Adam and from it stemmed all other languages. Others said that the people of Paradise will speak Arabic. There is no basis for any of these ideas, whether on the grounds of common sense or in any report or text, rather they are mere claims that are devoid of any evidence.
అలాగే ఒక భాషకంటే మరో భాష గొప్పదేమీ కాదు.ప్రతి జాతి భాషలోనూ దైవసందేశం వచ్చింది."There never was a people without a warner having lived among them." [ Fâtir: 24] We did not send any messenger but with the language of his people, so that he might explain to them clearly." [ Ibrâhîm: 4] Allah's words and revelations were sent down in every language. He sent the Torah, the Gospel, and the Psalms. He spoke to Moses in Hebrew. He sent the Scrolls to Abraham in Syriac. Therefore, languages are equal in this regard.

- మనల్ని చూస్తున్న దేవుని ముందు మనం నిలబడ్డామని గ్రహించాలి.
- ఆయన గొప్పతనం మన హీనత్వం గుర్తించాలి.
- ఆయన మనల్ని ప్రేమించి సహాయం చెయజూస్తున్నాడని తెలిసికొని అడగాలి.
- మనం అడిగేదేమిటో మనకు అర్దమై ఉండాలి.

"సకలలోకాల ప్రభువా! అనంత కరుణామయుడా!, అపారక్రుపాశీలుడా!, తీర్పు దినపు యజమానీ!
మాదేవా!, నీకే స్తోత్రములు! మేము నిన్నే ఆరాధిస్తాము. సహాయం కోసం నిన్నే అర్ధిస్తున్నాము.
నీవు దీవించిన వారి మార్గం, నీ ఆగ్రహానికి గురి కాని వారి మార్గం,
మార్గభ్రష్టులు కాని వారి రుజుమార్గం మాకు చూపించు".అని చెప్పుకుంటే ఒక తెలుగు వానికి నమాజు అర్ధవంతంగా ఉంటుంది.అల్లా అంటే ఒక్కడేననీ ఆయనకు ఆలుబిడ్డలు లేరనీ, ఆయన ఎవరికీ పుట్టలేదనీ, ఆయన ఎవరినీ కనలేదనీ ఆయన సర్వోన్నతుడైన ఏకైక దేవుడనీ-విగ్రహారాధన హేయమనీ, తీర్పు రోజున మనం లెక్క అప్పజెప్పుకోవలసి ఉంటుందనీ తెలుగుజనానికి తెలుగులోనే అర్ధం అవుతుంది. ఆయన అద్వితీయుడనీ ఆయనకు సాటి కల్పించరాదని తెలుగులో చెబితే తెలుగుజనం సుళువుగానె అర్ధం చేసికొంటారు. కానీ అక్కడినుండి ఆరంభమయ్యే అరబ్బీ ఆంక్షలు, నియమనిష్టలు, ప్రత్యేక తరహాలో సాగే ప్రార్ధనా పద్దతులు వారిని అల్లా సన్నిధికి రాకుండా ఆటంకపెడతాయి.
ఆయన సన్నిధికి వచ్చి"అలహందులిల్లాహి" అనవలసినదేగాని"సర్వలోకాలప్రభూ"అని సంబోధించలేడు తెలుగువాడు.గుండెలోని భావం గొంతుదాటి రాకూడదా? అది దేవుడు వినడా? అరబ్బీ రాని ప్రజల యాతన చూడండి. మతంలో బలాత్కారం లేదన్న వాళ్ళే బలవంతంగా ఒక భాషను నిర్బంధం చేసారు.ఆ భాషరానిదే నీవు ముస్లిం కాదు పొమ్మన్నారు.దేవుని ప్రార్ధించుకోటానికి ఆ భాషలో ఉచ్చరించనిదే మసీదు గడపతొక్కటానికి సైతం నీకు అర్హత లేదు పొమ్మన్నారు.అన్ని రంగులూ, అన్ని భాషలూ దేవునివేనని చెప్పేవారూ ఈ భాష తప్ప మరో భాషలో చేసే ప్రార్ధన దేవునికి అర్ధం కాదు అన్నట్లుగా పట్టు పడుతున్నారు. నమాజు మనిషిని నైతికంగా ఉద్ధరిస్తుంది.కాని అరబిక్ సూరాల కంఠస్తం అవశ్యం కావటం వల్ల అన్యుల ప్రవెశానికి ఆటంకం కలిగిస్తొంది.హ్రుదయంలో వున్న విషయాలను చెప్పుకొను వీలు లేదు.తెలుగు భక్తుడు,అరబ్బీ దేవుడు.తెలుగు ముస్లిములు అయిదు వేళలా దేవుని తెలుగులోనే ధ్యానిస్తే వారి మది సేద తీరుతుంది.దేవుని స్తుతించి, హ్రుదయమంతా ఆయన ప్రసన్నతను నింపుకొని, ఆయన ఆజ్ఞలను మనస్సులొ నిలుపుకొని జాగ్రత్తతో బ్రతుకవచ్చు.కానీ అరబ్బీ ఆచార సంపన్నులు తెలుగుముస్లిముల తెలుగు ప్రార్ధనలకు ఆమోదముద్ర వేయరట! మరి మన తెలుగు ప్రార్దనలు అల్లా దరి జేరవా? గడ్డం పెంచలేదనీ, నమాజు సమయంలొ కాలి గిలకలు కాన రాలెదనీ, అన్నం తిన్నాక ఫలానా వరుసలో చేతివేళ్ళు నాకలేదనీ, అరబ్బీ రాదనీ విమర్శించే వాళ్ళను లెక్క చెయ్యకండి.అన్ని భాషలూ దేవునివే గనుక అయితే, అన్ని భాషలను ఆయనే అనుమతించి ఉంటే ఈ ప్రత్యేక భాషాదాస్యం చెయ్యమని ఆయన చెప్పడు. తెలుగు ముస్లిములకోసం తెలుగులో నమాజును,తెలుగు మసీదులను ప్రారంభించాలి.అల్లా సన్నిధికి చేరి మన హ్రుదయాలను ధారాళంగా తెరిచే అవకాశం మనకు తెలుగులోనే దొరుకుతుంది"
అరబీ భాషలోనే ఖురాన్ ఎందుకు పంపాడో అల్లాహ్ చెప్పిన కారణాలు ఈ 10 వాక్యాలలో దొరికాయిః
1.We have revealed this Qur'an in the Arabic language so that you Arabs may understand 12:2
2.We have revealed this commandment in the Arabic language. 13:37
3."A certain man teaches him." But the man they allude to speaks a foreign language while this Qur'an is in eloquent Arabic. 16:103
4.Thus have we sent down this Qur'an in Arabic and clearly proclaimed in it some of the warnings so that they may take heed or that it may serve as a reminder to them. 20:113
5.Surely this Qur'an is a revelation from the Rabb of the Worlds.The trustworthy Spirit (Angel Gabriel) brought it down upon your heart so that you may become one of those who are appointed by Allah to warn the people in a plain Arabic language. This fact was foretold in the scriptures of the former people. Is it not sufficient proof for the people that the learned men of the children of Israel knew about it? Even so that if We had revealed it to a non-Arab,and he had recited it to them in fluent Arabic, they would still not have believed in it.26:192-199
6.This Qur'an is revealed in Arabic, which is free from any flaw, so that they may learn to be righteous. 39:28
7.a Book whose verses are well explained, a Qur'an in the Arabic language for people who understand.41:3
8.Thus have We revealed to you this Qur'an in Arabic, so that you may warn the residents of the Mother City (Makkah) and its suburbs, and forewarn them of the Day of assembly 42:7
9.We have revealed this Qur'an in the Arabic language so that you may understand its meanings. 43:3
10.Yet before it the Book of Musa was revealed which was a guide and blessing; and this Book (Qur'an) confirms it. It is revealed in the Arabic language to forewarn the wrongdoers and to give good news to those who have adopted the righteous conduct.46:12
అయితే పరలోకవాసుల భాష అరబీ అనే వాదనకు నాకు లేఖనాధారం దొరకలేదు
1.It was narrated by al-Tabaraani in al-Awsat, al-Haakim, al-Bayhaqi in Shu’ab al-Eemaan and others that Ibn ‘Abbaas (may Allah be pleased with him) said: The Messenger of Allah said: “Love the Arabs for three reasons, because I am an Arab, the Qur’aan is Arabic and the speech of the people of Paradise is Arabic.” (Baihaqi in Shuabul Iman.)
ఇది కల్పిత హదీసుగా ఇబ్నె అల్ జౌజీ,అల్ దహబీ,అల్ అల్బానీ లాంటి కొందరు పండితులు కొట్టిపారేశారు.
2. On the day of judgment, Allah will also judge us in Arabic.Everyone will know how to speak Arabic. After death our speaking language automatically converts to Arabic.we are asked about our past in Arabic by the Angles.
ఇది కూడా నిరాధారమైన వాదనేః
Shaykh al-Islam Ibn Taymiyah was asked: in what language will Allaah address the people on the Day of Resurrection? Will Allaah address them in the tongue of the Arabs? Is it true that the language of the people of Hell will be Farsi and that the language of the people of Paradise will be Arabic? He replied: Praise be to Allaah, the Lord of the Worlds. It is not known what language the people will speak on that Day, or in what language they will hear the words of the Lord, may He be exalted, because Allaah has not told us anything about that, nor has His Messenger. It is not true that Farsi will be the language of the people of Hell, or that Arabic will be the language of the people of Paradise. We do not know of any discussion of that among the Sahaabah , rather all of them refrained from speaking of that because speaking about such a thing is discussion of something unnecessary… but there was a dispute concerning that among later scholars. Some people said that they will be addressed in Arabic and others said that the people of Hell will respond in Farsi, which will be their language in Hell. Others said that they will be addressed in Syriac because that was the language of Adam and from it stemmed all other languages. Others said that the people of Paradise will speak Arabic. There is no basis for any of these ideas, whether on the grounds of common sense or in any report or text, rather they are mere claims that are devoid of any evidence.
అలాగే ఒక భాషకంటే మరో భాష గొప్పదేమీ కాదు.ప్రతి జాతి భాషలోనూ దైవసందేశం వచ్చింది."There never was a people without a warner having lived among them." [ Fâtir: 24] We did not send any messenger but with the language of his people, so that he might explain to them clearly." [ Ibrâhîm: 4] Allah's words and revelations were sent down in every language. He sent the Torah, the Gospel, and the Psalms. He spoke to Moses in Hebrew. He sent the Scrolls to Abraham in Syriac. Therefore, languages are equal in this regard.
కురాన్ కి ఉన్న ఇతర పేర్లు:
కురాన్ కి ఉన్న ఇతర పేర్లు:
#వరుస సంఖ్య | అరబ్బీ పేరు | అంటే అర్ధం | ఈ పేరున్న ఖురానువాక్యం |
---|---|---|---|
1 | కితాబ్ | అల్లాహ్ గ్రంధం | 2:2 |
2 | కితాబ్-ఎ-ముబీన్ | స్పష్టమైన ఆదేశాలు గలది | 5:57 |
3 | హుదా | మార్గదర్శిని | 2:120 |
4 | ఫుర్‌ఖాన్ | గీటురాయి | 25:1 |
5 | బుర్‌హాన్ | ఆధారం, నిదర్శనం | 4:174 |
6 | మొయిజత్ | హితోపదేశం | 3:138 |
7 | ముసద్దిఖ్ | ధ్రువపచేది | 5:46 |
8 | బుష్రా | శుభవార్త నిచ్చేది | 17:105 |
9 | హఖ్ | సత్యం | 10:108 |
10 | జిక్రా | జ్ఞాపకంవుంచుకొనేది | 3:58 |
11 | ఇల్మ్ | జ్ఞానం | 2:119 |
12 | నూర్ | వెలుగు | 4:174 |
13 | హకీం | వివేచననిచ్చేది | 36:1 |
14 | ఇబ్రత్ | గుణపాఠం నేర్పేది | 12:111 |
15 | రహ్మత్ | కరుణగలది | 6:157 |
16 | బసాయిరున్ | మనోనేత్రాలు తెరిచేది | 28:43 |
17 | షిఫా | రోగనివారిణి, పిచ్చికుదిర్చేది | 10:57, 17:82 |
18 | ముఫస్సల్ | సవివరమైనది | 6:114 |
19 | మీజాన్ | ధర్మకాటా | 42:17 |
20 | ముహైమిన్ | రక్షించేది | 5:48 |
21 | ఇమాం | మార్గదర్శి, సారధి, నాయకుడు | 16:89 |
22 | మజీద్ | మహిమ గలది | 46:1 |
23 | కరీం | గౌరవప్రదమైనది, ఉన్నతమైనది | 56:77 |
24 | ఖురాన్ | చదివేది | 2.185 |
25 | ముబీన్ | స్పష్టమైనది | 43.2 |
26 | కలామల్లాహ్ | అల్లాహ్ వాక్కులు (దేవుని మాటలు) | 2.75 |
27 | మౌవిజాహ్ | హెచ్చరించేది | 3.138 |
28 | అలియ్యు | ఉన్నతమైనది | 43.4 |
29 | ముబారక్ | దీవెనకరమైనది | 6.155 |
30 | బయాన్ | ప్రకటన | 3.138 |
31 | అజబ్ | ఆశ్చర్యకరమైనది | 72.1 |
32 | తజ్కిరా | బుద్ధిచెప్పేది | 73.19 |
33 | ఉర్వతిల్ ఉత్కా | నమ్మకంగా నడిపించేది | 31.22 |
34 | సిద్క్ | సత్యం | 39.33 |
35 | హిక్మా | పనిచేసే జ్ఞానం | 54.5 |
36 | అదల్ | ఖచ్చితమైనది | 6.115 |
37 | అమ్రుల్లాహ్ | దేవుని ఆజ్ఞ | 65.5 |
38 | మునాది | పిలిచేది | 3.193 |
39 | నజీర్ | గెలిచేది | 41.4 |
40 | అజీజ్ | అజేయమైనది | 41.41 |
41 | బలగ్ | సందేశమిచ్చేది | 14.52 |
42 | సుహుఫిమ్ ముకర్రమ | ఘనతగల గ్రంధాలు | 80.13 |
43 | మర్ఫువా | గొప్పది | 80.14 |
44 | ముసద్దిఖ్ | సాక్షి | 2.89 |
45 | బుర్హాన్ | ఋజువు | 4.174 |
46 | ముహైమిన్ | సంరక్షిణి | 5.48 |
47 | హబల్ అల్లాహ్ | దేవుని త్రాడు | 3.103 |
48 | ఫజల్ | ముగించేది | 86.13 |
49 | అహ్ సనుల్ హదీస్ | అందమైన దైవ సందేశం | 39.23 |
50 | ఖయ్యీం | తిన్ననిది | 98.3 |
51 | మథనీ | సరిపడేది | 39.23 |
52 | ముత్షబీ | అలంకారికమైనది | 39.23 |
53 | తంజీల్ | బయలుపరచినది | 56.80 |
54 | రూహ్ | ఆత్మ | 42.52 |
55 | వహీ | దైవ సందేశం | 21.45 |
56 | హక్కుల్ యకీన్ | స్థిరమైన సత్యం | 56.95 |
57 | అరబీ | అరబ్బీలో వచ్చింది | 12.2 |
గీటురాయి 11.4.2014
భారతీయ భాషలలో ఖురాన్ అనువాదాలు
అస్సామీ
- ముహమ్మద్ సద్ర్ 'ఆలి 1970,
- డాక్టర్. జౌహరుల్ హక్
బెంగాలి
- గిరీష్ చంద్ర సేన్ బ్రహ్మసమాజం 1886.
- అబ్బాస్ ఆలి, మౌలానా, కలకత్తా 1909
- అబ్ద్ అల్-రహ్మన్ ఖాన్, డక్కా 1962.
- అబ్ద్ అల్-వాహిద్, ఛల్చుల్త:1964,
- అబు అతా అబ్ద్ అల్-సత్తార్ 1916.
- అబు అల్-ఫజ్ల్ 'అబ్ద్ అల్-కరీం,1915.
- అక్తర్ కమాల్ ఛౌదరి, ఛిట్ట్గాంగ్ 1923.
- బహదూర్ తస్లీం అల్-దిన్ అహ్మద్,1922-23
- ఫదిల్ ముకిమి,1924
- ఫజలుర్ రహీం, చౌదరి 1931.
- గోల్డ్సాక్, విలియం 1908.
- హకీం అబ్దల్-మన్నన్
- కలామా సోపన, ఇబ్రహీం ఖాన్ 1963.
- ఇద్రీస్ అహ్మద్ 1330
- ఖాదికర్, ఫాయద్ అల్-దిన్ అహ్మద్ 1925.
- కురానుల్ కరీమ డక్కా ఇస్లామిక్ అకాడమి1964.
- మూబిన్ అల్-దిన్ అహ్మద్ జహంగీర్నగరి,1921.
- ముహమ్మద్ 'అబ్ద్ అల్-బారి,1969
- ముహమ్మద్ అక్రం ఖాన్, 1958
- ముహమ్మద్ 'అలి హసన్
- ముహమ్మద్ హబీబుల్లా 1923.
- ముహమ్మద్ నకీబ్ అల్-దిన్ 1925.
- ముహమ్మద్ సయ్యద్,గులాం హుస్సేన్,ఖాలిక్ 1968
- ముహమ్మద్ షంసుల్-హుదా,1959
- ముహమ్మద్ తాహిర్,1970
- ముక్తార్ అహ్మద్ సిద్దీక్, డాకా:ముస్లిం సాహిత్య సమితి 1932.
- అబ్దుల్-హకీం, 1922.
- రూహుల్-అమీన్,హనఫి ప్రెస్ 1918.
- ముహమ్మద్ హాఫిజ్ అల్-రహ్మాన్, బావల్పూర్ 1952
- కాజి అబ్దుల్-వుదూద్, భారతి లైబ్రరి 1966.
- అల్-కురాన్ అల్-కరీం, డాకా: ఇస్లామిక్ అకాడమీ 1968
- గిరీఈష్ ఛంద్ర సేన్,1979.
- తర్జుమా-ఎ కురాన్ మజీద్, డాకా:ఫలైహ్-ఎ అమ్మ్ ట్రస్ట్ 1971
- అల్-కురాన్ అల్-కరీం,డక్కా:ఇస్లామిక్ ఫౌండేషన్ 1967
- ఫజ్లుర్ రహ్మాన్ మున్షీ
- డాక్టర్. జౌహరుల్ హక్
బోడో
డోగ్రి
గుజరాతి
- అబ్దుల్-కాదిర్ బిన్ లుక్మాన్, బొంబాయి 1879
- అబ్దుల్-రషీద్, హాఫిజ్, డిల్లీ 1893.
- అహ్మద్ భాయి సులేమాన్ జమాని బొంబాయి 1938. కరాచి: హబీబ్ మెమోరియల్ ట్రస్ట్ 1957.
- అజీజుల్లా ఖాతిబ్ గోదర్వి,అహమ్మదాబాద్: ఫాయజ్ పబ్లిషర్ 1955.
- గులాం అలీ ఇస్మాయిల్ అహమ్మదాబాద్ 1901.
- గులాం ముహమ్మద్ సాదిక్ ,1946.
- మాహుం మౌలానా ముసావి,
- ముహమ్మద్ ఇస్ఫాహాని, 1900.
- ముహమ్మద్ యాకుబ్ చిష్తి సాబ్రి 1925.
- ముహమ్మద్ యాకుబ్ హాకీ మీర్,1925
హిందీ
- అహ్మద్ బాషిర్ ఫరంగి మహల్లి & గులాం ముహమ్మద్ ఖురైషి 1947
- అహ్మద్ షా మసీహి, 1915
- అవస్తి,నంద్ కుమార్, లక్నో 1980
- హసన్ నిజామి క్వాజా, 1922
- ముహమ్మద్ ఫారుక్ ఖాన్ సుల్తాన్ పురి, 1966.
- ముహమ్మద్ యూసుఫ్ సయ్యద్, అమృతసర్ 1936
- ఫతే ముహమ్మద్ జలంధరి,
- మౌలానా ముహమ్మద్ జునాగడి
- నజర్ అహమద్
కన్నడ
- దివ్య కురాన్ (ఆరుగురు అనువాదకులు : మౌలానా షా అబ్దుల్-ఖాదిర్, సయ్యద్, అహ్మద్ నూరి, అబ్దుల్లా, ఇజాజుద్దీన్, అబ్దుల్-గఫ్ఫార్ 1978
- పవిత్ర ఖురాన్
కాశ్మీరి
- ముహమ్మద్ యాహ్యా షా, 1887
- ముహమ్మద్ యూసుఫ్ షా 1973
- అల్ జలాల్ అల్-దీన్, 1986
- మీర్ వాఇజ్ మౌలానా మొహమ్మద్ యూసుఫ్ షా
కొంకణి
మైథిలి
మళయాళం
- ముత్తనిస్సెరిల్ కాయక్కుట్టి, 1970
- చెరియముందం అబ్దుల్ హమీద్ మదని , కుణి ముహమ్మద్ పరప్పూర్.
- టీ.కే. ఉబైద్,
- షేక్ అబ్దుల్లా బాస్మి
- అబ్దుర్రహమాన్ సుదాయిస్
మణిపురి
మరాఠి
- ముహమ్మద్ Yఆకుబ్ ఖాన్,1973 పవిత్ర కురాన్
నేపాలి
1.నజ్రుల్ హసన్ ఫలాహి 2008ఒరియా
1.అబ్దుల్ ఖాదిర్ ఖాన్ మొహమ్మద్ అన్వర్ హఖ్ --1989 (ఇస్లామాబాద్)
పంజాబి
- అబ్దుల్ అజీజ్, లాహోర్ 1908.
- అబ్దుల్-గఫూర్ అస్లం, జలంధరి, 1968.
- ఫైరుజుద్దిన్,1903.
- హిదాయతుల్లా గల్జా లాహొర్ 1887
- ముహమ్మద్ బిన్ బారకల్లా, 1882
- ముహమ్మద్ దిల్పాదిర్, 1922.
- ముహమ్మద్ హబీబుల్లా
- ముహమ్మద్ హాఫిజుల్-రహ్మాన్,1952.
- ముహమ్మద్ ముబారకల్లా,1870.
- ముహమ్మద్ నబి బఖ్ష్ హల్వాని, 1902
- ముహమ్మద్ నవాజ్ ఇరాం,
- నిజాముద్దీన్ హనఫీ సర్వరి, 1895
- సంత్ గురుదత్ సింగ్, వజీరాబాద్ 1911
- షంసుద్దీన్ బుఖారి, అమృతసర్ 1894.
- షరీఫ్ ఖంజాహీ
సంస్కృతం
- ముహమ్మద్ యూసుఫ్, ఖాదియాన్ 1932
- కురాన్ షరీఫ్, 1897
సంతాలి
సింధీ
- అబ్దుల్-రహీం మనగసి,కరాచి 1932.
- అబ్దుల్-రజాక్ ఖాది, 1962,
- అబూల్-హసన్ తహతవి,
- అహ్మద్ ముల్లా మవులానా అల్ హజ్జ్
- అజీజుల్లా ముతాలవి, 1902,
- ఫథ్ ముహమ్మద్ నిజామని, 1889,
- మర్దానుల్ షా పీర్, కరాచి 1909, 1921.
- ముహమ్మద్ మదనీ మవులానా 1953,
- ముహమ్మద్ సిద్దీక్, 1867
- ముహమ్మద్ ఉస్మాన్ 1952,
- తాజ్ మహ్మూద్ అమ్రుతి,మవులానా 1948,
- కుతుబ్ఖానా మక్బూలే అమ్మ్
తమిళం
- ఎ.కె. అబ్దుల్-హమీద్ బాఖవి అల్లామా, మద్రాసు 1943, 1978
- ఇ.ఎం.అబ్దూల్-రహ్మాన్ బక్వి, 1969.
- హబీబ్ ముహమ్మద్ అల్ కహిరి, 1879.
- నూహ్ ఆలిం సాహెబ్, ఫజల్-కరీం, 1890.
- నూహ్ బిన్ అబ్దుల్-ఖాదిర్ అల్-ఖాహిరి, బొంబాయి, 1911.
- యస్.యస్. అబ్దుల్-ఖాదిర్ బాఖవి,1937,1966.
తెలుగు
- 1925-చిలుకూరి నారాయణ రావు ఖురాన్ షరీఫ్ మద్రాసు
- 1941-ముహమ్మదు ఖాసిం ఖాన్ ఖురాన్ షరీఫ్ 9 సూరా హైదరాబాద్
- 1948-మున్షీ మౌల్విముహమ్మద్ అబ్దుల్ గఫూర్, కురానె మజీద్ కర్నూలు
- 1980-షేక్ ఇబ్రాహీం నాసిర్ అహమ్మదియ్యా కురాన్ , హైదరాబాద్
- 1985-హమీదుల్లా షరీఫ్ ,దివ్య ఖుర్ ఆన్ జమాతె ఇస్లామి హింద్ హైదరాబాద్
- 2004-అబుల్ ఇర్ఫాన్ , ఖురాన్ భావామృతం , హైదరాబాద్
- 2007-యస్.ఎం.మలిక్ , ఖుర్ ఆన్ అవగాహనం అబుల్ అలా మౌదూదీ
- 2008-డాక్టర్ అబ్దుల్ రహీమ్ బిన్ ముహమ్మద్ మౌలానా,సౌదీ అరేబియా
- 2009-ముహమ్మద్ అజీజుర్రహ్మాన్,అంతిమదైవగ్రంధం ఖుర్ ఆన్ [2870 పేజీలు] (మౌలానా ముహమ్మద్ జునాగడీ) గారి [అహ్ సనుల్ బయాన్] హైదరాబాదు
- 2010-అబ్దుల్ జలీల్ ,పవిత్ర ఖుర్ ఆన్ ,దారుల్ ఫుర్ ఖాన్,విజయవాడ.862 పేజీలు.
- 2012- డాక్టర్ ముహమ్మద్ అబ్దుల్ సత్తార్,జియాఉల్ ఖురాన్,
(ఆల్లాహ్ అంతిమఆకాశ పరిశుద్ధ గ్రంధము),విశాఖపట్టణం.1100 పేజీలు. - 2012- ముహమ్మద్ అజీజుర్రహ్మాన్,అల్ ఖురానుల్ మజీద్ ,
మౌలానా హాజీ హాఫిజ్ ఖ్వారీ ఫహీముద్దీన్ అహ్మద్ సిద్దీఖీ ,హైదరాబాద్ 552 పేజీలు.
(2013 'ఖుర్ ఆన్ మజీద్' 695 పేజీలు). - 2013 - ముహమ్మద్ అజీజుర్రహ్మాన్,దివ్యగ్రంధం ఖుర్ ఆన్ ,మౌలానా వహీదుద్దీన్ ఖాన్,
హైదరాబాదు.640 పేజీలు
ఉర్దూ
మొత్తం 250 ఉర్దూ అనువాదాలు వున్నాయి.మొదటివి: షా వలి అల్లాహ్ కుమారులు షా రఫియుద్దీన్,(1776) (కలకత్తా 1840),షా అబ్దుల్ ఖాద్రి (1790) (డిల్లీ 1829)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)