ఈ బ్లాగును సెర్చ్ చేయండి

14, మే 2010, శుక్రవారం

ఫత్వాలను ఎంతమంది పాటిస్తారు?



మంచికోసం మనుషులు కదులుతారు కానీ అభివృధ్ధిని అడ్డుకునే పనులను అమాయకంగా ఎంతోకాలం మోయలేరు. ఫత్వాలు ముఫ్తీలు,ఉలేమాలు ప్రకటిస్తారు.అవి మంచిగా ఉంటే అంగీకరిస్తారు కానీ అభివృధ్ధిని అడ్డుకునే ఫత్వాలను అమాయకంగా ఎంతోకాలం మోయలేరు.నారుపోసినవాడే నీరు పోస్తాడనే ముల్లాల మాట పెడచెవిన పెట్టి మా బిడ్డల బరువు మేమే మోసుకోకతప్పదనే సత్యాన్ని గ్రహించి ముస్లిములు ఈనాడు కుటుంబనియంత్రణ ఆపరేషన్లు భారీగా చేయించుకుంటున్నారు.భవిష్యత్తులో అభివృధ్ధివాదం,మానవతావాదం మతాల్లో ఇంకా ఇంకా పెరిగితీరుతుంది. ఇస్లాంలోదర్గాలు,ఉరుసులు,సంగీతం,కవిత్వం,నాట్యం,నటన,చిత్రలేఖనం,సారాయి,వ్యభిచారం,వడ్డీ,మాఫియా,రాచరికం,నియంతృత్వం,ఫోన్ లో పెళ్ళిళ్ళు,ఫోన్ లో విడాకులు ...లాంటివన్నీ నిషిద్ధమని మతపెద్దలు ఎంతగా చెప్పినా వినకుండా ఆయా నిషిద్ధ రంగాలలో లక్షలాది ముస్లింలు పాతుకుపోయారు.భారతరత్నలు కూడా అయ్యారు.అన్నిరకాల జనాన్ని మతం కలుపుకుపోక తప్పదు.ప్రజల సుఖ శాంతుల కోసం మతంలో నిరంతరం సంస్కరణలు జరుగుతూనే ఉండాలి.
నిరసనలు ఎదుర్కొన్న కొన్ని‌ ఫత్వాలు:
*బ్యాంకుల్లో పనిచేయడం ఇస్లాంకు వ్యతిరేకం.
*వడ్డీ, జూదం ఆధారంగా రూపొందినందువల్ల బీమా పాలసీలు ఇస్లాంకు వ్యతిరేకం.
*ముస్లిం మహిళలు న్యాయమూర్తి పదవి చేపట్టడం నిషిద్ధం.
*పెళ్ళికి ముందే వీధుల్లో షికార్లు చేసిన ఒక ప్రేమ జంట పెళ్ళికి కూడా ముస్లిములెవరూ వెళ్ళొద్దు.
*వందేమాతరం గీతంలోని కొన్ని పంక్తులు ఇస్లాం నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి ఆ పాటను ముస్లింలు పాడకూడదు.
*ఫేస్  బుక్కు,ట్విట్టర్ లలో మహిళలు చేరకూడదు.వాటిలో ఫొటోలు పెట్టకూడదు
కొన్ని మంచి ఫత్వాలు
*ఇస్లాం దృష్టిలోఉగ్రవాదం నిషిద్ధం.ఇస్లాం దృష్టిలో ఇది హరామ్ (నిషిద్ధం). ఇస్లామ్ లో ఈ హరామ్ పనికి చోటులేదు. ఇస్లాం మానవత్వానికి కట్టుబడి ఉంది.(జమీయతుల్ ఉలమాయె హింద్ దేవబంద్ )
*కర్ఫ్యూ సమయంలో ముస్లింలు ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకోవాలి.

ఫత్వా అంటే ఆజ్ఞ కాదు. మార్గదర్శకాలు మాత్రమే:
దారుల్‌ ఉలుమ్‌ సంస్థ వందేమాతరం ఇస్లాంకి వ్యతిరేకమంటూ 2006లోనే ఫత్వా జారీచేసింది.జమాతే-ఉల్‌మా-ఇ-హింద్‌ జారీ చేసిన ఫత్వాను వ్యతిరేకిస్తూ ముస్లింల ఆధ్వర్యంలో ఇక్కడ ఓ మసీదు ముందు వందేమాతర గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో ముస్లింలతోపాటు పలువురు మతస్థులు పాల్గొన్నారు. వందేమాతరం పాడడం... ఇస్లాంను వ్యతిరేకించినట్టు కాదు అని రజిక్‌ అన్నారు. తొలుత ఓ దేవాలయం ముందు ఆలపించి అనంతరం 'రుక్మిణి బాలాజీ మందిర్‌' ఆధ్వర్యంలో కొందరు ర్యాలీగా బజార్‌ చౌక్‌ వచ్చారు. అయితే మసీదు ముందు కూడా వందేమాతరం పాడాలని వారిని రజిక్‌ కోరారు. ఈ నేపథ్యంలో తమతో కల్సి వందేమాతరం పాడాలని రజిక్‌ పలువురిని అభ్యర్థించారు.ఫత్వా అంటే ఆజ్ఞ కాదు. మార్గదర్శకాలు మాత్రమే. ప్రజలు ఫత్వాకు కట్టుబడి ఉండొచ్చు లేదా ఉపేక్షించవచ్చు అని దారుల్‌ ఉలుమ్‌ ఉప కులపతి మౌలానా అబ్దుల్‌ ఖలిక్‌ మదర్సి అన్నారు.(ఈనాడు10.11.2009)

*ఫత్వాలు నన్ను ప్రభావితం చేయలేవు: ఖుర్షీద్‌
ముస్లింలు బీమా పాలసీలకు దూరంగా ఉండాలని మతపెద్దలు ఫత్వా జారీ చేయటంపై కేంద్ర మైనార్టీ వ్యవహారశాఖ మంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌ ఘాటుగా స్పందించారు. ఓ ముస్లింగా ఇలాంటి ఆజ్ఞలు తనను ప్రభావితం చేయలేవని ఆయన వ్యాఖ్యానించారు. 'నాకు కూడా బీమా పాలసీలున్నాయి. బ్యాంకింగ్‌ విధానం వల్ల లబ్ది పొందాను' అని ఖుర్షీద్‌తెలిపారు.(ఈనాడు 16.5.2010)

ఆంధ్ర జ్యోతి 26.9.2015 

(ఈనాడు 25.2.2016)
 

2 కామెంట్‌లు:

  1. A Muslim believes that faith is not complete when it is followed blindly or accepted unquestioningly. Man must build his faith on well-grounded convictions beyond any reasonable doubt and above uncertainty. Islam insures freedom to believe and forbids
    compulsion in religion. Why to ban photography?There should be sufficient reason.

    రిప్లయితొలగించండి
  2. https://www.facebook.com/drsubramanianswamy/photos/a.118146701658320.18858.107229389416718/434604800012507/?type=1&theater

    రిప్లయితొలగించండి