ఈ బ్లాగును సెర్చ్ చేయండి

28, జనవరి 2012, శనివారం

ఆహారం గురించి బైబిల్ ,ఖురాన్,హదీసుల్లోని వాక్యాలు

ఆహారం గురించి బైబిల్ ,ఖురాన్,హదీసుల్లోని వాక్యాలనుఒకసారి పరిశీలిద్దాం.మనం తిని తాగి త్రుప్తి చెందే అనేక రకాల ఆహారపదార్దాలు,ఆకుకూరలు,కూరగాయలు,పండ్లు గ్రంధాలలో ఎక్కడెక్కడ ఎలా ఉదాహరించబడ్డాయో తెలుగులో తెలుసుకుందాము.

ఖురాన్ లో ఆహారం పానీయాలు:

ఆహార మిచ్చి ఆకలి తీర్చేవాడు అల్లా (106:3)

ఆయనే సమస్త జాతుల పండ్లలో రెండేసి రకాలను సృస్టించాడు (13:3)

వాటిలో కొన్నిటిని ఎక్కువ రుచికరంగా, కొన్నిటిని తక్కువ రుచికరంగా చేశాడు. (13:4)

ఆహారం, దుస్తులు ఇచ్చే జంతు జాలాన్ని చేశాడు (16:5) (40:79)

మర్యం కు ఆహార పదార్ధాలు పంపాడు (3:37)

సజ్జనులు ప్రతిఫలాపేక్ష లేకుండా నిరుపేదలకు, అనాధలకు, ఖైదీలకు అన్నదానం చేస్తారు (76:8)

ధాన్యం, ద్రాక్ష, కూరగాయలు, ఆలిల్, ఖర్జూర చెట్లు, తోటలు, రకరాల పండ్లు, పచ్చిక మీకు మీ పశువులకు జీవన సామాగ్రిగా, ప్రాణాదారంగా ఉండేలా పుట్టించాము. (80:32)


(1) ఆకు కూరలు కూరగాయలు పండ్లు గురించి ఖురాన్ లోని 2:61, 78:15, 55:6-13, 34:2 సూరాలలో ప్రస్తావించబడింది.వీటిపై జకాత్ చెల్లించనవసరం లేదు. (అల్ ము అత్త (3) 17:37) ( తిర్మిజీ (1) : 575)

మొక్కలను పీకటం, చెట్లను నరకటం పాపం. అల్లాను క్షమాపణ కోరాలి. పెద్ద చెట్టు నరికినందుకు ఆవును, చిన్న చెట్టు నరికితే గొర్రెను పరిహారంగా అర్పించాలి. విరిగిపడ్డ కొమ్మలు, చెట్లు, ఆకులు వాడుకోవచ్చు.

12 వ శతాబ్ధం లో ఇబ్నెజుల్ జుల్, ఇబ్నె అల్ సలత్ లాంటి మగ్రబి ఫార్మకాలజిస్టులు మందు మొక్కల గురించి చెప్పారు.

బాప్తిస్మ మిచ్చే యోహాను ఆకులు, మిడతలు తినేవాడు. కొండల్లో నేల బొరియల్లో పడుకునేవాడు. దైవ ధ్యానమే ఆహారంగా తలచేవాడు.

(2) స్వర్గం లో ఆహారం - పానీయాలు

రుచికరమైన రకరకాల పండ్లు, మాంసాహారాలు ( 52:22) పక్షిమాంసం రేగుపండ్లు, అరటికాయలు, మధురఫలాలు (56:20-33) ఖర్జూరం, దానిమ్మ ( 55:68).

పరిశుభ్రమైన సెలయేటి నీరు, రుచి కోల్పోని పాలనదులు, ద్రాక్షరసం, తేనె (47:15) కర్పూర జలం కలిసిన మద్యం, శొంఠి కలిపిన సల్ సబీల్ మద్యం (76:5-18) తస్నీం కలిసిన సారా (83:25-28)

(3) నరకంలో ఆహార పానీయాలు

జక్కూమ్ అనే నాగజెముడు, చమురు తెట్టు, సలసలా మరగకాగి కుతకుత ఉడికిపోయే నీరు (44:43-46), (37:64-68) ముళ్ళు గుచ్చుకునే ఎండు గడ్డి (88:6) చీము, నెత్తురు కలిసిన నీరు, అసహ్య పదార్ధాలు (38:57, 14:16).


కొన్ని హదీసులు:

బదర్ యుద్దం లో పాల్గొన్న 315 కోసం ఓ అల్లాహ్ , వీరు ఆకలిగొన్నారు. వీరికి ఆహారం ప్రసాదించు అని ముహమ్మద్ గారు ప్రార్ధన చేశారు. (అబూ దావూద్ 1175)

మంత్ర గాళ్ళను చంపండి. తినబోయే ముందు మంత్రాలు పలకటం నిషేదించండి అని ఉమర్ ఆజ్న (అబూ దావూద్ 1325)

ప్రవక్త కోసం సఫియా లాగా ఎవరూ వంట చేసే వారు కాదట ఆమె మీద కోపంతో అయిషా పాత్ర పగలగొట్టింది. అలాంటి పాత్రను, అలాంటి వంటకాన్నే పరిహారంగా కోరుతాడు ప్రవక్త ఓ దేవా మాకు ఇంకామంచి ఆహారం ప్రసాదించు. ఇంకా ఎక్కువ పాలు ఇచ్చి దీవించు. పాల లాంటి ఆహారం మరేదీ లేదు అని ప్రార్దించండి అని చెప్పారు ప్రవక్త (దావూద్ 1678)

ఇద్దరి మద్య తగాదాలో ఉన్నఆహారం తినొద్దు (దావూద్ 1689)

అలంకరించిన ఇంటిలో ఆహారం తినటం నాకు గానీ మరే ప్రవక్తకు గానీ తగదు (దావూద్ 1690)

అన్నం తినక ముందు, తిన్న తరువాత వజూ (శుభ్రం) చేసుకోవటం ఆశీర్వాదకరం (దావూద్ 1695)

విడిగా తింటే తృప్తి కలుగదు. దేవుని పేరిట కలసి తినండి. ఆశీర్వాదం పొందుతారు (దావూద్ 1697)

సారాయి తాగిన వాళ్ళ గుడ్డ మీద, పొట్ట మీద పడుకుని తిన్నవాడి గుడ్డ మీద మీరు తినొద్దు (దావూద్ 1703)

క్రైస్తవుల తిండిలాగా అనిపించే అనుమానం కలిగించే తిండి తినకండి (దావూద్ 1710)

ఉల్లిపాయలతో చేసిన వంటకం ప్రవక్త చివర్లో తినేవారు (దావూద్ 1741)

మనల్ని ముస్లిములుగా జేసి, ఆహార పానీయాలు అందించిన అల్లాకు స్ధోత్రాలు (దావూద్ 1750)

ఆహార పానీయాలు మింగటానికి సులభంగా జేసి, అవి వెళ్ళిపోవటానికి కూడ మార్గం ఏర్పాటు చేసిన అల్లాకు స్ధోత్రం (దావూద్ 1751)

ఎవరింటికైనా అతిధులొచ్చి తిని తాగి ప్రార్ధించి వెళ్ళిపోతే అది అతనికి బహుమానమే (దావూద్ 1753)

ఉపవాసం విరమించిన భక్తులకు ఆహారం పెడితే దేవదూతలు అన్నదాతను ఆశీర్వదించమని దేవుని ప్రార్ధిస్తారు (దావూద్ 1754)

ఏ బలమూ శక్తీ లేని నిస్సహాయుడినైన నాకు ఆహారం ఇచ్చిన అల్లాకు స్ధోత్రం అని ప్రార్ధించిన వాడి పాపాలు క్షమించబడతాయి. (దావూద్ 1851)

కరువుతో అల్లాడుతుంటే దేవుణ్ణి ప్రార్ధించండి. ఆయన ఆహారం ఇస్తాడు (దావూద్ 1889)

ఆహార పదార్ధాలు దాయటం, ఎక్కువ ధరకు అమ్మటం తప్పు (దావూద్ 822)

యూదురాలు విషం పెట్టిన మాంసం ప్రవక్తకు పెట్టింది. (దావూద్ 2132)

ప్రవక్త మసీదుకు వెళుతూ దారిలో పొయ్యిలో ఉడికిన ఒక ముక్క తీసుకుని మొదటి తక్బీర్ పలికే దాకా చప్పరించాడు. (దావూద్ 94)

ప్రయాణీకుడు, పాలిచ్చే తల్లి, గర్బిణీ ఉపవాసం చేయనక్కరలేదు (దావూద్ 993)

నా సేవకునికి తినిపిస్తే నాకు తినిపించినట్లే (కుద్సి 18)

పాలిచ్చే జంతువుల్ని జకాత్ గా నిర్బందంగా తీసుకోరాదు (మువత్త 17:28)

అరగక వాంతి చేసుకుంటే వజూ అక్కరలేదు గానీ, పుక్కిలించి నోరు శుభ్రం చేసుకోవాలి (మువత్తా 2:17)

పొరుగువారు పస్తులుంటుంటే పెట్టకుండా కడుపునిండా తినేవాడు అవిశ్వాసి

తల్బినా --- తరీద్ ముహమ్మద్ ప్రవక్త ఇష్టపడ్డ వంటకాలు.ఈ వంటకాలను బాగా తినండని ప్రవక్త గారే చెప్పారు.
తల్బినా రోగి విచారాన్ని పోగొట్టే వంటకం. అయిషా (ప్రవక్త గారి భార్య ) బంధువుల్లో ఎవరైనా చనిపోతే స్త్రీలు చూడటానికి వచ్చితిరిగి ఎవరి ఇళ్ళకు వారు వెళ్ళిపోయేవారు. ఆమె దగ్గరి బంధువులు,స్నేహితులు మాత్రమే ఉండిపోయేవారు.అప్పుడామె ఒక కుండడు తల్బినా వండించేవారు.గోధుమలు మాంసంతో తయారుచేసిన తరీద్ ను తల్బినా పై పోసేవారు."ఇక తినండి.తల్బినా రోగి విచారాన్ని పోగొడుతుంది మనసును ప్రశాంతపరుస్తుందని దైవప్రవక్త చెప్పేవారని అయిషా చెప్పారు.(బుఖారీ 7:328) శవం దగ్గర రోదిస్తూ శోషిల్లిన వారు ,రోగులూ తల్బినా తినాలని అయిషా చెప్పేవారు. తల్బినా రోగి హృదయానికి విశ్రాంతి నిచ్చి దాన్ని చైతన్యవంతంగా చేస్తుందని ,దుఖాన్ని విచారాన్ని పోగొడుతుందనీ దైవ ప్రవక్త చెప్పేవారని అయిషా చెప్పారు.(బుఖారీ 7:593) "తల్బినా తినండి" అని అయిషా ప్రోత్సహించేవారు."రోగికి ఇష్టముండదు గానీ భలే మేలుచేస్తుంది" అనేవారు అయిషా.(బుఖారీ 7:594).
తరీద్ ముహమ్మద్ గారికి అత్యంత ప్రితిపాత్రమైన వంటకం.మాంసం,గోధుమలతో, రొట్టెగా చేశాక చారులో నానవేయబడుతుంది.(అబూ దావూద్ :1709,ముస్లిమ్:1093)దాని ఆవిరి పూర్తిగా పోయేదాకా మూతపెట్టాలని అప్పుడే అది మరింత ఆశీర్వాదాన్ని పుట్టిస్తుందని ప్రవక్త చెప్పారు(తిర్మిజీ:1130)
స్త్రీలలో అయిషా ఎంతటి పరిపూర్ణమైనదో అలాగే భోజన పదార్దాలలోతరీద్ అంతటి ఆధిక్యత గలది.(బుఖారీ4:623,5:113,114,7:330,339)
అందులోని సొరకాయ ముక్కల్ని ఆయన ఎంతో ఇష్టంగాఏరుకొని తినేవారు.(బుఖారీ 7:331)పళ్ళెంలోని తరీద్ ను మధ్యలోనుంచి,పైనుంచి కాకుండా ప్రక్క అంచుల్లోనుంచి తినండని ప్రవక్త చెప్పేవారు(తిర్మిజీ:1116)రకరకాల పండ్లు పళ్ళెంలో ఉంటే ఇష్టమైన వాటిని ఏరుకొని తినండని చెప్పేవారు(తిర్మిజీ:1125).

బైబిల్ లో ఆహారం పానీయాలు

ఆకుకూరలు

వారు రెండవనెల పదునాలుగవ దినమున సాయంకాలమున దానిని ఆచరించి పొంగనివాటితోను చేదు ఆకుకూరలతోను దానిని తినవలెను. సంఖ్యాకాండము 9:11

ఐగుప్తులో మేము ఉచి తముగా తినిన చేపలును కీరకాయలును దోసకాయలును కూరాకులును ఉల్లిపాయలును తెల్ల గడ్డలును జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లెను. సంఖ్యాకాండము 11:5

పగవాని యింట క్రొవ్వినయెద్దు మాంసము తినుట కంటె ప్రేమగలచోట ఆకుకూరల భోజనము తినుట మేలు. సామెతలు 15:17

దాని ఆకులు సొగసుగాను దాని పండ్లు విస్తారముగాను కనబడెను. అందులో సమస్త జీవకో ట్లకు చాలునంత ఆహారముండెను; దాని నీడను అడవిజంతువులు పండుకొనెను, దాని కొమ్మలలో ఆకాశ పక్షులు కూర్చుండెను; సకల మనుష్యులకు చాలునంత ఆహారము దానియందుండెను. దానియేలు 4:12

వారు తాము దిగంబరులమని తెలిసికొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసికొనిరి. ఆదికాండము 3:7

త్రుంచబడిన ఓలీవచెట్టు ఆకు దాని నోటనుండెను గనుక నీళ్లు భూమిమీదనుండి తగ్గిపోయెనని నోవహునకు తెలిసెను. ఆదికాండము 8:11

ప్రాణముగల సమస్త చరములు మీకు ఆహారమగును; పచ్చని కూర మొక్కల నిచ్చినట్లు వాటిని మీకిచ్చియున్నాను. ఆదికాండము 9:3

అతడు నీటికాలువల యోరను నాటబడినదైఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలెనుండును అతడు చేయునదంతయు సఫలమగును కీర్తనలు 1:3

నదీతీరమున ఇరుప్రక్కల ఆహారమిచ్చు సకలజాతి వృక్షములు పెరుగును, వాటి ఆకులు వాడి పోవు, వాటి కాయలు ఎప్పటికిని రాలవు. ఈ నదినీరు పరిశుద్ధ స్థలములోనుండి పారుచున్నది గనుక ఆచెట్లు నెల నెలకు కాయలు కాయును, వాటి పండ్లు ఆహారమునకును వాటి ఆకులు ఔషధమునకును వినియోగించును. యెహేజ్కేలు 4:12

ఆకులుగల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూచి, దానిమీద ఏమైనను దొరకునేమో అని వచ్చెను. దానియొద్దకు వచ్చి చూడగా, ఆకులు తప్ప మరేమియు కనబడలేదు; ఏలయనగా అది అంజూరపు పండ్లకాలము కాదు. మార్కు 11:13

ఆ నదియొక్క ఈవలను ఆవలను జీవవృక్షముండెను; అది నెలనెలకు ఫలించుచు పండ్రెండు కాపులు కాయును. ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియో గించును. ప్రకటన గ్రంథం 22:2

సైన్యములకధి పతియు ఇశ్రాయేలు దేవుడునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను ఈ ప్రజలకు చేదుకూరలు తినిపింతును, విషజలము త్రాగింతును. యిర్మియా 9:15

అయ్యో పరిసయ్యులారా, మీరు పుదీనా సదాప మొదలైన ప్రతి కూరలోను పదియవవంతు చెల్లించు చున్నారే గాని, న్యాయమును దేవుని ప్రేమను విడిచి పెట్టుచున్నారు. వాటిని మానక వీటిని చే¸లూకా 11:42

ఆ దేశమున చీకటికమ్మెను, ఆ దేశపు కూరగాయలన్నిటిని ఆ వడగండ్లు పాడుచేయని వృక్షఫలములన్నిటిని అవి తినివేసెను. ఐగుప్తు దేశమంతట చెట్లేగాని పొలముల కూరయే గాని పచ్చని దేదియు మిగిలియుండలేదు. నిర్గమకాండము 10:15

అహాబు నాబోతును పిలిపించినీ ద్రాక్ష తోట నా నగరును ఆనుకొని యున్నది గనుక అది నాకు కూరతోటకిమ్ము దానికి ప్రతిగా దానికంటె మంచి ద్రాక్షతోట నీకిచ్చెదను, లేదా నీకు అనుకూలమైన యెడల దానిని క్రయమునకిమ్మని అడిగెను. 1 రాజులు 21:2

ఎలీషా గిల్గాలునకు తిరిగి రాగా ఆ దేశమందు క్షామము కలిగియుండెను. ప్రవక్తల శిష్యులు అతని సమక్షమునందు కూర్చుండి యుండగా అతడు తన పనివానిని పిలిచి పెద్దకుండ పొయిమీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంటచేయుమని సెలవిచ్చెను. అయితే ఒకడు కూరాకులు ఏరుటకు పొలములోనికి పోయి వెఱ్ఱి ద్రాక్షచెట్టును చూచి, దాని గుణమెరుగక దాని తీగెలు తెంపి ఒడినిండ కోసికొని వచ్చి, వాటిని తరిగి కూరకుండలో వేసెను. 2 రాజులు 4:38,39

వారు గడ్డివలెనే త్వరగా ఎండిపోవుదురు. పచ్చని కూరవలెనే వాడిపోవుదురు కీర్తనలు 37:2

పశువులకు గడ్డిని నరుల ఉపయోగమునకు కూర మొక్కలను ఆయన మొలిపించుచున్నాడు కీర్తనలు 104:14

నా సహోదరీ, ప్రాణేశ్వరీ, నా ఉద్యానవనమునకు నేను ఏతెంచితిని నా జటామాంసిని నా గంధవర్గములను కూర్చుకొను చున్నాను తేనెయు తేనెపట్టును భుజించుచున్నాను క్షీరసహితద్రాక్షారసము పానము చేయుచున్నాను. నా సఖులారా, భుజించుడి లెస్సగా పానము చేయుడి స్నేహితులారా, పానము చేయుడి. పరమగీతము 5:1

వారు సమాధులలో కూర్చుండుచు రహస్యస్థలములలో ప్రవేశించుచు పందిమాంసము తినుచుందురు అసహ్యపాకములు వారి పాత్రలలో ఉన్నవి యెషయా 65:4

అబద్ధప్రమాణ ములు చేయుదురు, సంధులు చేయుదురు, వట్టిమాటలు పలుకుదురు, అందువలన భూమి చాళ్లలో విషపుకూర మొలచునట్టుగా దేశములో వారి తీర్పులు బయలు దేరు చున్నవి. హోషేయా 10:4

కూర గాయలు

ఒకడు సమస్తమును తినవచ్చునని నమ్ము చున్నాడు, మరియొకడు బలహీనుడై యుండి, కూర గాయలనే తినుచున్నాడు. రోమీయులకు 14:2

కాయలు

వారి తండ్రియైన ఇశ్రాయేలు వారితొ అట్లయిన మీ రీలాగు చేయుడి; ఈ దేశమందు ప్రసిద్ధములైనవి, అనగా కొంచెము మస్తకి కొంచెము తేనె సుగంధ ద్రవ్యములు బోళము పిస్తాచకాయలు బాదము కాయలు మీ గోనెలలో వేసికొని ఆ మనుష్యునికి కానుకగా తీసికొని పోవుడి. ఆదికాండము 43:11

అరణ్యమందు జనులు అలసినవారై ఆకలిగొని దప్పిగొనియుందురని తలంచి, పరుపులు పాత్రలు కుండలు గోధుమలు యవలు పిండి వేచిన గోధుమలు కాయధాన్యములు చిక్కుడు కాయలు పేలాలు, తేనె వెన్న గొఱ్ఱలు జున్నుముద్దలు దావీదును అతనియొద్దనున్న జనులును భోజనము చేయుటకై తీసికొనివచ్చిరి. 2 సమూయేలు 17:28,29

పండ్లు

ద్రాక్షపండ్ల యడలు పెట్టి నన్ను బలపరచుడి జల్దరు పండ్లు పెట్టి నన్నాదరించుడి పరమగీతము 2:5