పింజ=ధోవతి గోచి
అంచును బిళ్ళగామడిచి దోపుకొనిన పంచకట్టు,ఇది పెద్ద వరుసవారు కట్టుదురు.బిళ్ళగోచి -పింజబోసి కట్టినాడు
పింజరీ పీకు
=ఎడతెగని వాదము చేయు
పింజలు= జందెము
వడుకు పద్ధతి,నాలుగు పింజలు
వడికినాడు
పింజేరి = బలహీనుడు,పీల,పింజేరి మనిషి
(మాండలిక పదకోశము,ఆం.ప్ర.సాహిత్య అకాడమీ 1970).
వీటిలో బలహీనుడు లేదా పింజలు వడికేవాడు అనే అర్ధాలు
సమంజసంగా ఉన్నాయి.
అయితే ఇలాంటి బలహీనుడినీ,ఏకులూ,జందెములు వడికే శ్రామికుడినీ,
పవిత్రుడినీ పట్టుకొని 'పింజారీ
వెధవ' అంటూ కొంతమంది దుష్టులు కూసే కారుకూతలను ఆపటానికి గతంలో ఎన్నో ప్రయత్నాలు జరిగాయి.'పింజారీ
వెధవ' అనే పదాన్ని తమ సీరియళ్ళలో తొలగిస్తూ దూరదర్శన్ ప్రోగ్రామ్స్
కంట్రోలర్ వెంకటేశ్వర్లు గారు 18.2.1987న ఐ.పి షా గారికి క్షమాపణ
ఉత్తరాన్ని రాశారు.
డా. దాశరధి రంగాచార్య ఇనగంటి దావూద్ గారి ఉత్తరానికి
స్పందించి తన 'అమృతంగమయ' సీరియల్ లో "ఈ పదం తొలగిస్తున్నాను
క్షమాపణ కోరుతున్నాను" అంటూ పెంజరము అంటే 'బంగారు హరిదళము'అని అర్ధం
చెప్పారు (వార్త ఆదివారం 2.2.2003).అయినా పెంజరానికీ పింజారీకి ఎలాంటి
సంబంధం లేదనీ,మానవులంతా ఒక్కటే,లోకమే వారి కుటుంబం,ఒకరు మరొకరికంటే అధికుడై
జన్మించాడనే మాట అర్ధరహితం అనే దావూద్ గారి వాదనను చివరికి రంగాచార్యగారు
ఒప్పుకున్నారు.
తెలుగుఅకాడమీ వారి తెలుగు-తెలుగు నిఘంటువులో పింజారీ అంటే
ఒకవిధమైన తిట్టు అనే అర్ధం ఉంది.అది ఎలా తిట్టుపదమో చెప్పాల్సిందిగా ఇనగంటి
దావూద్ గారు నిగ్గదీస్తే పునర్ముద్రణలో ఈ తప్పును సవరించుకుంటామని
ఆవులమంజులత గారు 28.8.2003 న
సమాధానమిచ్చారు.
జంధ్యాల,కోనవెంకట్,మోత్కుపల్లి, బ్రహ్మానందం లాంటివాళ్ళు
ఇదేపదం వాడి క్షమాపణ చెప్పారని సత్తార్ సాహెబ్ చెప్పారు .
ఎన్నో ఏళ్ళనుండి
మా కులం పేరుతో తిట్టకండి అని పింజారీలు పోరాడుతున్నా ఫలితం
శూన్యం.సంస్కారంలేని రచయితలను,దర్శకులనూ ఏం చెయ్యాలి?
వేలాది పింజారీ సోదరులు కలత
చెందుతున్నది రగిలిపోతున్నదీ రిజర్వేషన్ కోసం కాదు.తమకులాన్ని
తిట్టుపదంగా వాడవద్దని.అదొక కులమని ఇన్నాళ్ళూ తెలియలేదన్నారు.అది ఒక
కులమని తెలిసిన తరువాత కూడా కావాలని డైలాగులు రాసే వారిని,తీసేవారిని ఏమని
పిలవాలి ?వాళ్ళను ఎలా ఆపాలి?ఆపలేనివారిని అనెయ్యటమేనా?అనేవాడిని
అనొద్దు అని చెప్పకుండా అనిపించుకున్నవాడిని బాధపడొద్దు చూడొద్దు అని సలహా
ఇచ్చేవారికి మానవత్వం ఉందా? ఇంట్లోవాడు అంటేనేంటి బయటోడు అంటేనేంటి?ఇద్దరూ
పాపులే.
పిండారికీ పింజారికీ తేడా తెలియని పుండాకోరులకు,ఎగతాలి చేద్దామని చూసేవారికి తగిన జవాబివ్వండి.మనం ఇంతగా వివరించినా "పిండారీ అనే పదం నుండే పింజారీ అనే పదం పుట్టింది. ఈ విషయం నిర్థారణగా తెలిసింది" అని మొండిగా వాదిస్తూ అది ఎలా
నిర్ధారణ అయ్యిందో చెప్పని వాళ్ళకు బుద్ధి చెప్పాలి.అయినా వాళ్ళ తిట్లకు ఈ పదాన్నే ఎంచుకోటానికి
కారణం పింజారీలు బలహీనవర్గానికిచెంది ఎవరినీ ఎదిరించలేని స్థితిలో
ఉండటమే.వీళ్ళ నోళ్ళు మూయించలేక కళావంతులు,భోగం వాళ్ళు తమ కులంపేరు సూర్యబలిజ గా
మార్చుకున్నారు.మాదిగలు మాత్రం ఎదురుతిరిగి నిలబడ్డారు.
నోరా
వీపుకు దెబ్బలు తేకే అన్నట్లు సభ్యత సంస్కారం లేని వాళ్ళు గతంలో
మాల,మాదిగలను ఇలాగే తిట్టేవాళ్ళు.అత్యాచార చట్టం వచ్చాక కులదూషణ కేసులకు
జడిసి వెనక్కుతగ్గారు.తీట నోరు ఊరుకోదుకదా.చట్ట రక్షణ లేని మిగతా బలహీన
కులాలపైన పడ్డారు.ఆ క్రమంలోనే ఇప్పుడు బ్రామ్మలు,రేపు
ఇంకో కులం.విడిపించే దిక్కులేక దెబ్బలకోర్చినట్లుంది కొన్ని కులాల
పరిస్థితి.ఈ దెబ్బ భరించలేక ఏమీ చెయ్యలేక భోగం వాళ్ళు తమ కులం పేరే
మార్చుకుంటే,మాదిగలు గౌరవ సుచకంగా తమ పేర్లకు తగిలించుకొని ఎదురు తిరిగి
నిలబడ్డారు.చివరికి చంద్రబాబు నాయుడు కూడా నేనే పెద్ద మాదిగను అనే
పరిస్థితి వచ్చింది. అసలు అర్ధం తెలిశాక తమ తిట్ల నిఘంటువును తెలివైనవాళ్ళూ సభ్యతగలవాళ్ళు
సవరించుకుంటారు