ఆవేదనకు మందు ఆలింగనమే
--- నూర్ బాషా రహంతుల్లా (ఫోన్ 9948878833,6301493266)
దూదేకుల సాయిబుల సామాజిక ఆధ్యాత్మిక పరిస్థితుల గురించి ఈ మధ్య గీటురాయిలో మంచి వ్యాసాలు వచ్చి కాస్త ఆలోచన కలిగించాయి.సోదరులిద్దరిలో ఒకరి ఆవేదనా మరొకరి ఆత్మీయ ఆలింగనా చూస్తే ‘బతికిన బతుకు చెప్పుకుందాం బయట ఎవరూ లేకుండా చూడు’ అనే సామెత గుర్తొచ్చింది. .”మిమ్మల్ని చరిత్ర క్షమించదు,అల్లా అసలు క్షమించడు” అంటూ సిద్దీక్ దూదేకుసాయిబుల తరుపున దబాయిస్తే ,”సమ సమాజం రావాలి,ధర్మం ఎవరి గుత్త సోత్తూ కాదు “ అంటూ షఫీ సముదాయించారు.మొత్తమ్మీద సిద్దీక్ ‘జన్మమెత్తితిరా అనుభవించితిరా ‘అని ఆవేధన చెందితే, షఫీ ‘అన్నఒడిజేర్చి ఆటలాడించు నాటి కదా పాడనా?’ ఎదురు చూసి మోసపోకుమా’,‘నీ కొండకు నీవే రప్పించుకో ‘ లాంటి మాటలతో ఇస్లాం లోని సమతా వాతావరణాన్ని, ఔదార్య భావాలనూ ,ఆత్మస్థైర్య వాక్యాలనూ గుప్పించారు. స్థూలంగా వారి ప్రశ్నోత్తరాల పట్టిక ఇది.కాస్త పరిశీలనగా చూడండి :
డి.సిద్దీక్ వేదన (గీటురాయి 11.5.2012)
|
షఫీ అహ్మద్ అనునయ వాదన (గీటురాయి 5.6.2012 )
|
దూదేకుసాయిబులూ ముస్లిములే అయినా ముస్లిములు వారిని పరాయివారిగా చూస్తున్నారు , చైతన్యవంతుల్ని చేయలేకపోయారు.
|
వివక్షకు ఇస్లాంలో తావు లేదు.కానీ ఈ జాడ్యం ముస్లిముల్లో క్రమక్రమంగా పాతు కుపోయింది.ఇస్లాం పై పూర్తి అవగాహన లేని కొంతమంది ఇంకా తమ పురిటి కంపును వీడలేదు.అలాంటి వారి దుందుడుకు చేష్టలను,సంకుచితత్వాన్నీ ముస్లిములు అందరికీ ఆపాదించకూడదు.బేధ భావాలు అంతరాలు లేని సర్వమానవ సమతా ధర్మమే ఇస్లాం.
|
దూదేకుల వారు అటు ముస్లిములుగా కాక ఇటు హిందువులుగా కాక మధ్యలో దిక్కు తోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.ఆధ్యాత్మికంగా ఎదిగిరాకుండా వీళ్ళను అడ్డుకున్న ముస్లింలు రేపు అల్లాహ్ కు ఏమని సమాధానం చెప్పుకుంటారు?
|
బాధిత జనావళినీ వారి బాషనూ గేలి చేయటం,అవహేళన చేయటం క్షమించరాని నేరం.భక్తి ప్రపత్తులే కొలమానం కానీ భాష కాదు. నీగ్రో బానిస హజ్రత్ బిలాల్ కంటే అరబ్ అగ్రవర్ణాలవారు ఏమీ గొప్పవారు కాదు అని ప్రవక్త నిరూపించారు.పేరుకు ముస్లిం అయితే ప్రయోజనం లేదు.ఆచరణలో సమతా ధర్మం చూపాలి.
|
దూదేకుల సాయిబులు బి.సి.-బి లో కాకుండా బి.సి.-ఈ గా ముస్లిం రిజర్వేషన్ లోకి వస్తే ముస్లిములు అనే సాంఘీక గౌరవం దక్కుతుంది.
|
తాము సామాజిక రక్షణ పొందినప్పటికీ తమక్రింది వారికి సమాన స్థాయిని కల్పించే విషయమై సంకుచితంగానే వ్యవహరించరాదు.నిమ్నోన్నతాలకూ అంతరాలకూ ఇస్లాంలో ఇసుమంత స్థానం లేదు.
|
దూదేకులవారిలో ఇస్లాం పట్ల అలసత్వం ఉంది కాని ఇస్లాం ధర్మానికి దూరంగా ఉంచిన పాపంలో ప్రధాన భాగం ముస్లిములదే.వారు పరధర్మంవైపు పరుగులు తీస్తున్నారు.ఇప్పటికైనా వారిని మీలో కలుపుకోండి.
|
ఎవరో చిన్న చూపు చూస్తున్నారని నొచ్చుకుంటూ తరచూ బాధపడుతుంటే ఒరిగేది ఏమీ ఉండదు.ఇస్లాం స్ఫూర్తిని అందిపుచ్చుకొని మీరే చైతన్యవంతులు కండి.మనం ఎవరికీ తీసిపోము అనుకొని మీలో ఆత్మస్థైర్యాన్ని నింపుకోండి.క్రుంగుబాటును వీడి ధర్మ పధాన విజయ బావుటా ఎగురవేసి సమసమాజం కల సాకారం చెయ్యండి.
|
‘ఏనాటికైనాను నీదాననే’ అనే సిద్దీక్ ఆవేదనను షఫీ సరిగానే అర్ధం చేసుకున్నాడు గనుకనే ‘కలసి సాగుదాం ప్రగతి బాట’అన్నాడు.సంతోషం.
ఈ సంధర్భంలో నాకు కూడా నాలుగు మాటలు చెప్పాలనిపించింది. అవీ నా సొంత మాటలు కాదు.దేవుడి మాటలే కాబట్టి ఒకసారి మననం చేసుకుందాం:
*”పరస్పరం సంబంధాలు తెంచుకున్న ఇద్దరు సోదరుల నమాజులు వారి తలలపై జానెడు ఎత్తుకు కూడా పోవు.” (ఇబ్ను మాజా,మిష్కాత్)
*” మేము మా గ్రంధంలో యావత్తు మానవుల మార్గదర్శనం కోసం స్పష్టమైన ఆజ్నలు హితవులూ జారీ చేశాం.వాటిని ప్రజల ముందు వెల్లడించకుండా దాచేవారిని దేవుడు శపిస్తున్నాడు.శపించేవారుకూడా వారిని శపిస్తున్నారు.అయితే జరిగిన దానికి పశ్చాత్తాపం చెంది వ్యవహారశైలిని సరిదిద్దుకొని దాచిన దేవోక్తులను ప్రజలకు వెల్లడించేవారిని నేను క్షమిస్తాను”బకరా :159,160
*”ముఠా నాయకులు దేశంలో ఎల్లప్పుడూ అలజడులు రేపుతుంటారు.సమాజ సంస్కరణ కోసం ఒక్క మంచిపనీ చెయ్యరు” నమల్:48
*”దేశంలో ఎలాంటి సంస్కరణ సంక్షేమ కార్యక్రమాలూ చేపట్టకుండా హద్దులు మీరి అలజడులు రేకెత్తిస్తూ తిరిగేవారికి విదేయత చూపకండి” షు ఆరా :152
* “నేను మాత్రం నాకు చేతనైనంతవరకు పరిస్తితిని చక్కదిద్దాలని భావిస్తున్నాను” హూద్:88
*ఇస్మాయిల్,ఇద్రీస్,జుల్ కిఫ్,జకరియ్యా,...వీళ్ళంతా అమితోత్సాహంతో సత్కార్యాలు చేస్తూండే వారు”
అంబియా: 89
* “ముస్లిముల్లో సమానత్వం సోదరభావం ఎంత పటిష్టంగా ఉంటుందంటే ఇందులోకి అసమానతల జాడ్యం ప్రవేశించే అవకాశమే లేదు.ఒకవేళ ప్రవేశించినా ఆ జాడ్యం ఇక్కడ బతకడం కష్టం”
(‘సత్య ధర్మంలో సమతా భావం’ పుస్తకం 119వ పేజీ)
- “ముస్లిమేతరులకు నాస్తికులకూ పుట్టినా పసి పాపలు అందరూ ముస్లిములే “ (ఇస్లాం మరియు ముస్లిం’పుస్తకం 11వ పేజీ )
- “మేము మిమ్మల్ని మధ్యస్థ సమాజం (ఉమ్మతే వసత్ ) గా చేసాము “ బఖరా :143
- “ఉమ్మతే వసత్ అంటే ఉన్నతమైన,శ్రేష్టమైన వర్గం.అది న్యాయం,సమభావం,మధ్యేమార్గ వైఖరిపై స్థిరమై ఉంటుంది.అది ప్రపంచ జాతుల మధ్య నాయకత్వపు స్థాయిలో ఉంటుంది.ప్రవక్త ప్రతినిధులుగా వీరు రేపు దేవుని ఎదుట నిలబడి ప్రవక్త చెప్పిన విషయాలన్నీ సామాన్య ప్రజలకు చేరవేశామనీ, చేసి చూపామనీ, ఎలాంటి కొరతా చూపలేదనీ సాక్ష్యం చెప్పాల్సి ఉంటుంది.ఈ సముదాయంలోని మనుషుల మాటలు,చేతలు,ప్రవర్తనను చూసే ప్రపంచం ఒక్కొక్కటీ తెలుసుకోవాలి.దైవ భక్తి అని దేన్నంటారో,రుజువర్తనమంటే ఏదో,దేన్ని న్యాయమని అంటారో,ధర్మం సత్యం అంటే ఎలా ఉంటాయో ప్రపంచం వారి ద్వారానే నేర్చుకోవాలి.... ముస్లిములు ఎంతో ఘోరంగా పట్టుబడతారు.ఈ నాయకత్వపు గర్వం ముస్లిములను అక్కడ నిలువునా ముంచి వేస్తుంది.ముస్లిముల నాయకత్వపు కాలంలో వారిచేత వాస్తవంగా జరిగిన తప్పిదాల వల్ల ఎన్నెన్ని దుర్మార్గాలు ప్రపంచంలో వ్యాపించాయో,ఎన్నెన్ని కలతలు ,కల్లోలాలు ,ఉపద్రవాలు దేవుని భూమిపై సంభవించాయో,వాటన్నిటి కారణంగా ఇతర దుష్టాగ్రేసరులు,మానవులు, జిన్నుల్లోని షైతానులతో పాటు ముస్లిములూ పట్టుబడతారు.ప్రపంచంలో పాపం,దౌర్జన్యం,దుర్మార్గం,తుఫానులా స్వైరవిహారం చేస్తూ ఉన్నప్పుడు మీరెక్కడ చచ్చారు? అని ముస్లిముల్ని నిలదీయడం ఖాయం “(ఖురాన్ అవగాహనం, బఖరా :143 కి వ్యాఖ్యానం )
- ”విశ్వాసులారా ఇకనుండి ప్రపంచ మానవులకు మార్గదర్శనం చేస్తూ వారిని సంస్కరించడానికి రంగంలోకి తీసుకురాబడిన శ్రేష్ట సమాజం మీరే.మీరు మంచి పనులు చేయమని ప్రజలను ఆదేశిస్తారు.చెడులనుండి వారిస్తారు” అలీ ఇమ్రాన్ :104,110
- “ధర్మ సంస్థాపనా బాధ్యత నిర్వహించవలసిన ముస్లిం సమాజం కూడా చెడులలో కూరుకుపోయింది.ఇలాంటి పరిస్థితుల్లో ధార్మిక సామాజిక స్పృహ కలిగిన ముస్లిములు చెడును త్రుంచి మంచిని పెంచే బాధ్యత తీసుకోకపోతే సమాజ పతనానికి దేవుని సమక్షంలో ప్రధాన బాధ్యులు వారే అవుతారు”(ఖురాన్ భావామృతం , అలీ ఇమ్రాన్ :110 కి వ్యాఖ్యానం) (గీటురాయి 13.7.2012 )
- The Hindu October 4, 2013 http://www.thehindu.com/news/cities/Hyderabad/facing-the-worst-of-both-worlds/article3803785.ece
Less fortunate Muslims engaged in ‘unclean’ jobs fare low culturally and constitutionally
They are slighted and have been kept at arm’s length for centuries, with their community’s name used as an invective in offensive contexts. Islam with its egalitarian principles has not helped them, as they are still seen as pariahs engaged in a menial job.Known variously as Dudekula, Noorbash, Laddaf and Pinjari across the State, these less fortunate Muslims face the ‘worst of both the worlds’ - culturally as well as constitutionally. They are one among those engaged in ‘unclean’ occupations among Muslims of Andhra Pradesh, as listed in the Rajinder Sachar Committee Report on Social, Economic, and Educational status of Muslim community in India.Elders would remember the Dudekula members as those engaged in the occupation of ‘cotton cleaning’, which is the thrashing out of the crude cotton to separate the seeds and impurities, so that it can be stuffed into mattresses. Mohd. Haneef from old city is a quintessential example from the era.Working on a 300-year-old ‘Mutiya’ inherited from forefathers, this 78-year-old ekes out a living by making new pillows out of the old. With a hand-to-mouth existence, and unable to afford education, he brought both his sons into the profession which is fast losing its relevance.Nowadays, those from the ‘Dudekula’ community can be found in various other jobs too, ranging from driving auto-rickshaws, tailoring, industrial production, to even working as waged labourers. However, the stigma associated with the caste still remains. “Our notional equality with the elite Muslims ends once we are out of mosque. We are slighted by them and there is no question of inter-marrying,” says Shaikh Tasleem, who runs a mattress-making workshop at Habsiguda.His is one among the 100 to 150 Dudekula families that is still engaged in traditional ‘bed works’ in the city. With coir and foam mattresses claiming the sheen away from cotton beds, what sustains them is merely the demand from hospitals and hostels. “Very few people from our community have been educated beyond primary school, which is why we can’t aim for better jobs. However, nowadays, many parents are keen on educating their children,” says Mr. Tasleem.This means that many first generation graduates from the community will soon be out. It lends urgency to the long-pending demand for Scheduled Caste status for the community, and the ensuing quotas in education and jobs.“As of now, Dudekula is one among the 40 to 45 Dalit castes among Muslims, which have been categorised under Other Backward Classes. All these castes are unable to compete with dominant OBCs either in education or employment. We have been demanding SC status for over 20 years, but to no avail,” Shaikh Sattar Saheb, president of the State Noorbash/Dudekula Muslim Minority Welfare Association says.Fakir, Garadi, Hajjam, Mehtar, Pamula, and Athar are some of the other deprived castes among Muslims that he names. He claims that together they constitute over 70 per cent of the total Mulsim population in the State. Despite forming a sizeable portion, political representation from these sections has remained wanting.“Our Dalit counterparts from SC and ST sections have achieved sizeable political representation due to reservations. Despite Justice Ranganath Mishra’s recommendations for quotas to Dalit Christians and Muslims, the government has not acted upon it,” says Mr. Sattar.