ఈ బ్లాగును శోధించు

15, సెప్టెంబర్ 2014, సోమవారం

కల్మాల సుబ్బమ్మ


కర్నూలు జిల్లా కోవెలకుంట్ల తాలూకా ఉయ్యాలవాడలో కీ.శే.సుబ్బారెడ్డి గారి శిష్యురాలైన సుబ్బమ్మ గారి వయసు 75.ఈమె అక్కడ శ్రీవేణుగోపాలాశ్రమం లో నివాసం ఉంటుంది.సుబ్బమ్మచిన్నప్పుడు బర్రెలను కాసేది.ఆమె దగ్గర ఎంతో మంది భగవద్గీత ను కంఠతా నేర్చుకున్నారు.వేతనం తీసుకోదు.భగవద్గీత,విష్ణు,లలిత సహస్రనామాలు.నారాయణ శతకం,వెంకటదాసు తత్త్వాలు,హనుమాన్ చాలీసా,ఆంజనేయ దండకం,ఊర్మిళ నిద్ర,లక్ష్మణుడి మూర్చ్చ,హనుమంతుని పరాక్రమం లాంటి పాటలు, 5 కల్మాల పాటలు ఉచితంగా నేర్పుతుంది.నంద్యాలవాసి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారితో కలిసి సుబ్బమ్మ గారిని దర్శించాను.ఆమె ధన్యజీవి.భగవద్గీతతో పాటు ఇస్లాం మూల విశ్వాసాలకు సంబందించిన అయిదు కల్మాలను కూడా అయిదు చరణాలలో పాడి వినిపించారు.ఆ పాటలు షేక్ హుసేన్ అనే గురువు ఆమెకు నేర్పారట.ఈమె జ్నాపకశక్తికి మతసామరస్యానికి జోహార్లు.
సుబ్బమ్మ గారు పాడిన 5 కల్మాల పాట ఇది:

లాఇలాహ ఇల్లలాహు అను నామము గలది ఈ కల్మా
తనువు లోపచిన పిమ్మట తారక యోగమె ఈ కల్మా    ||లా||

మూడు పెద్దలకు మూలవిరాట్టని మూలము తెల్పిందీ  కల్మా
ర్ధము తెలియని వ్యర్థపు జనులకు అలవి కాదురా ఈ కల్మా  ||లా||

అవ్వల్ కల్మా దువ్వం కల్మా ఆది వేదముల ఈ కల్మా
సువ్వం కల్మా సృష్టిలోపల సుడిపడ తిరిగిందీ కల్మా             ||లా||

చారుం కల్మా చతుర్వేదముల చరింపుచున్నది ఈ కల్మా
పంజుం కల్మా పాపదోషముల పారద్రోలునది ఈ  కల్మా            ||లా||

ఇలలోన గురు వెల్వల చంద్రుడు వివరము తెల్పిందీ కల్మా
వారి సేవకుడు షేక్ హుస్సేను  పఠన చేసినది ఈ కల్మా      ||లా||ఈ కల్మాల గురించి నాకు కూడా తెలియదు. నా కొడుకు ఒక సాయిబుల ఇంట్లో ఉన్నాడు. ఆమె చెప్పింది. ఆ కల్మాలు అయిదని.
రాసినతని పేరు ?
ఆయన గురువు ఎల్వలు చంద్రుడు. ఆయన శిష్యుడు షేక్ హుస్సేన్.
వారు చెప్తే మహా అయితే ఉర్దూలో అర్ధాలు చెప్తారు. ఇవి అరబ్బీ కల్మాలు కదా తెలుగులోకి వచ్చి చాలా కాలం అయి ఉంటుంది. ఈ షేక్ హుస్సేన్ అనే అతను తెలుగులో దాని అర్ధాలు చెప్పి ఆ కల్మాల రూపంలో రాశాడన్న మాట. తప్పని సరిగా సాహిత్యం ఉండి ఉంటుంది.
ఆ పుస్తకం ఉంది. నమాజ్ చేయలేదని వాళ్ళ వాళ్ళు నేలకేసి కొట్టారు తలకాయని. నుదురుమీద నమాజు గుర్తు కూడా కనబడాలట. నమాజంటే అంటే అది కాదు. అనుదినం ఆత్మలో ఆపరత్పర ధ్యానం అనుభవించినవాడు అన్ని కాలాలందు వినుడు స్నేహితులార కనుడు ఖురాన్ లో కలదు వాక్యం.
అది కూడా ఉందా ఈ పాటలో లేక వేరే పాటా ఇది?
ఇందులోదే. కానీ మర్చిపోయాను.
ఆ షేక్ హుస్సేన్ గారి గురించి వివరాలు , అతను రాసిన పుస్తకం దొరుకుతాయా?
బుక్కు చిన్నక్క దగ్గర ఉండే ఉండొచ్చు.
ఏ చిన్నక్క?
చెట్టుపల్లి చిన్నక్క.
ఏ ఊరు?
నంద్యాలలోని బ్రహ్మానంద రెడ్డి కాలనీ. ఉందో లేదో తెలీదు. ఒకప్పుడు ఉండేది.
ఈడ రామన్న భార్యని అడుగుతాను.అనుదినం ఆత్మలో ఆపరత్పరుని ధ్యానించడమే నమాజ్ అంటే అని ఆయన చెప్పాడు.


https://www.facebook.com/nandyalsrinivas.reddy/posts/849178968467975?comment_id=854047324647806&notif_t=like

11 వ్యాఖ్యలు:

 1. అమ్మ గారు మీరు మా ముత్తాత గారి తత్వాన్ని మీ వాక్యాలలోనే చెప్పినా సారాంశం మాత్రం దాదాపు ఒక్కటే. ఇన్ని రోజులకు ఇంటర్నెట్ లో మా అమ్మ గారి తాత యొక్క తత్వం చూసి చాలా సంతోషం కలిగింది. మీకు నా కృతజ్ఞతలు. భం భం షేక్ హుస్సేన్ దస్ గారి జీవితకాలంలో అచ్చు అయిన పుస్తకం నా వద్ద ఉంది అని తెల్పడానికి సంతోషిస్తున్నాను.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. అమ్మ గారు మీరు మా ముత్తాత గారి తత్వాన్ని మీ వాక్యాలలోనే చెప్పినా సారాంశం మాత్రం దాదాపు ఒక్కటే. ఇన్ని రోజులకు ఇంటర్నెట్ లో మా అమ్మ గారి తాత యొక్క తత్వం చూసి చాలా సంతోషం కలిగింది. మీకు నా కృతజ్ఞతలు. భం భం షేక్ హుస్సేన్ దస్ గారి జీవితకాలంలో అచ్చు అయిన పుస్తకం నా వద్ద ఉంది అని తెల్పడానికి సంతోషిస్తున్నాను.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. THE MOST VALUABLE PREACHINGS OF HAZRATH BHAM BHAM SAIK HUSSAIN DAAS (who RIP on 29.03.1929 at JAINAB BEE DARGAH, URAVAKONDA), the first and best disciple of of HAZRATH BHAM SYED SULTAN MOHIDDIN QADRI who RIP on 14.06.1911 at CHIPPAGIRI.
  రాగం -ఉమాభరణం - ఆదితాళం
  అవ్వల్ కల్మా ఆదివేదమది అంతరంగమున బిస్మిల్లా దువ్వం కల్మా ఆత్మ భేదమది దుర్లభం దొరికేది ఆయల్లా "ప"
  తీనంకల్మా తిరుగుటి అది తీర్థ ప్రసాదం బిసమిల్లా మూలభవమున ముందు తెలిసితె మోక్షమిచ్చునది బిస్మిల్లా "అవ్వల్ కల్మా"
  చహరం కల్మా చతురవేదమది శాస్త్రమూలమై బిస్మిల్లా పంచతత్వమిది పాంచకల్మతో ప్రణవమైనదిర బిస్మిల్లా "అవ్వల్ కల్మా"
  భేదములిడిచి నాదము దెలిసితె నాణ్యమైనదిర బిసమిల్లా నాదబ్రహ్మమిది నాణ్యము తెలిసితె నాదరహితమై బిస్మిల్లా "అవ్వల్ కల్మా"
  తారకయోగం తరచిజూచితె తనలోయున్నది బిస్మిల్లా తాను తానయ్యేతత్వము తెలిసితె తానై యున్నది బిస్మిల్లా "అవ్వల్ కల్మా"
  సప్తాక్షీ మంత్రంబు పఠనతొ ఆనందమైనది బిస్మిల్లా ఇరవై అయిదు తత్వములోపల ఇలహమైనదిర బిస్మిల్లా "అవ్వల్ కల్మా"
  వేదశాస్త్రములు వెదికిచూచిన ఏకమైనదిర బిస్మిల్లా నిలకు తెలిసితె నీలో చూచితె నిండి యున్నదిర బిస్మిల్లా "అవ్వల్ కల్మా"
  సప్త యోగులకు సాక్షి రూపమై సాయమైనదిర బిస్మిల్లా పాటిగ మదిలో ప్రయోగించితె పరబ్రహ్మముర బిస్మిల్లా "అవ్వల్ కల్మా"
  గురు భం భం కరుణ కలిగితె అనంతరూపము బిస్మిల్లా సేవ జేసెటి శేఖుసేనుకు శేఖరమైనది బిస్మిల్లా "అవ్వల్ కల్మా"

  ప్రత్యుత్తరంతొలగించు
 4. **************************
  కొండకు పోదాము రమ్మ ఉరవకొండకు పోదాము రమ్మా "కొండ"
  ఆ అనుభవము తెలిసిన భంభంబు ఖాదరీ కొండకు పోదాము రమ్మ "కొండ"
  ఆ కొండ అనుభవము తెలిసితే ఆనందమైనా కొండా పంచ బురుజులున్నా కొండ అది పరికించి చూచితె ఐదైదులమ్మ "కొండ"
  సప్తాఋషులున్నారె కొమ్మ ఆ కొండలో సప్తాఋషులున్నరె కొమ్మ ఆ సప్తదళములో జేరి శాశ్వతమే గనుమమ్మా
  ఆ సప్తదళములో జేరి శాంతమే గనుమమ్మా "కొండ"
  ఆ కొండ చుట్టూ చూడబోతేనమ్మా ముప్పై మూడూ కోట్ల గుండ్లా సైన్యాముంద్యమ్మా " ఆ అనుభవము"
  కొండ ఎత్తు చూడబోతే కొమ్మా ఎనిమిది బురుజుల పొడవున్నాదమ్మ దాన్ని వివరించి జూచితే నాలుగు జానలే ఉన్నదమ్మ "కొండ"
  ఆరు గుణములు అణచారేమమ్మ ఆరు పై ఆశ విదిచి చూడారె కొమ్మా ఆశ విడిచీ మర్మమే తెలియారె కొమ్మ
  తొమ్మిది స్థానాలున్నాయమ్మ తొంభై రెంటి మర్మము తెలియారె కొమ్మ "కొండ"
  మూడు గుణములు అణచరేమమ్మా ముప్ఫై మూడు మర్మము తెలిసి ముందుండరమ్మ భావము మదీనుంచరమ్మ తాత భంభంబు కృపవల్ల కల్గిన భాగ్యమేనమ్మ సాంఖ్యము వివరిస్తీనమ్మా సాధుజనులైతే మీలోనె చూడారేమమ్మ "కొండ"
  శిఖరమై నిలిచే నమ్ముకొండమ్మ వివరము తెలిపెటి ఇమాం గురుడోయమ్మా ఉరవకొండాలో నున్నాడమ్మ స్థిరముగ నిలిపేటి భంభం ఇమాం గురుడోయమ్మ "కొండ"

  ప్రత్యుత్తరంతొలగించు
 5. **************************
  కొండకు పోదాము రమ్మ ఉరవకొండకు పోదాము రమ్మా "కొండ"
  ఆ అనుభవము తెలిసిన భంభంబు ఖాదరీ కొండకు పోదాము రమ్మ "కొండ"
  ఆ కొండ అనుభవము తెలిసితే ఆనందమైనా కొండా పంచ బురుజులున్నా కొండ అది పరికించి చూచితె ఐదైదులమ్మ "కొండ"
  సప్తాఋషులున్నారె కొమ్మ ఆ కొండలో సప్తాఋషులున్నరె కొమ్మ ఆ సప్తదళములో జేరి శాశ్వతమే గనుమమ్మా
  ఆ సప్తదళములో జేరి శాంతమే గనుమమ్మా "కొండ"
  ఆ కొండ చుట్టూ చూడబోతేనమ్మా ముప్పై మూడూ కోట్ల గుండ్లా సైన్యాముంద్యమ్మా " ఆ అనుభవము"
  కొండ ఎత్తు చూడబోతే కొమ్మా ఎనిమిది బురుజుల పొడవున్నాదమ్మ దాన్ని వివరించి జూచితే నాలుగు జానలే ఉన్నదమ్మ "కొండ"
  ఆరు గుణములు అణచారేమమ్మ ఆరు పై ఆశ విదిచి చూడారె కొమ్మా ఆశ విడిచీ మర్మమే తెలియారె కొమ్మ
  తొమ్మిది స్థానాలున్నాయమ్మ తొంభై రెంటి మర్మము తెలియారె కొమ్మ "కొండ"
  మూడు గుణములు అణచరేమమ్మా ముప్ఫై మూడు మర్మము తెలిసి ముందుండరమ్మ భావము మదీనుంచరమ్మ తాత భంభంబు కృపవల్ల కల్గిన భాగ్యమేనమ్మ సాంఖ్యము వివరిస్తీనమ్మా సాధుజనులైతే మీలోనె చూడారేమమ్మ "కొండ"
  శిఖరమై నిలిచే నమ్ముకొండమ్మ వివరము తెలిపెటి ఇమాం గురుడోయమ్మా ఉరవకొండాలో నున్నాడమ్మ స్థిరముగ నిలిపేటి భంభం ఇమాం గురుడోయమ్మ "కొండ"

  ప్రత్యుత్తరంతొలగించు
 6. రాగం -ఉమాభరణం - ఆటతాళం
  దాసుడే అమ్మా దాసుడే హరి భక్తులాకు దాసుడే అమ్మా దాసుడే "ప"
  దాసునిజూడారె మీరు దోషములు బాసీనవారై దాపు జేరి గురుని దగ్గెర దోషరహితుదు అయిన వానీ దాసుడే "దాసుడే "
  జాతి నీతి లేనివాడు జన్మ పావనమైనవాడె జ్యొతిభావము దెలిసినోని జాతిలోగలిశున్న వాని "దాసుడే "
  అండములొ అణగీనవాడె పిండములొ ప్రబలీనవాడె గండిదాటి వెళ్ళినాడు ఘనతదాసులచేరినోని "దాసుడే "
  కులముగోత్రములేనివాడు కూడి సాధులొచేరినాడె కుదుటనిలిపి మనసుయుంచితె కుండలిలొకలిసేటివాని "దాసుడే "
  చిప్పగిరిలోనవొప్పియున్నడు చిన్మయాకారూడు వాడె భయలు భావము దెల్పినోని భంభంబూగురుస్వామి భక్తుని "దాసుడే "
  ధరణిలో ఉరగాద్రి పురమున దాసుడై తిరిగేటి వాడె సేవజేసిమదిలొయుంచిన శేఖుస్సేందాస్ వాని దాసుడే "దాసుడే "

  ప్రత్యుత్తరంతొలగించు
 7. nice
  Hi
  We started our new youtube channel : Garam chai . Please subscribe and support https://www.youtube.com/garamchai

  ప్రత్యుత్తరంతొలగించు
 8. what a crazy blogs i'm following your blogs please give some suggestions please subscribe and support me
  my youtube channel garam chai:www.youtube.com/garamchai

  ప్రత్యుత్తరంతొలగించు
 9. good afternoon
  its a nice information blog
  The one and the only news website portal INS Media.
  please visit our website for more news updates..

  https://www.ins.media/

  ప్రత్యుత్తరంతొలగించు