ఈ బ్లాగును సెర్చ్ చేయండి

3, జూన్ 2013, సోమవారం

నిజమైన భారతీయ ముస్లింలు ఎవరు?-- యస్. హజరత్ అలి



నిజమైన భారతీయ ముస్లింలు ఎవరు?
యస్. హజరత్ అలి

మన దేశాన్ని 7-8 శతాబ్దాలు ఏకచ్ఛత్రాధిపత్యంగా ఏలిన        ముస్లిం      రాజులు, మత ప్రచారకులు, సూఫీ భక్తులు, వర్తక వాణిజ్య వ్యాపార      రంగంలోనూ, సాహిత్య కళా రంగాలలోను, సాంస్కృతిక సాంఘిక జీవన    విధానాలలోను తమ తమ ప్రభావాల్ని ఇక్కడి హిందువులపై పడేటట్లు    చరిత్ర నిర్మాణం జరిగింది. 7-8 శతాబ్దపు గజినీ, ఘోరీ దండయాత్రల కాలాల        నుండి విదేశీయులైన అరబ్బు, ఇరాన్, ఇరాక్, ఫార్శీ, టర్కీ ప్రాంతపు ఎందరెందరో రాజులు, సైనికులు, తమ భుజ బలాన్ని, అశ్వ దళాలతో    దండెత్తి ధనధాన్యాల్ని, రత్నవైఢూర్యాల్ని, దేవాలయాల్ని కొల్లగొట్టడమే    గాక, ఇక్కడి హిందూ రాజుల్ని ఓడించి రాజుల్ని, సుందరాంగుల్ని, దాస దాసీలుగా మార్చుకొని, కొన్ని సార్లు వివాహాలు చేసుకొని ఇస్లాం      సంస్కృతిని ఈ హిందూ దేశంలో కలగాపులగంగా కలిసిపోయేటట్లు       చేశారు. ఇక్కడి వారినెందరినో బానిసలుగా ఎత్తుకెళ్ళారు. బానిస వంశాల్నే       స్థాపించారు.వందల ఏండ్లు రాజ్యాలేలారు. మన హిందూ సంస్కృతితో మమేకం అయ్యారు. గుళ్ళూ, గోపురాలు కూల్చివేశారు. మశీదులు, దర్గాలు కట్టుకున్నారు. గ్రామ గ్రామాన ఇస్లామీయులు ఇండ్లూ, వాకిళ్ళు,
జమీందారీలు, సైనిక ఉద్యోగాలు, పదవులు, సంపాదించుకొని
హిందువులలో మమేకమైపోయారు. హిందూ స్త్రీలను ఇస్లామీయులుగా
మార్చుకొని వివాహాలు చేసుకొని పిల్లల్ని కని వంశాభివృద్ధి గావించుకున్నారు. అంటరానితనానికి, సంఘ బహిష్కరణలకు, కులమత    ఛాందస ఆచార్య వ్యవహారాలకి బలైపోయే పీడిత, పేద, దళిత వర్గాలకి     ఆసరాగా సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని,దేవుడొక్కడే అనే ఏకేశ్వరవాదాన్ని        ఇస్లాం ద్వారా ప్రచారం చేసి హిందువులనెందరినీ ఇస్లామీయులుగా   మార్చుకొన్నారు. వేషభాషలు, సంస్కృతిని అనేక వృత్తి కళారంగ     సామర్ధ్యాలను అలవరచారు. రాజాధరణ లభించడం వల్ల యధారాజా    తధాప్రజ అన్నట్లు ఇక్కడి పీడిత ప్రజలు ముస్లింలుగా మత మార్పిడి    చెందారు. కొందరు వారి భాషల్ని, ఆచార వ్యవహారాల్ని, మత సంస్కృతిని        వంటపట్టించుకొని,అనుకరించి, తామే నిజమైన ముస్లింలుగా        రూపుమార్చుకున్నారు.మరికొందరయితే తమ తమ మాతృభాషల్ని వీడక, కులవృత్తుల్నీ వదలక, పేరుకు ఇస్లామీయులుగా మారినా,       సాంస్కృతికంగా హిందూ ముస్లింలుగా వేరుగా ఉండసాగారు. పండుగలు,       పబ్బాలు, పెండ్లిండ్లు ఇస్లాం సాంప్రదాయాను సారంగా చేసుకొన్నా, ఆచార       వ్యవహారాల్ని పూర్తిగా వదలక మధ్యేమార్గాన్ని స్వీకరించారు. వీరు పేరుకు        సాయిబులు, వారు తమ మాతృభాషలు వదలలేదు. వృత్తులు వదలలేదు.        పొట్టకూటికోసం రాజోద్యాగాలు, నిర్వహించినా తమ తమ పాత సంస్కృతులను పూర్తిగా వీడలేదు. వ్యవసాయదారులుగా, కూలీలుగా, దర్జీలుగా, శిల్పులుగా వివిధ రకాల నైపూణ్య పనివారలుగా, మెకానిక్ లు,    డ్రైవర్లు కండక్టర్లుగా మరికొందరు సంగీత, సాహిత్య కళాకారులుగా రూపుదిద్దుకున్నారు. చెప్పులు కుట్టేవారి దగ్గర నుండి, సైనికాధ్యక్షులు      దాకా వివిధ హోదాలలో పనిచేసేవారు. వారంతా ఇక్కడ పుట్టి, పెరిగి ఇక్కడే కొన్ని తరాలుగా హిందూ గడ్డపై నివసించారు. తమను తాము పూర్తి ఇస్లామీయులుగా రూపుమార్చుకోలేని హిందూ ముస్లిం లే ఈ నూర్ బాషీయులు.వీరు సూఫీలలాగా నూలు వడికే వృత్తినీ, దూది ఏకి పరుపులు  కుట్టి,        దుస్తులు కుట్టి, నగిషీలు చెక్కే కళాకారులుగా నిలద్రొక్కుకున్నారు.    ప్రావీణ్యాల్ని సంపాదించారు. అయినా వీరికి పూర్తి సాయిబులుగా గుర్తింపు రాలేదు. కానీ విదేశీ ముస్లింలు ఇక్కడ స్థిరపడి,రాజకీయంగా మత పరంగా, సాంస్కృతికంగా భారతీయ ఇస్లామీయులుగాగుర్తింపు పొంది,    నిజమైన హిందూముస్లింల్ని అంటరానివారిగా చూస్తూతమతో కంచం పొత్తు మంచం పొత్తు లేకుండా చేసి చివరకు తమ మశీదులలోనికి కూడా        రానీయకుండా చేసి "లద్ధాఫ్" లనీ, పింజారీలనీ తక్కువ కులస్తులన్నింటిలో    తక్కువ చేసి చూస్తున్నారు. ఊరికి దూరంగా అంటరాని వారిలాగా వేరుగా   లేకున్నా, ఊళ్ళోనే ఉంటూ, తమ ఊరి ఇస్లాం ప్రజలతో పెండ్లి, ప్రార్థనలు,   పండుగలు మొదలైన ఆచార వ్యవహారాలలోనూ తక్కువ కులస్థులుగా   చూస్తున్నారు. దాంతో తమకు తామే న్యూనతాభావంతో దూదేకుల నూర్ భాషీయులమని చెప్పుకోవడానికీ వెనకడుగు వేసుకోవాల్సిన గతిపట్టింది.      వారికి.    అందుకని, వారి జనాభా ఎంతో సరిగా లెక్కకు జనగణన జరగక, ముస్లిం జనాభాలో కలిపేసి చూడటంతో రెండింటికీ చెడ్డ రేవడిగా అటు హిందూ బి.సి. లుగా గానీ,ఇస్లామీయులుగా గానీ గుర్తింపు రాక , పూర్తి వెనుకబాటుతనంలో పడిపోయి ఉన్నారు. విద్యా, రాజకీయ, ఉద్యోగ  జీవితాలలో ఎస్.సి, ఎస్. టి ల కంటే ధారుణంగా వెనుకబడి ఉన్నా గుర్తింపు లేకుండా పోయారు. వారి కులంలో ఒక్క రాజకీయ నాయకుడు ఒక్క ఎం.పి, ఒక్క ఎం.ఎల్.ఏ, ఎం.ఎల్.సి. కనీసం పార్టీ ప్రతినిధులుగా జిల్లా గ్రామ నాయకులుగా ఎదగడమూ గగనమై పోయింది.  మధ్య ముస్లింలకు 4 %    బి.సి.లుగా రిజర్వేషన్లు పొందిన ఇస్లామీయులలో ఈ నూర్ బాషా      ముస్లింలు రారు. వీరికి బి.సి. బి లో 1 %, ఇచ్చి కంటి నీరు తుడిచారు.వీరు ముస్లింలలో 40% గా ఉన్నా 4% వీరికి ఇవ్వవలసింది పోయి, విదేశీ సంతతి ముస్లింలు కాజేశారు. ఇస్లామీయుల జనసంఖ్య ననుసరించి 12.5%    రిజర్వేషన్లు కోసం పోరాడాల్సింది పోయి తమకిచ్చిన 4 % శాతానికే   పరిమితమైపోతున్నారు. అందునా సయ్యద్ లు, ఖాన్ లు, పఠాన్ లు   మొదలైన వారిని అగ్రవర్ణ ఇస్లామీయులుగా పేర్కొనడం మరో ఘోరం.      ముస్లింలో వర్గీకరణ చిచ్చుపెట్టి ముస్లింలనూ చీల్చి ఓటు బ్యాంకును సాధించాలని ఇప్పుడు రాజకీయ పార్టీలు వీరికి ప్రోద్భలమిచ్చి   విషబీజాల్ని నాటుతున్నాయి. ముస్లిములఐకమత్యాన్ని చీల్చి చెండాడుతున్నాయి. వీటిని గమనించే పరిస్థితి  నోరు లేని దూదేకుల సాయిబులకు లేనే లేదు.    ఎదురు తిరిగే ప్రవృత్తి అసలే లేదు. విప్లవ భావాలు మొలకెత్తనే     మొలకెత్తవు. అసలు వీరికి నిజమైనజ్ఞానాన్నిప్రభోదించే నాయకులు లేరు. ఎస్.సి లకు అంబేద్కర్ లాంటి వారు ఉద్భవించినట్లుగా, వీరికి        ప్రాతినిధ్యం వహించి పోరాడే ముస్లిము నాయకులు లేరు. ఉన్న ముస్లింనాయకులంతా అగ్రవర్ణ ఇస్లాం విదేశీ నాయకులు. వారు హిందూ ముస్లిం   తగాదాలు పెట్టే తాలిబాన్ల తత్వం గలవారు. హిందూ సంస్కృతీ సంప్రదాయాల్ని ద్వేషించే వారు. అరబ్బు సంస్కృతి పెంచి పోషించేవారు. హిందూ మత ద్వేషులు కూడా జాతీయ గీతాన్ని ఆలపించడానికి గాని,  జాతీయ పతాకానికి వందనం చేయడానికి గానీ విముఖత చూపేవారు.వారెట్లు భారతీయ ముస్లింలు అవుతారు?

    తమిళనాడులోని ముస్లింలు తమిళమే మాట్లాడతారు. ప్రార్థనలు (నమాజులు) సహితం తమిళంలోనే నిర్వహించుకుంటారు. కేరళీయులు ముస్లింలుగా మారి తమ మాతృభాష మళయాళీని వీడలేదు. ఇక బెంగాలీ లైతే బెంగాలీ మాట్లాడే ముస్లింలుగా మారినందుకే దేశం పాకిస్తాన్ నుండి   వేరై బంగ్లాదేశ్ గా రూపు మార్చుకోవాల్సి వచ్చింది. ఒకప్పుడు వారంతా        హిందూ ముస్లింలేగదా! ఇప్పుడు పాకిస్థాన్ ముస్లిం , కాశ్మీరీ ముస్లిం ,ఆఫ్ఘన్ ముస్లిం చైనా ముస్లిం, టిబెట్ ముస్లిం అని విభజిస్తున్నారేగానీ,వారంతా       తమ తమ దేశాలలో పుట్టి పెరిగిన వారే! 'జిన్నా' భారతీయముస్లిం  అయివుండి పాకిస్తానీ ప్రధాని అనలేదా? ముషారఫ్ ఎవరు?అద్వానీ ఎవరూ? ఖాన్ గఫర్ ఖాన్ ఎవరు విభజన వల్ల దేశాలే గాక మనుషుల  పౌరసత్వాలూ ఛూ మహంకాళీ లాగా
మా యమైపోతున్నాయి.

  రేపు గుంటూరు 'జిన్నా' టవర్ ని పడగొట్టి 'మోడీ' సెంటర్  నిర్మాణం  చేస్తారట! నాజ్ సెంటర్ ని 'నాజర్' సెంటర్ గాయినా  పిలిచి  మన నాజర్ ని గుర్తించగలరా? రాష్ట్రపతి అబ్దుల్ కలాం విగ్రహాన్ని పాకిస్తాన్ లో  వేయించగమా? ఆఫ్ఘన్ లో బుద్ధ విగ్రహాలకే గతి పట్టిందో గదా! 'బౌద్ధం'  పుచ్చుకున్న హిందువులకు రిజర్వేషన్లు ఎస్.సి లకిచ్చే లాగానే   ఇవ్వవచ్చుననే ఆదేశాలున్నాయి గాని, హిందువులు అయివుండి, ఇస్లాం       పుచ్చుకొని , హిందూ సంస్కృతినే పరిరక్షించి తమ తమ మాతృభాషలలో      ప్రసంగించే ఈ నూర్ బాషీయులకు 4 % రిజర్వేషన్ ఎందుకు ఇవ్వరు?       ఆర్ధికంగా వెనుకబడిన వారికి ఒ. బి.సి లుగా  రిజర్వేషన్ ఇచ్చినట్లుగానే ఈ    దూదేకుల బీద ముస్లింలకు రిజర్వేషన్ల గుర్తింపేలేదా?

దేశ దేశాలలో ఉండే ముస్లింలందరిదీ ఒకే భాష కాదు. ఉర్దూ మాట్లాడేవారిని అరబ్బులు  ముస్లింలు గా పరిగణించరు. పాకిస్తాన్ లో హిందువులకు గాని,       భారత దేశంలో నుండి వలసపోయిన ముస్లింలకు గాని ఏ మాత్రం గుర్తింపు లేదు. వీరిని ద్వీతీయ పౌరులుగానే చూస్తున్నారు.ముస్లింలు అంతా ఒకటేనంటారు. కానీ, చైనా, రష్యా,జపాన్, ప్రాన్సు,        అమెరికా, ఆస్ట్రేలియా,ఇండొనేషియా, మయన్మార్,ఆఫ్రికాలలో ఉండే    ముస్లిం లంతా ఆయా  ప్రాంత సంస్కృతులు, భాషలు,ఆచార వ్యవహారాలు       పాటిస్తున్నారే  గానీ అంతా అరబ్బు ముస్లింల
లాగా ఉండలేరు. కనుక, భారతదేశంలోని నూర్ బాషీయులకు రాజకీయంగా, మతపరంగా  కులపరంగా        సరియైన గుర్తింపునిచ్చి రాజకీయ అధికారంలో భాగం    పంచుకొనేలాగా   అవకాశాన్నికల్పించాలని డిమాండు చేయాల్సిన అవసరం ఎంత గానో ఉన్నదని గమనించ ప్రార్థన.
 https://www.facebook.com/photo.php?fbid=470947116270617&set=a.233025936729404.60739.100000659993594&type=1&theater&notif_t=like

10 కామెంట్‌లు:

  1. well done sir. I like your point. I like this set of people as they are symbol of Hindu Muslim fraternity and they speak Telugu.

    రిప్లయితొలగించండి
  2. చాలా కాలం తరువాత కనిపించిన ఆలోచనీయమైన విషయాలు కల మంచి టపా.

    రిప్లయితొలగించండి
  3. "ఏ కులమని.... "
    - దివి కుమార్

    ఏ కులమని నను వివరమడిగితే
    ఏమని చెప్పుదూ లోకులకూ...
    పలు కాకులకూ... దుర్మార్గులకూ...ఆ దుష్టులకూ...
    ఎక్కువ తక్కువ కులాల నడుమ
    ధనికులు పేదల వర్గాలందున
    సాగుతున్న ఈ సమరంలోనా
    పీడిత పక్షం నిలిచే వారిది ఏ కులమని..

    కొల్లగ దోపిడి కొనసాగించే
    తెల్ల దొరల సరికొత్త కుట్రలను
    చెల్లవంటు బరిగీసి నిలిచెడి
    పోరులోన తలమునిగిన వారిది ఏ కులమని..

    నేలను, నీరును, గనులను, అడవిని
    మేతమేసే ఆ నేతలందరిని
    పాతరేయుటకు పదండి రండని
    కూడబెట్టి శతపోరేవారిని ఏ కులమని..

    నర్సంపేట, భీమవరంలో, కారంచేడు, చుండూరుల్లో,
    బెర్లాంజీలు, లక్ష్మీపేటలో అగ్రకులాల...
    దురహంకారాన్ని ఎదిరించి
    ఎండగట్టి ఎదిరించేవారిది ఏ కులమని..

    చెడులకు... మంచికి... చిరకాలంగా...
    ఆగకుండా కొనసాగుతున్నదిరా
    చావు బ్రతుకుల దళిత పోరులుగా
    ఈ పోరాటంలో మీదే కులమని
    అడిగిన వారికి ఒకే జవాబు ఏ కులమని..

    దోపిడి పీడన అసమానతపై
    మానవత్వమై ఆగ్రహించిన
    ప్రజాస్వామ్యమై ఆవేశించిన
    శ్రామిక వర్గపు కార్మికులం.
    మేం కార్మిక వర్గపు శ్రామికులం
    కార్మికులం! శ్రామికులం!
    శ్రమకులం మాది! దూదేకులం! ఏ కులమని..

    రిప్లయితొలగించండి
  4. "యమరాజ్యం" పార్టీ జిందాబాద్

    -- యస్. హజరత్ అలీ
    (సత్యహరిశ్చంద్ర లోని సతీ సావిత్రి యముని డైలాగ్ అనుకరణ)
    "పోవుచున్నావా ఓ ... యమ ధర్మరాజా! పోవుచున్నావా ".....
    "సావిత్రీ! ఆగుమాగుము. ఇంకా ఎక్కడికి వైతరణీ నదినీ దాటి
    వచ్చితిమి. పవిత్ర గంగా, కావేరి, కృష్ణా గోదావరులు అన్నీ దాటాము. "
    "వరమీయగ... రాదా ఓ యమధర్మ రాజా పోవుచున్నావా"
    "సావిత్రీ! నీ నిజాయితీకీ, పట్టుదలకూ, పెంకితనానికి మెచ్చితిని. ఏదేని
    వరమొక్కటి కోరుకొనుము. ప్రసాదించెద"!
    "స్వామీ! నా కోసము ఏమియును వలదు. మా ఈ నూర్ బాషీయులు
    నిజమైన అచ్చమైన భారతీయ ముస్లింలు. వారికి 4% రిజర్వేషన్ వారికి
    ప్రసాదించు స్వామి! చాలును. "
    "ఆహా అదెట్లు అది అసాధ్యము. అది దక్క వేరొక్క వరమును
    కోరుకొనుము ఇచ్చెదను."
    "అయినచో ఈ దేశంలోని ముస్లింలందరికీ జనాభా ప్రాతిపదికన 15%
    రిజర్వేషన్లు ఇప్పించండి స్వామీ"
    "ఓహో ఏదో అబలవని, దూదేకుల కులంలో పుట్టిన లదాఫీ స్త్రీవనీ
    దయదలిచితే అసలుకే ఎసరు బెడ్తివే అది దక్క వేరు వరము
    కోరుకొనుము. "

    "స్వామీ! యమధర్మరాజా ఈ దేశంలో పుట్టి పెరిగి, ఇక్కడి హిందువులమైన మేము, మతం మారినంత మాత్రాన పరాయి దేశస్థులమైనామా మాకు విముక్తి ప్రసాదించలేని నీకు నేనే ఒక్క వరమిచ్చెదను. స్వీకరించండి."
    "అదెట్లు సావిత్రీ!"
    "ఏమున్నది రేపు 2014 లో జరుగబోవు ఎన్నికలలో మా ప్రాణ మసుమంటి ముస్లింల ఓట్లన్నీ, నీ యమరాజ్యం పార్టీకే వేసి గెలిపించెదము, నీ యమరాజ్యం, రామరాజ్యం, ప్రజారాజ్యం గా కాకుండా, నీ రాజ్యం నీవే ఏలుకొనుము. ధన్యురాల్ని స్వామీ! పోవుచున్నావా ఓ యమధర్మరాజా"

    రిప్లయితొలగించండి


  5. ఇదంతా చదివిన తర్వాత నాకొకటి అనిపిస్తున్నది.(ముందుగా మీ టపాలో తప్పు దొర్లినది.ఘజనీ,ఘోరీలు 7,8, శతాబ్దులనాటివారుకాదు.వరుసగా వాళ్ళు,11,12,శతాబ్దులలోని వారు.)మనదేశంలోనే కాదు .ప్రపంచ చరిత్రలో ఎన్నో మంచి ,చెడ్డలు జరిగాయి.పాత మళ్ళీ తిరిగిరాదు.బుద్ధిమంతుల లక్షణం ఇప్పుడేమి చేద్దామని వివేచన చెయ్యడమే.దానిప్రకారం,(ఎవరి మతం వాళ్ళు అనుసరిస్తూనే ) భారతీయులంతా కుల,మత భేదాలు విస్మరించి దేశాభివృద్ధికి కలసికట్టుగా పనిచేయడమే.రిజర్వేషన్లు పెంచుకుంటూ పోవడం మంచిదికాదు.విద్య అందరికీ ఉచితంగా అందుబాటులో ఉండునట్లు ప్రభుత్వం చర్యతీసుకొంటే చాలు.అరేబియా,టర్కీ,పెర్షియాలనుండి వచ్చినా,ఇక్కడ convert ఐనా ఇప్పుడందరూ భారతీయులమనే భావించుకోవాలి.అమెరికాలో వివిధదేశాలనుంచి వలసవచ్చి అంతా ఒక అమెరికన్లుగానే సెటిలవుతున్నారు.(melting pot ) అలాగే ఎవరైనా మనదేశప్రయోజనాలే ముఖ్యంగా భావించి ఉండాలి.దేశ ఐకమత్యానికి,సమగ్రతకు,భంగం కలిగించరాదు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కమనీయం గారు అక్కడ వారి ఉద్దేశ్యం ఏమిటంటే గజినీ గోరీలు 7,8 శతాబ్దం లోని వారని కాదు ముస్లిం చక్రవర్తులు రాజులు 7,8 శతాబ్దాల పాటు పరిపాలన సాగించారు అని అర్థం.

      తొలగించండి
  6. ఏదో ఒహటి చెప్పి ఏ ఒకటి రెండు శాతం ఎంగిలిమెతుకులు అడుక్కోవడం, అభివృద్ధి చెందినాం అనుకోవడం అందరికీ అలవాటైపోయింది. కానివ్వండి, దొరికించుకున్నోడికి దొరికించుకున్నంత మహమ్మద్ రసూలుల్లా అన్నారు.

    రిప్లయితొలగించండి
  7. EE kulam matham leni goppa 'tega' maadi garvamga cheppukondi.

    రిప్లయితొలగించండి
  8. https://www.facebook.com/photo.php?fbid=470947116270617&set=a.233025936729404.60739.100000659993594&type=1&theater&notif_t=like

    రిప్లయితొలగించండి