పింజ=ధోవతి గోచి
అంచును బిళ్ళగామడిచి దోపుకొనిన పంచకట్టు,ఇది పెద్ద వరుసవారు కట్టుదురు.బిళ్ళగోచి -పింజబోసి కట్టినాడు
పింజరీ పీకు
=ఎడతెగని వాదము చేయు
పింజలు= జందెము
వడుకు పద్ధతి,నాలుగు పింజలు
వడికినాడు
పింజేరి = బలహీనుడు,పీల,పింజేరి మనిషి
(మాండలిక పదకోశము,ఆం.ప్ర.సాహిత్య అకాడమీ 1970).
వీటిలో బలహీనుడు లేదా పింజలు వడికేవాడు అనే అర్ధాలు
సమంజసంగా ఉన్నాయి.
అయితే ఇలాంటి బలహీనుడినీ,ఏకులూ,జందెములు వడికే శ్రామికుడినీ,
పవిత్రుడినీ పట్టుకొని 'పింజారీ
వెధవ' అంటూ కొంతమంది దుష్టులు కూసే కారుకూతలను ఆపటానికి గతంలో ఎన్నో ప్రయత్నాలు జరిగాయి.'పింజారీ
వెధవ' అనే పదాన్ని తమ సీరియళ్ళలో తొలగిస్తూ దూరదర్శన్ ప్రోగ్రామ్స్
కంట్రోలర్ వెంకటేశ్వర్లు గారు 18.2.1987న ఐ.పి షా గారికి క్షమాపణ
ఉత్తరాన్ని రాశారు.
డా. దాశరధి రంగాచార్య ఇనగంటి దావూద్ గారి ఉత్తరానికి
స్పందించి తన 'అమృతంగమయ' సీరియల్ లో "ఈ పదం తొలగిస్తున్నాను
క్షమాపణ కోరుతున్నాను" అంటూ పెంజరము అంటే 'బంగారు హరిదళము'అని అర్ధం
చెప్పారు (వార్త ఆదివారం 2.2.2003).అయినా పెంజరానికీ పింజారీకి ఎలాంటి
సంబంధం లేదనీ,మానవులంతా ఒక్కటే,లోకమే వారి కుటుంబం,ఒకరు మరొకరికంటే అధికుడై
జన్మించాడనే మాట అర్ధరహితం అనే దావూద్ గారి వాదనను చివరికి రంగాచార్యగారు
ఒప్పుకున్నారు.
తెలుగుఅకాడమీ వారి తెలుగు-తెలుగు నిఘంటువులో పింజారీ అంటే
ఒకవిధమైన తిట్టు అనే అర్ధం ఉంది.అది ఎలా తిట్టుపదమో చెప్పాల్సిందిగా ఇనగంటి
దావూద్ గారు నిగ్గదీస్తే పునర్ముద్రణలో ఈ తప్పును సవరించుకుంటామని
ఆవులమంజులత గారు 28.8.2003 న
సమాధానమిచ్చారు.
జంధ్యాల,కోనవెంకట్,మోత్కుపల్లి, బ్రహ్మానందం లాంటివాళ్ళు
ఇదేపదం వాడి క్షమాపణ చెప్పారని సత్తార్ సాహెబ్ చెప్పారు .
ఎన్నో ఏళ్ళనుండి
మా కులం పేరుతో తిట్టకండి అని పింజారీలు పోరాడుతున్నా ఫలితం
శూన్యం.సంస్కారంలేని రచయితలను,దర్శకులనూ ఏం చెయ్యాలి?
వేలాది పింజారీ సోదరులు కలత
చెందుతున్నది రగిలిపోతున్నదీ రిజర్వేషన్ కోసం కాదు.తమకులాన్ని
తిట్టుపదంగా వాడవద్దని.అదొక కులమని ఇన్నాళ్ళూ తెలియలేదన్నారు.అది ఒక
కులమని తెలిసిన తరువాత కూడా కావాలని డైలాగులు రాసే వారిని,తీసేవారిని ఏమని
పిలవాలి ?వాళ్ళను ఎలా ఆపాలి?ఆపలేనివారిని అనెయ్యటమేనా?అనేవాడిని
అనొద్దు అని చెప్పకుండా అనిపించుకున్నవాడిని బాధపడొద్దు చూడొద్దు అని సలహా
ఇచ్చేవారికి మానవత్వం ఉందా? ఇంట్లోవాడు అంటేనేంటి బయటోడు అంటేనేంటి?ఇద్దరూ
పాపులే.
పిండారికీ పింజారికీ తేడా తెలియని పుండాకోరులకు,ఎగతాలి చేద్దామని చూసేవారికి తగిన జవాబివ్వండి.మనం ఇంతగా వివరించినా "పిండారీ అనే పదం నుండే పింజారీ అనే పదం పుట్టింది. ఈ విషయం నిర్థారణగా తెలిసింది" అని మొండిగా వాదిస్తూ అది ఎలా
నిర్ధారణ అయ్యిందో చెప్పని వాళ్ళకు బుద్ధి చెప్పాలి.అయినా వాళ్ళ తిట్లకు ఈ పదాన్నే ఎంచుకోటానికి
కారణం పింజారీలు బలహీనవర్గానికిచెంది ఎవరినీ ఎదిరించలేని స్థితిలో
ఉండటమే.వీళ్ళ నోళ్ళు మూయించలేక కళావంతులు,భోగం వాళ్ళు తమ కులంపేరు సూర్యబలిజ గా
మార్చుకున్నారు.మాదిగలు మాత్రం ఎదురుతిరిగి నిలబడ్డారు.
నోరా
వీపుకు దెబ్బలు తేకే అన్నట్లు సభ్యత సంస్కారం లేని వాళ్ళు గతంలో
మాల,మాదిగలను ఇలాగే తిట్టేవాళ్ళు.అత్యాచార చట్టం వచ్చాక కులదూషణ కేసులకు
జడిసి వెనక్కుతగ్గారు.తీట నోరు ఊరుకోదుకదా.చట్ట రక్షణ లేని మిగతా బలహీన
కులాలపైన పడ్డారు.ఆ క్రమంలోనే ఇప్పుడు బ్రామ్మలు,రేపు
ఇంకో కులం.విడిపించే దిక్కులేక దెబ్బలకోర్చినట్లుంది కొన్ని కులాల
పరిస్థితి.ఈ దెబ్బ భరించలేక ఏమీ చెయ్యలేక భోగం వాళ్ళు తమ కులం పేరే
మార్చుకుంటే,మాదిగలు గౌరవ సుచకంగా తమ పేర్లకు తగిలించుకొని ఎదురు తిరిగి
నిలబడ్డారు.చివరికి చంద్రబాబు నాయుడు కూడా నేనే పెద్ద మాదిగను అనే
పరిస్థితి వచ్చింది. అసలు అర్ధం తెలిశాక తమ తిట్ల నిఘంటువును తెలివైనవాళ్ళూ సభ్యతగలవాళ్ళు
సవరించుకుంటారు
a thought provoking war cry.... great one.
రిప్లయితొలగించండిధన్యవాదాలు
తొలగించండిచాలా బాగా రాశారు. మీ వేదన అర్ధమైంది. వాస్తవానికి పింజారీ అనే శబ్దం అర్ధం ఈ రోజే అర్ధమైంది. చాలా వెనుకబడిన వర్గం. మా వూళ్ళో (ప్రకాశం జిల్లా) నా చిన్నతనంలో గంటా సయబ్బు అని సంవత్సరంలో ఎండా కాలంలో కేవలం రెండు నెలలు రాత్రి పూట వూళ్ళో తిరుగుతూ ఆ వీధిలో వున్న వాళ్ళ పేర్లు పిలుస్తూ వెళ్ళేవాడు. బహుశా వాళ్ళు కూడా దూదేకులు అయి వుందచ్చు.
రిప్లయితొలగించండికులాలు కేవలం వ్రుత్తులు ఆధారంగా ఏర్పడినవి. దురద్రుష్టం, కులాలు మిగిలినయ్, కుల వ్రుత్తులు పోయాయి. రిలయన్స్ వాడు, నాయీ బ్రాహ్మనుని వ్రుత్తి మీద కూదా ద్రుష్టి పెట్టడు. వాషింగ్ మిషన్లు వచ్చాక రజక వ్రుత్తి దెబ్బతింది. కులాలు వారు చేసే కుండలు ఎవరు కొనట్లేదు.
కొంతమంది మీ బ్లాగులో వ్యాఖ్య చేసినట్లు, కేవలం బ్రాహ్మణ కులం వలనే ఏదో ఘోరం జరిగింది అంటే ఒప్పుకోను. అన్ని కులాలలోని వ్యక్తుల మనస్తత్వాన్ని బట్టి వుంటుంది. ఉదా: ఇందిరా గాంధీ లాంటి పండిత పుత్రిక 70 సంవత్సరాల క్రితమే కులాంతర వివాహం చేసుకుంది. డబ్బున్న వాడే గొప్పోడు. కులంతో పనిలేకుండా వాడి చుట్టూ తిరుగుతారు. లోక సహజం.
గంటా సాయిబులు(బి.సి.ఇ4).దూదేకుల సాయిబులు (బి.సి.బి4)వేరు.
తొలగించండిదిగువ పేర్కొన్న 14 రకాల ముస్లింలు మాత్రమే బీసీ-E క్రింద రిజర్వేషన్లకు అర్హులు:
1. అచ్చుకట్లవాండ్లు, సింగలి, సింగంవాళ్లు, అచ్చుపనివాళ్లు, అచుకట్టువారు,
2. అత్తరు సాయిబులు, అత్తరోళ్లు
3. దోభీ ముస్లిం , ముస్లిం దోభీ , ధోబి ముసల్మాన్ , తురక చాకలి , తురక చాకల , తురుక సాకలి , తురకల వన్నన్ , చాకల , సాకలా , చాకలా , ముస్లిమ్ రజకులు
4. ఫకీరు , ఫకీరు బుడ్‌బుడ్కి , గంటి ఫకీర్, గంటా ఫకీర్లు , తురక బుడ్‌బుడ్కి , దర్వేష్ ఫకీర్
5. గారడీ ముస్లిమ్ , గారడీ సాయిబులు , పాముల వాళ్లు , కనికట్టు వాళ్లు , గారడోళ్లు , గారడిగ
6. గోసంగి ముస్లిమ్, పకీరుసాయిబులు
7. గుడ్డి ఎలుగువాళ్లు, ఎలుగుబంటు వాళ్లు, ముసల్మాన్ కీలుగుర్ర వాళ్లు
8. హజమ్, నాయి, నాయి ముస్లిమ్, నవీద్
9. లబ్బి , లబ్బాయి , లబ్బన్ , లబ్బ
10. పకీరియా, బోరెవాలె, డేరా ఫకీర్లు, బొంతల
11. ఖురేషి, కురేషి,ఖసబ్, మరాఠి ఖాసబ్, కటిక ముస్లిం, ముస్లిం కటిక.
12. షైక్, షేక్
13. సిద్ధి, యాబ, హబ్షి, జసి
14. తురక కాశ, కుక్కుకొట్టె జింకసాయిబులు, చక్కిటకానెవాలె, తిరుగుడు గుంటలవారు, తిరుగాటిగంట, రోళ్లకు కక్కు కొట్టేవారు, పట్టర్ పోదులు, చక్కటకారె,
ముస్లిముల్లోనే మళ్ళీ ఈ 13 ముస్లిం కులాలు OC లు కాబట్టి రిజర్వేషన్లకు అర్హులుకాదు:1.సయ్యద్, 2.షేక్,3. మొఘల్, 4.పఠాన్, 5.ఇరాని,6. ఆరబ్,7. బొహరా, 8.షియా,9. ఇమామి, 10.ఇష్మాయిల్, 11.కుచిమెమన్,12. జమాయత్,13. నవాయత్లు
మీ బ్లాగుని పూదండ తో అనుసంధానించండి.
రిప్లయితొలగించండిwww.poodanda.blogspot.com
బ్లాగు యుఆరెల్ పంపాను అనుసంధానించండి
తొలగించండిపింజారి మాటవెనుక ఇంత గ్రంధం ఉందని నాకు తెలియనే తెలియదు!తెలిపినందుకు ధన్యవాదాలు!
రిప్లయితొలగించండిపదిమందికీ ఈ సంగతులు తెలుపండి.పింజారులు బీబీ నాంచారమ్మ కులపోళ్ళూ,ఆమె వారసులూ కాబట్టి వాళ్ళను నిష్కారణంగా ఎగతాలి చేసినా తిట్టినా ఆ తల్లిని తిట్టిన పాపం తగులుతుందనీ తెలియజేయండి.
తొలగించండిEE padam vadadam valana kritam okasari DUMARAM lechindi. Controversies ku pokandi Sir.
రిప్లయితొలగించండిDr.A.Jagadeesh Nellore(AP),India
డాక్టర్ జగదీశ్ గారూ మీరు వేలాదిమందికి విద్యాదానం చేస్తున్న మేధావులు,సాంఘీక శాస్త్రవేత్తకూడా.ఈ పదాన్ని సగౌరవంగా వాడితే ఏ వివాదమూ ఉండదు.అవమాన పదం లాగా కావాలని తెలిసీ వాడుతున్నవాళ్ళకు తెలియజెప్పటం కోసమే ఇలా రాయాల్సి వచ్చింది.
తొలగించండిరహమతుల్లా గారూ, పింజారీ ఒక కులమని మీ కామెంట్ చూసిన తరువాతే తెలిసింది. మీరన్నట్టు మనది వసుదైక కుటుంబం. తెలీక నా రచనలో వాడినందుకు సిగ్గు పడుతున్నాను. నా బ్లాగు కేవలం మనోరంజకత్వం కోసమే. నా ఈ చిన్న రచనా ప్రపంచంలో కూడా ఎవరినీ బాధ పెట్టే వాక్యం ఉండకూడదు. దానిని ఈరోజే సవరించాను.
రిప్లయితొలగించండిధన్యవాదాలు చక్రపాణిగారూ
తొలగించండిmanchi pani chestunnavu satthaar bhai.. upayogakaramaina blog
రిప్లయితొలగించండిపింజారీ అనే కులం ఒకటి ఉన్నట్లు కూడా చాలా మంది తెలుగు వారికి తెలియదు.
రిప్లయితొలగించండివెంకటేశ్వర స్వామి మతాంతర వివాహం చేసుకున్న భార్య బీబీ నాంచారమ్మ పింజారీ.
బ్రహ్మం గారి శిష్యుడు సిద్దయ్య పింజారీ.
నాదస్వర విద్వాంసుడు పద్మశ్రీ షేక్ చిన మౌలానా పింజారీ.
బుర్రకధ పితామహుడు పద్మశ్రీ షేక్ నాజర్ పింజారీ.
కొన్ని చోట్ల వీరిని నూర్ బాషాలు,తెలుగు ముస్లిములు,దూదేకుల సాయిబులు,లదాఫులు,బాసరాని సాయిబులు అని కూడా పిలుస్తారు.
వీరు హిందూ ముస్లిం ఆచారాల కలబోత లాగా ఉంటారు.
పింజారీలు అసలైన లౌకికులు, సాధు స్వభావులు,అహింసావాదులు.
పింజారీలు అడుక్కోరు. దూది ఏకి,పరుపులు కుట్టి,సోడాలు అమ్మి కష్టజీవులుగా బ్రతికారు.
అయితే కొందరు హిందువులు పింజారీ అని కొందరు ముస్లి ములు లద్దాఫ్ అనీ తమ తిట్ల భాషలో సభ్యత సంస్కారం మరచి ఇదొక కులం అని తెలిసాక కూడా హీనంగా హేళనగా మాట్లాడుతుంటారు.
"పింజారీ వెధవ" అనే తిట్టు డైలాగు జంధ్యాలగారి మొదలు అనేకమంది పెద్దలు సినిమాల్లో ఉపయోగించారు.
దూదేకుల కులస్థులు తగిన ప్రజాబలం లేక తోటి ఉర్దూ సాయిబులు దగ్గరకెళితే "మాహీనం గురించి ఎవరికి చెప్పుకోము?రోలొచ్చి మద్దెల దగ్గర మొరపెట్టుకున్నట్లుంది, మీలో కొందరు విగ్రహారాధన .లాంటి కాఫిర్ పనులు కూడా చేస్తారు.మీరు సగం మాత్రమే సాయిబులు మిమ్మల్ని బీసీ ఇ గ్రూపులో మాతో అందుకే కలుపుకోలేదు అన్నారట.
ఇప్పుడు దూదేకులు,మాదిగలు,బ్రాహ్మణులు.... రేపు ఇంకో కులం.
దేవుడి లాంటి పిల్లలు ఏదో ఒక కులం,మతం ముద్రతో పుట్టక తప్పటంలేదు.
పూర్వం కాలం చేసిన పెద్ద కులాల పెద్దలే ఈ జన్మలో యానాదులుగా, పింజారీలుగా పుట్టలేదని గ్యారంటీ ఏమన్నా ఉందా? ప్రాణాన్ని నిలిపే రక్తం అందరిదీ ఒకటే కదా?
కొన్ని కులాలలో పుట్టటమే వాళ్ళ తప్పైనట్లు భావిస్తారో ఏమో మరి!
కులం కొందరికి వరమైతే కొందరికి కర్ణుడి శాపంలాగా ఉంది.
మనిషి సాంఘీక జంతువు కాబట్టి శక్తి చాలని వాడు గత్యంతరంలేక సాధుత్వం వహించాల్సివస్తోంది.
https://www.facebook.com/photo.php?fbid=1145631038802218&set=a.233025936729404.60739.100000659993594&type=3&theater
రిప్లయితొలగించండిhttp://nrahamthulla.blogspot.in/2013/07/blog-post.html?showComment=1460275262038#c8159766352240323328
రిప్లయితొలగించండిhttps://te.wikipedia.org/wiki/%E0%B0%A6%E0%B1%82%E0%B0%A6%E0%B1%87%E0%B0%95%E0%B1%81%E0%B0%B2#.E0.B0.AE.E0.B1.82.E0.B0.B2.E0.B0.BE.E0.B0.B2.E0.B1.81
రిప్లయితొలగించండిరహమతుల్లాగారు నేను హిందువును మాతండ్రి కలియుగదైవమైన శ్రీవేంకటేశ్వరుని బిడ్డలం కనుక ఆయన పత్నీ పుత్రులు మీరు మా సహోదరురులే మీ కులదైవసమాన గురుతుల్యులు సంత్ కబీర్ దాస్ గారి పూర్వీకులు హిందువులే మీరు మా రక్త సంబంధీకులు
రిప్లయితొలగించండిజై నూర్బాషా
జైశ్లీరాం