అబు దావూద్ లో ప్రార్ధన గురించి కొన్ని వాక్యాలు
1.సఫ్వాన్ ఇబ్న్ అల్ మువత్తల్ భార్య ప్రవక్త దగ్గరకొచ్చి ‘నేను ప్రార్ధన చేసేటప్పుడు నా భర్త నన్ను కొడుతున్నాడు ‘ఉపవాసం చెయ్యొద్దంటాడు,పొద్దు పొడిచేదాకా నిద్ర లేవడు’ అని ఫిర్యాదు చేసింది.అందుకు సఫ్వాన్ ‘ఆమె రెండు సూరాల దీర్ఘ ప్రార్ధన చేస్తుంది అంటాడు. ఒకసూరా చాలు అంటాడు ప్రవక్త.ఆమె చాలా ఎక్కువసేపు ఉపవాసం చేస్తుంది.నేను కుర్రవాడిని ఉండలేకపోతున్నాను అంటాడు సఫ్వాన్.భర్త అనుమతి లేకుండా భార్యలు ఉపవాసం చేయొద్దు అంటాడు ప్రవక్త. మేము నీళ్ళు సరఫరా చేస్తాము.మా తెగలో వాళ్ళంతా పొద్దు పొడిచాకే నిద్ర లేస్తారు అంటాడు సఫ్వాన్.అయితే నిద్ర లేవగానే ప్రార్ధన చెయ్యండి అంటాడు ప్రవక్త. (అబు దావూద్ 1016)
2.భక్తుడైనా భక్తిహీనుడైనా ఘోర పాపాలు చేసినవాడైనా సరే ప్రార్ధన చెయ్యాల్సిందే.(అబు దావూద్ 1052)
3.అమ్ర్ ఇబ్న్ ఉఖైష్ అనే వడ్డీ వ్యాపారి జీవితంలో ఎన్నడూ ప్రార్ధన చేయలేదు. అల్లాపై విశ్వాసం తో ఉహద్ యుద్ధంలో పాల్గొన్నందువల్ల పరలోకంలో ప్రవేశిస్తాడు. (అబు దావూద్ 1056)
4.యుద్ధంలో,వర్షంలో చేసే ప్రార్ధన తిరస్కరించబడదు (అబు దావూద్ 1058)
5.మీరు మసీదును చూసినప్పుడు ప్రార్ధనా పిలుపు విన్నప్పుడు ఎవరినీ చంపకండి.(అబు దావూద్1112)
6. ఒక వ్యక్తి ‘నాకు ఖైబర్ కొల్ల ధనం చాలా దొరికింది’ అని సంబరపడిపోతుంటాడు.రెండు రకాతుల అదనపు ప్రార్ధన చేసిన వాడికే నీకంటే ఎక్కువ ధనం దొరికింది’ అంటాడు ప్రవక్త.(అబు దావూద్1197)
7.ప్రార్ధనా స్థలం లోనే ప్రవక్త పొట్టేలును తన స్వహస్తాలతో కోసి బలి ఇస్తూ ‘బలి అర్పించని నా మిగతా జనం కోసం ఈ బలి ఇస్తున్నాను’అంటాడు.(అబు దావూద్1213)
8.’మసీదులో ఉంటే మనసులు మృదువుగా అవుతాయి.మోకరించే ప్రార్ధన లేని మతం లో ఏ మంచీ లేదు. ప్రార్ధన కపటస్తులకు భారంగా ఉంటుంది.ప్రార్ధనలోని మేళ్ళు మీకు తెలిస్తే మోకాళ్లతో పాకుకుంటూ కూడా వస్తారు.ప్రార్ధనలోని ముందు వరుస దేవదూతలవరుస లాంటిది.(అబు దావూద్1318,218)
9.ఉహద్ యుద్ధంలో చనిపోయిన అమర వీరుల రక్త దేహాలను కడగకుండా ప్రార్ధన చెయ్యకుండానే పూడ్చిపెట్టారు. (అబు దావూద్1377)
10.మీరు ఇక్కడ ప్రార్ధన చేస్తే ఎరూషలేములో చేసినట్లే.ఇబ్రాహీం స్థానాన్నే మీ ప్రార్ధనా స్థలం గా చేసుకోండి.ప్రజల్ని చూడటానికి వచ్చిన వ్యక్తి ప్రార్ధన నడిపించ కూడదు.ఆ ప్రాంతంలోని సొంత మనుషులే ప్రార్ధన నడిపించాలి.సామూహిక ప్రార్ధనలో పాల్గొంటే ఇహ్రామ్ ధరించి హజ్ యాత్ర,ఉమ్రా చేసినంత పుణ్యం (అబు దావూద్1462,1817,236,220)
11.అప్పులు తీర్చకుండా చనిపోయిన వారి మృత దేహాలకు నేను ప్రార్ధన చేయను.నేను విశ్వాసికి తన కంటే ఎక్కువ దగ్గరగా ఉన్నాను.అప్పు తీర్చకుండా అతను చనిపోతే ఆ బాధ్యత నాపైన పడుతుంది’ (అబు దావూద్ 1482)
12.’సారాయి తాగేవాడు ప్రార్ధనకు రాకూడదు.ప్రతి మత్తు పదార్దమూ నిషిద్ధమే.మత్తుడి ప్రార్ధనను అల్లా అంగీకరించడు.’(అబు దావూద్ 1650,1656)
13.అన్నం తినటం కోసం గానీ మరి దేనిగురించిగానీ ప్రార్ధనను వాయిదా వేయకూడదు (అబు దావూద్ 1692)
14.ప్రార్ధనాపరుని దృష్టిని మళ్ళించే వస్తువేదీ ఎదురుగా ఉండకూడదు.దృష్టిని ఆకర్షించే ఆడంబర వస్త్రం బదులు ఎలాంటి గుర్తులూ లేని సాదారణ ముతక బట్టనే ప్రార్ధన లో పరుచుకోండి (అబు దావూద్ 825,1868)
15.అత్తరు సువాసనల గుబాళింపుతో మసీదులో చేసే స్త్రీ ప్రార్ధన ఆమె తిరిగి స్నానం చేసే దాకా అంగీకరించబడదు.అసలు అలాంటి వాసనలు పూసుకొన్న స్త్రీలు మాతో కలిసి రాత్రి ప్రార్ధనకు రావద్దు.మసీదులో అలాంటి ఘాటు వాసనలు రేపే పురుషుడి ప్రార్ధన కూడా అల్లా ఆలకించడు (అబు దావూద్ 1940,1941,1944)
16.అత్యాచారానికి గురైన ప్రార్ధనాపరురాలిని అల్లా క్షమించాడు (అబు దావూద్ 2057)
17.ప్రార్ధన తరువాత ప్రవక్త కన్నీళ్ళు కారుస్తూ శ్రోతల హృదయాలు కరిగేలా హితబోధ చేసేవారు (అబు దావూద్ 2186)
18.గుహలలో బందీలై ఏకాంత తపస్సు (మోనాస్టరీ ప్రార్ధనలు) చేయవద్దు.అలా కొత్తగా కనుక్కున్న వాటిల్లో తప్పులుంటాయి. ఒంటరి జంతువుపైనే తోడేలు దాడి చేస్తుంది. ఇళ్ళల్లో ప్రార్ధించినా మసీదుకొచ్చినప్పుడు అందరితో కలిసి సామూహికంగా ప్రార్ధించండి. (అబు దావూద్ 214,228)
19.ప్రజలను సరి చెయ్యటం ప్రార్ధన కంటే ,దాన ధర్మాలకంటే ,ఉపవాసం కంటే ఉత్తమమైనది (అబు దావూద్ 2310)
20.’ఓ అల్లా నన్ను నరకం నుంచి రక్షించు ‘ అనే మాటతో నీవు ఉదయం,సాయంత్రం వేళల్లో ఏడు సార్లు ప్రార్ధిస్తే దేవుడు నీ చిట్టాలో నీకు రేయి పగలు రక్షణ రాస్తాడు. (అబు దావూద్ 2410)
21.కోడి పుంజును తిట్టొద్దు.అది మిమ్మల్ని ప్రార్ధనకోసమే లేపుతుంది (అబు దావూద్ 2416)
22.ఫాతిమా హసన్ గారిని కనగానే హాసన్ చెవి లో ప్రవక్త ప్రార్ధనా పిలుపు (అజాన్ ) వినిపించారు. (అబు దావూద్ 2419)
23.ప్రవక్త పలికిన చివరి పలుకులు: ‘ప్రార్ధన చెయ్యండి ,ప్రార్ధన చెయ్యండి.మీ భార్యబిడ్డలను దేవునికి భయపడి జాగ్రత్తగా చూసుకోండి ’ (అబు దావూద్ 2447)
24.ప్రశాంతంగా మీ ప్రభువును ప్రార్ధించండి.పక్క వారికి ఇబ్బంది కలిగించేలా ఒకరిని మించిన పెద్ద గొంతుతో మరొకరు అరిచి ప్రార్ధించవద్దు.ఉమర్ పెద్ద గొంతుతో ప్రార్ధన చేయటం అల్లా అనుమతించలేదంటూ ప్రవక్త అబూబకర్ తో ప్రార్ధన చేయిస్తారు (అబు దావూద్ 2447,2195)
25.ప్రవక్త పండుగ ప్రార్ధన,ప్రసంగం ముగించి ప్రసంగా వేదిక దిగి బిలాల్ చేతి ఊతంతో ఆడవాళ్ళ దగ్గరకొచ్చారు.బిలాల్ ఒక గుడ్డ పరచి పట్టుకుంటే స్త్రీలు అందులో తమ ఉంగరాలు ఇతర ఆభరణాలు కానుకలుగా వేశారు.స్త్రీలు ఒక వరుసలో ,పురుషులు మరో వరుసలో ప్రార్ధనకు నిలబడేవారు.పురుషులు తస్బీహ్ చెబితే ,స్త్రీలు చప్పట్లు కొట్టేవారు (అబు దావూద్363,439,440,891)
26.సామూకంగా ప్రార్ధించండి.ఒంటరి జంతువుపైనే తోడేలు దాడి చేస్తుంది.సామూహిక ప్రార్ధన చేస్తే 25 అడివిలో ప్రార్ధన చేస్తే 50 ప్రార్ధనల ప్రతిఫలం,పాపాల క్షమాపణ దొరుకుతుంది.ప్రార్ధనకోసం పిలిచే వానికి అతని స్వరం వినబడినంత వరకు క్షమాపణ దొరుకుతుంది. (అబు దావూద్214,203,221 )
27.శుక్రవార సూర్యోదయం అత్యుత్తమమైనది.శుక్రవారం నాడే : దేవుడు ఆదామును చేశాడు.ఆదామును పరలోకం నుండి వెళ్ళగొట్టాడు .ఆదామును క్షమించాడు.ఆదాము చనిపోయాడు.చివరి ఘడియ వస్తుంది. మనిషి ,జీన్నులు తప్ప ప్రతి జంతువు చివరి ఘడియకోసం ఆరోజునే భయంతో ఎదురు చూస్తాయి.ముస్లిములు ప్రార్ధించే సమయంలో మాత్రం రాదు.శుక్రవార చివరి ఘడియల్లోనే అంతిమ ఘడియ వస్తుంది.సరైన కారణం లేకుండా సామూహిక ప్రార్ధన ఎగ్గొట్టి ఒంటరిగా చేసుకునే ప్రార్ధన అంగీకరించబడదు (అబు దావూద్ 400,215)
28.భూమి దేవుని ప్రార్ధనా స్థలం (మసీదు) మనిషిని శుద్ధిచేసే స్థలం. (అబు దావూద్ 192 )
29.చివరి ఘడియ సూచనల్లో ఒకటి: మసీదులో భక్తులు ఇమాము చెప్పినట్లు చెయ్యరు.అసలు ప్రార్ధన చేయించటానికి ఇమామే దొరకడు. (అబు దావూద్ 232)
30.యూదులు చెప్పులు లేకుండా ప్రార్ధన చేస్తారు.మీరు మసీదులో చెప్పులు తొడుక్కోనే ప్రార్ధన చెయ్యండి.కానీ వాటిని శుభ్రం చేయండి. (అబు దావూద్ 256)
రిప్లయితొలగించండి24.ప్రశాంతంగా మీ ప్రభువును ప్రార్ధించండి.పక్క వారికి ఇబ్బంది కలిగించేలా ఒకరిని మించిన పెద్ద గొంతుతో మరొకరు అరిచి ప్రార్ధించవద్దు.ఉమర్ పెద్ద గొంతుతో ప్రార్ధన చేయటం అల్లా అనుమతించలేదంటూ ప్రవక్త అబూబకర్ తో ప్రార్ధన చేయిస్తారు (అబు దావూద్ 2447,2195)
ఎవరు పాటిస్తున్నారు
అల్లాహ్ ప్రార్ధనా గీతాలు పంపండి
రిప్లయితొలగించండి