ఈ బ్లాగును సెర్చ్ చేయండి

14, మే 2010, శుక్రవారం

జిహాద్ అంటే ధర్మపోరాటం

జిహాద్ అంటే ధర్మపోరాటం, న్యాయంకోసం పోరాటం అని అర్ధం.తీవ్రవాదులు ఉగ్రవాదులు హింసకు పాల్పడే అరాచకవాదులు తమ దుర్మార్గపు పనులను కూడా జిహాద్ అనే పిలుస్తున్నందువలన ఇంత మంచి పదం చెడ్డదైపోయింది.
జిహాద్ లు రెండు రకాలు
1. జిహాద్-ఎ-కుబ్రా
మనలోని మంచి చెడుల మధ్య జరిగే అంతర్గతపోరాటం
2. జిహాద్-ఎ-సొగ్రా
మన చుట్టూ జరిగే చెడును నివారించటంకోసం చేసే బహిర్గత పోరాటం.

న్యాయాన్ని అమలు చేయడం. చెడును ఆపటం రెండూ జిహాదే. చెడును చేతితో ఆపగలిగితే ఆపు. చేతితో ఆపలేకపోతే నోటితో ఆపు. నోటితోకుడా ఆపలేకపోతే మనసులోనైనా చెడుపనిని అసహ్యించుకో అని ప్రవక్త చెప్పారు.
*మంచిని ఆపుతూ దుష్టులు జిహాద్ అని అరవటం వల్ల ఈ పదం అభాసుపాలయ్యింది.సూర్యకాంతం మంచిపేరే అయినా గయ్యాళి అనే అర్ధం ఎలా వచ్చిందో ఇదికూడా అంతే.దేవదాసు అనే పేరుకూడా సారాయిదాసు లా జిహాద్ అంటరాని దయ్యంలా అయ్యింది.
*అల్‌ఖైదాలో చేరటం ఇస్లాంకు విరుద్ధం.నిషిద్ధ 'తక్‌ఫిరిజమ్‌' సిద్ధాంతాన్ని అల్‌ఖైదా అనుసరిస్తోంది.అల్‌ఖైదాతో సంబంధం పెట్టుకోవటం ఇస్లాం బోధనల ప్రకారం నిషిద్ధం.---- సౌదీ మతాచార్యులు,రాజ దర్భారులో సలహాదారు షేక్‌ అబ్దుల్‌ మోహ్‌సెన్‌ అల్‌-ఒబీకాన్‌.(ఈనాడు 14.1.2010)
*ఇరుపక్షాల వాళ్ళూ తమది ధర్మయుద్ధం ( జిహాద్ ) అనే అనుకుంటారు.దేవతలు రాక్షసులు ధర్మం తమ పక్షానే ఉందని చెబుతూ యుద్ధం చేసుకున్నారు.అసలు నరహత్యలు హింసతో కూడిన యుద్ధం అనేదే అధర్మం.అహింస పరమ ధర్మం కాబట్టి అహింస తో కూడిన యుద్ధమే ధర్మయుద్ధం ( జిహాద్ ) అవుతుంది. ఉదాహరణకు గాంధీ గారు నడిపిన స్వాతంత్రోధ్యమం సత్యాగ్రహం నిరాహారదీక్షలు,బుద్ధుడు,ఏసు చేసిన అహింసాయుత పోరాటాలన్నీ ధర్మపోరాటాలు (జిహాద్ )లు.అంతే కానీ పవిత్ర యుద్ధం పేరుతో హింసకు పాల్పడి తోటి అమాయక సోదరులను చంపి అల్లా శాంతిస్తాడని,అది అల్లా యొక్క పని అని చెప్పటం మహా పాపం.
*నరబలితో ఏ దేవుడూ శాంతించడు.ఇంకా పాపం చుట్టుకుంటుంది.క్షుద్రదేవతలు కూడా రాను రాను శాఖాహారం వైపే మళ్ళాయి.ఇలాంటి ముష్కరులు ఏ మతంలో ఉన్నా రాక్షసత్వం వదిలి మానవత్వాన్ని పెంచుకోవాలి.లేకపోతే కసబ్ కు పట్టిన గతే పడుతుంది.ప్రజాస్వామ్యయుగంలో హంతకుల్ని మతం రక్షించలేదు.

5 కామెంట్‌లు:

  1. జీహాద్ అన్న పదాన్ని పవిత్రం గానే పరిగణిస్తారు అందరూ..ఎవరో కొంత మండి దిక్కు మాలిన వెధవలు హైజాక్ చేసినంత మాత్రాన దాని పవిత్రత మారదు..

    రిప్లయితొలగించండి
  2. బాగుంది..మీ ఇస్లాం గురించి ఇంకా తెలుసుకోవాలని ఉంది...

    రిప్లయితొలగించండి
  3. అశోక్ ,kvsv ,కత పవన్ లకు ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి
  4. అనితర సాధ్యమైన అక్షరశిల్పులు
    మంచి పుస్తకం
    సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ మంచి రచయితగా, పరిణతి చెందిన పాత్రికేయునిగా చిరపరిచితులు. భారత స్వాతంత్య్రోద్యమంలో ముస్లిములు నిర్వహించిన పాత్రను వివరిస్తూ ఆయన రాసిన పరిశోధనా వ్యాసాలు పుస్తకాలుగా వెలువడి పాఠకాదరణ పొందాయి. ముస్లిం స్వాతంత్య్ర సమర యోధుల గురించిన సమాచారం సేకరించడానికి ఎంతో కష్టపడిన నశీర్‌ అహమ్మద్‌ ఇప్పుడు మరింత క(ఇ)ష్టపడి 'అక్షరశిల్పులు' అనే గ్రంథాన్ని అందించారు.

    ఇందులో రాష్ట్రం నలుమూలలా ఉన్న 333 మంది ముస్లిం కవులు, రచయితలు, అనువాదకులను పరిచయం చేస్తూ, వారు చేసిన, చేస్తున్న సాహితీ సేవను పాఠకుల ముందుంచారు. ఆయా కవులు, రచయితలు, అనువాదకుల పరిచయాలు, వారు చెక్కిన సాహితీ శిల్పాల గురించి క్లుప్తంగానే చెప్పినప్పటికీ, తనకు అంది (తెలిసి)నంత వరకూ వారి చిరునామాలు, టెలిఫోన్‌ నంబర్లను సేకరించడానికి చేసిన కృషి, వారి గురించి రాసిన ప్రతి అక్షరంలోనూ సాటి ముస్లింల పట్ల గల ప్రేమాభిమానాలు, వారిని పదిమందికీ పరిచయం చేయడానికి పడ్డ తపన సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తాయి.

    పాత్రికేయ ప్రముఖులు పొత్తూరి వెంకటేశ్వరరావుగారన్నట్లు ఈ పుస్తకం తెలుగు సాహిత్య పరిశోధకులకు, రచయితలకు మార్గదర్శివంటిదని చెప్పవచ్చు. అయితే ఇంకా ఇందులో సంకలన కర్త దృష్టిలోకి రాని ముస్లిం పాత్రికేయులు, రచయితలు మరెందరో ఉండి ఉండవచ్చు. తమ వివరాలను వెల్లడించడానికి ఇష్టపడని వారు కూడా ఉండి ఉండవచ్చు. అయినప్పటికీ ఇటువంటి పుస్తకం ఒకదానిని తీసుకు రావాలన్న నశీర్‌ అహమ్మద్‌ ఆలోచన ను మెచ్చుకోక తప్పదు.

    అక్షరశిల్పులు (ముస్లిం కవులు- రచయితల
    సంక్షిప్త పరిచయం)
    కూర్పు: సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌
    పుటలు: 180, వెల రూ. 150
    ప్రతులకు: ఆజాద్‌ హౌస్‌ ఆఫ్‌ పబ్లికేషన్స్‌, శివప్రసాద్‌ వీధి, కొత్తపేట, వినుకొండ- 522 647, గుంటూరు జిల్లా మరియు అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు.
    సోల్‌ డిస్ట్రిబ్యూషన్‌: తెలుగు బుక్‌హౌస్‌, 3-3-862,
    కాచిగూడా ఎక్స్‌రోడ్స్‌, హైదరాబాద్‌- 500 027.

    - డి.వి.ఆర్‌. భాస్కర్‌ (సాక్షి 10.7.2010)

    రిప్లయితొలగించండి